హోమ్ /వార్తలు /తెలంగాణ /

తెలంగాణ గర్వించదగ్గ బిడ్డ.. నిఖత్ జరీన్ పై సీఎం కేసీఆర్ ప్రశంసలు..!

తెలంగాణ గర్వించదగ్గ బిడ్డ.. నిఖత్ జరీన్ పై సీఎం కేసీఆర్ ప్రశంసలు..!

నిఖత్ జరీన్

నిఖత్ జరీన్

ఆదివారం జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ ఫైనల్ పోటీల్లో, 50 కేజీల విభాగంలో, నిఖత్ జరీన్ స్వర్ణ పథకాన్ని సాధించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Telangana

ఢిల్లీలో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో భారత బాక్సర్ల జోరు కొనసాగుతోంది. తాజాగా తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ పసిడి పంచ్ విసిరింది. 50 కిలోల కేటగిరీలో నిఖత్ జరీన్ స్వర్ణం సాధించింది. న్యూ ఢిల్లీ లోని కే.డి జాదవ్ ఇండోర్ స్టేడియంలో, ఆదివారం జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ ఫైనల్ పోటీల్లో, 50 కేజీల విభాగంలో, నిఖత్ జరీన్ స్వర్ణ పథకాన్ని సాధించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా నిఖత్ జరీన్ ను సిఎం కేసీఆర్ అభినందించారు. ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. వియత్నాంకు చెందిన బాక్సర్ న్యూయెన్ పై 5-0 తేడాతో ఘన విజయం సాధించి, మహిళల వరల్డ్ బాక్సింగ్ చాంపియన్షిప్ లో భారత్ కు మరోసారి గోల్డ్ మెడల్ సాధించి పెట్టిన నిఖత్ జరీన్ తెలంగాణ గర్వించదగ్గ బిడ్డ అని సిఎం అన్నారు. తన వరుస విజయాలతో దేశఖ్యాతిని నిఖత్ జరీన్ మరోసారి ప్రపంచానికి చాటి చెప్పిందన్నారు.

ప్రపంచ చాంపియన్ పోటీల్లో తన కెరీర్ లో ఇది రెండవ బంగారు పథకం కావడం గొప్ప విషయమని సిఎం అన్నారు. క్రీడాభివృద్ధికి, క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారి సంక్షేమానికి, తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి వుందన్నారు. ఈ దిశగా తమ కృషిని కొనసాగిస్తూనే వుంటామని సిఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిష్ చరిత్రలో నిఖత్ జరీన్ కు ఇది రెండో స్వర్ణ పతకం. 2022లో 52 కిలోల విభాగంలో నిఖత్ వరల్డ్ చాంపియన్ గా నిలిచింది.

తాజా ప్రపంచ చాంపియన్ షిప్ పోటీల్లో భారత్ సాధించిన స్వర్ణాల సంఖ్య మూడుకు పెరిగింది. నిన్న జరిగిన బౌట్లలో నీతూ ఘంఘాస్ (48 కిలోలు), స్వీటీ బూరా (81 కిలోలు) పసిడి పతకాలు సాధించిన సంగతి తెలిసిందే. మరో మహిళా బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ కూడా భారత్ కు పతకం ఖాయం చేసింది.

First published:

Tags: Boxing, CM KCR, Local News, Nikhat Zareen

ఉత్తమ కథలు