భారతదేశానికి స్వతంత్రం సిద్దించి 75సంవత్సరాలు పూర్తి చేసుకొని 76వ సంవత్సరంలో అడుగుపెట్టిన శుభతరుణంలో తెలంగాణ (Telangana)ప్రభుత్వం 15రోజుల పాటు వజ్రోత్సవ వేడుకల(Diamond Jubilee)ను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే మంగళవారంTuesday ఉదయం 11.30గంటలకు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన(Mass National Anthem)కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్ ఆబిడ్స్(HYDERABAD ABID)జీపీవో సర్కిల్( GPO CIRCLE)లో జరిగిన సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ (KCR), ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(CS) సోమేష్‌కుమార్(Someshkumar), ఎంపీ కేకే (MP KK)పాల్గొన్నారు. ఈ మేరకు ఆబిడ్స్, నెక్లెస్ రోడ్డు(Necklace Road) వద్ద ట్రాఫిక్‌ని కొంత సమయం నియంత్రించి ఈకార్యక్రమాన్ని దిగ్విజయం నిర్వహించారు.
అందరి గొంతుక ఒకటే ..
హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన సరిగ్గా ఆగస్ట్ 16వ తేది నాడు 11.30 నిర్వహించారు. ఈకార్యక్రమంలో కుల,మతాలకు అతీతంగా ప్రతిఒక్కరూ పాల్గొన్నారు. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రైవేట్ ఆఫీసులు, సంస్థలు, బ్యాంకులు, విద్యా సంస్థలు, మాల్స్, సినిమా థియేటర్లు, మెట్రో రైల్ స్టేషన్‌లలో ఇలా ప్రతిచోటా ఎక్కడివారక్కడ సామూహిక జాతీయ గీతాన్ని ఆలపించించారు.
Live: CM Sri KCR participating in the mass recital of National Anthem at Abids, Hyderabad https://t.co/UJHMpAuoEX
— Telangana CMO (@TelanganaCMO) August 16, 2022
మార్మోగిన జాతీయ గీతాలాపన..
75వ స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలను ఆగస్ట్ 8న ప్రారంభమయ్యాయి. ఆగస్ట్ 22 వరకు వజ్రమహోత్సవాలు కొనసాగనున్నాయి. వజ్రోత్సవాల్లో రోజుకో కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రభుత్వం. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశభక్తిని చాటాలని పిలుపునిచ్చాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. ఇందులో భాగంగానే మంగళవారం సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో అందరూ పాల్గొని తమ దేశభక్తిని చాటుకున్నారు.
అన్నీ చోట్లో ఒకేసారి..
రాష్ట్రంలోని అన్నీ ప్రధాన కూడళ్లు, మంత్రులు, ప్రజాప్రతినిధుల కార్యాలయాలు, జిల్లా కలెక్టర్ కార్యాలయాలు,అంగన్‌వాడీ కేంద్రాల్లో జాతీయ గీతాన్ని సామూహికంగా ఆలపించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.