Home /News /telangana /

HYDERABAD CM KCR MEETING WITH DISTRICT COLLECTORS VRY

CM KCR : భార్య,భర్తలు ఒకే దగ్గర పనిచేసే విధంగా చూడండి.. కలెక్టర్ల‌తో సీఎం

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

CM KCR : ఉద్యోగు నియమాకం, కొత్త జోనల్ వ్యవస్థపై సీఎం కేసిఆర్ కలెక్టర్‌ల సమావేశంలో చర్చించారు. ఉద్యోగ బదీలీలు, నిబంధనలపై జిల్లా కలెక్టర్‌లకు పలు ఆదేశాలు జారీ చేసిన ఆయన మరో మూడు నాలుగు రోజుల్లో పూర్తి కావాలని ఆదేశించారు.

    జిల్లా కలెక్టర్‌లతో సమావేశం అయిన సీఎం కేసిఆర్ ఉద్యోగుల బదీలు, నూతన జోనల్ విధానాలపై చర్చించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ..నూతన జోన ల్ వ్యవస్త నియమ నిబంధనల ప్రకారమే ఉద్యోగుల విభజన ను చేపట్టాలని సీఎం కేసిఆర్ కలెక్టర్లను ఆదేశించారు. స్థానిక యువతకు ఉద్యోగుల కల్పన తో పాటు క్షేత్ర స్థాయిలోకి ప్రభుత్వ పాలన , నూతన జోనల్ వ్యవస్థతో అమలులోకి వస్తుందని సీఎం తెలిపారు.వెనక బడిన మారుమూల ప్రాంతాల్లోకి కూడా ప్రభుత్వ ఉద్యోగులు వెళ్లి పనిచేయ గలిగితేనే సమగ్రాభివృద్ధి సాధ్యమని సీఎం అన్నారు. నాలుగైదు రోజుల్లో ఉద్యోగుల విభజన ప్రక్రియను పూర్తి చేసి నివేదికను అందజేయాలన్నారు.

    భార్యాభర్తల ఉద్యోగులు (స్పౌస్ కేస్) వోకే చోట పనిచేస్తెనే వారు ప్రశాంతంగా పనిచేయ గలుగుతరని,ఉత్పాదకత కూడా పెరుగుతుందని సీఎం తెలిపారు. స్థానిక యువత ఉద్యోగాలకు విఘాతం కలగకుండా మానవీయ కోణంలో స్పోస్ కేస్ అంశాలను పరిష్కరించాలని, సిఎం తెలిపారు. సమావేశంలో దళిత బంధు అమలుతో పాటు పలు అంశాలపై చర్చించారు.

    తరతరాలుగా వివక్షకు గురవుతున్న దళిత సమాజం ఆత్మగౌరవంతో తలెత్తుకునేలా ఆర్థికంగా అభివృద్ది చేయడమే 'దళిత బంధు పథకం ' లక్ష్యమని ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు పునరుద్ఘాటించారు. దళిత బంధు పథకం ద్వారా నూరుశాతం సబ్సిడీ కింద అందించే పది లక్షల రూపాయలు, దళిత కుటుంబాలను ఆర్థికంగా పరిపుష్టం చేయడమే కాకుండా.. సామాజిక పెట్టుబడి గా మారి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత వేగవంతం గా పటిష్టం చేయడం లో దోహద పడుతుందని సీఎం కేసిఆర్ స్పష్టం చేశారు. దళిత బంధును ఇప్పటికే ప్రకటించిన పద్దతిలో ప్రభుత్వం అమలు చేస్తుందని,. అందుకు సంబంధించిన నిధులను త్వరలోనే విడుదల చేస్తామని సీఎం స్పష్టం చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గం, ఇప్పటికే ప్రకటించిన నాలుగు మండలాల పరిధిలో దళిత బంధు ను ముందుగా ప్రకటించిన విధంగా అమలు చేస్తామన్నారు.

    రాష్ట్ర రైతాంగాన్ని కాపాడేందుకు క్షేత్ర స్థాయిలోకి వెళ్లి,  ధాన్యం కొనబోమనే విషయాన్ని అర్థం చేయించాలని సీఎం కెసీఆర్ కలెక్టర్లను, వ్యవసాయ అధికారులను  ఆదేశించారు.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: CM KCR, Hyderabad

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు