హోమ్ /వార్తలు /తెలంగాణ /

Good news to farmers: తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్​ శుభవార్త.. పూర్తి వివరాలివే

Good news to farmers: తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్​ శుభవార్త.. పూర్తి వివరాలివే

సీఎం కేసీఆర్​ (ఫైల్​ ఫొటో)

సీఎం కేసీఆర్​ (ఫైల్​ ఫొటో)

హైదరాబాద్​లోని ఎన్టీఆర్ స్టేడియంలో శనివారం ఆదివాసీ, బంజారాల ఆత్మీయ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR)​, మంత్రులు హాజరయ్యారు. ఈ  సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సీఎం కేసీఆర్​ ప్రకటించారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  హైదరాబాద్​ (Hyderabad)లోని ఎన్టీఆర్ స్టేడియంలో శనివారం ఆదివాసీ, బంజారాల ఆత్మీయ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR)​, మంత్రులు హాజరయ్యారు. ఈ  సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సీఎం కేసీఆర్​ ప్రకటించారు. ముఖ్యంగా గిరిజనులు, ఆదివాసీలు, రైతన్నలకు (Farmers) మేలు జరిగే విధంగా చేసిన నిర్ణయాలు వెల్లడించారు సీఎం. ఈ  సందర్భంగా పోడు వ్యవసాయం చేస్తున్న రైతన్నలకు కేసీఆర్​ గుడ్​న్యూస్​ చెప్పారు. ఆయన మాట్లాడుతూ..  ‘‘అమాయ‌కులైన గిరిజ‌నులు పోడు వ్య‌వ‌సాయం చేస్తున్నారు. వారికి ఇవ్వ‌డానికి పోడు భూములను గుర్తించాం. అమాయ‌కులైన గిరిజ‌నులు పోడు వ్య‌వ‌సాయం చేస్తున్నారు. వారికి ఇవ్వ‌డానికి పోడు భూములను గుర్తించాం.  పోడు భూముల సమస్య పరిష్కారం కోసం, కమిటీలు వేసుకునేందుకు ఈ మధ్యే 140 నంబరు జీవో కూడా ఇచ్చాం.  త్వరలోనే ఈ కమిటీలు సమావేశమై నివేదికలిస్తే... పోడు భూములకు పట్టాలిస్తం. పోడు భూములకు రైతుబంధు కూడా ఇస్తం”అని హామీ ఇచ్చారు.

  గత కొంత కాలంగా గొడవలు..

  తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత రాష్ట్ర ప్రభుత్వం హరితహారానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడంతో అటవీశాఖాధికారులు గిరిజనుల సాగులో ఉన్న పోడు భూములను గుర్తించిన వరుసగా స్వాధీనం చేసుకొని ప్లాంటేషన్‌ చేస్తూ ఆయా భూములకు ట్రంచ్‌లను నిర్మిస్తున్నారు. ఈ ట్రంచల నిర్మాణం సమయంలో తరుచూ గిరిజనులు, అటవీశాఖాధికారుల మధ్య ఘర్షణలు, కొట్లాటలు జరుగుతూనే ఉన్నాయి. అయితే గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌ పార్టీ తరుపున ముఖ్యమంత్రి కేసీఆర్‌ పోడుసాగుదారులందరికి పట్టాలను జారీ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు అమలుకు నోచుకోకపోవడంతో సాగుదారుల నుండి ఒత్తిడి పెరిగింది. దీంతో త్వరితగతిన ఆసమస్య పరిష్కారం కోసం కేసీఆర్​ నడుం బిగించారు.

  ఇదిలా ఉండగా జిల్లాలో గతేడాది జరిగిన పోడు పోరాటం, ఆ తర్వాత మహిళలను జైలుకు పంపడం వంటి ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించాయి. ఈక్రమంలో పలు ఉద్యమాలు చోటుచేసుకోగా, పోడు సమస్య పరిష్కారానికి ప్రభుత్వం నడుం బిగించింది. అయితే పోడు భూముల సాగు కోసం వచ్చిన దరఖాస్తులతో అధికారుల్లో అయోమయం నెలకొంది. అప్పట్లోనే హక్కు పత్రాలు వస్తాయని భావించిన పోడుదారులకు నిరాశ మిగలగా, పది నెలల తర్వాత కమిటీ నియమించినా పోడుదారుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మళ్లీ కాలయాపన చేస్తారా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతారా అనే సందిగ్ధం నెలకొంది. ఏదేమైనా ఇన్నాళ్ల తర్వాత పోడు సమస్యపై కదలిక రావడంతో హక్కు కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఆశావహ దృక్పథంతో ఎదురు చూస్తున్నారు.

  ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నం..

  ఇక ఆత్మీయ సభలో కేసీఆర్​ గిరిజనులకు వరాలు ప్రకటించారు.  తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి దేశానికే ఆదర్శంగా మారింది. సంపద పెంచడం, పేదలకు పంచడమే మన సిద్ధాంతం. దళిత బంధు పథకంతో ఎట్లాగైతే ఇంటికి 10 లక్షల రూపాయలిస్తున్నమో  భూమిలేని, నిరుపేద గిరిజనులకు కూడా గిరిజన బంధు అమలు ఇస్తం.   పోడు భూముల సమస్య పరిష్కారం కాగానే, గిరిజన బంధుపై ఆలోచన చేస్తం. ఎట్టి పరిస్థితుల్లోనూ విద్వేషకర శక్తులకు తావివ్వవద్దు. అభివృద్ధితో అలరారే తెలంగాణను ఆగం చేయవద్దు.  ఈ దేశంలోని పీడిత, తాడిత ప్రజల బతుకులు బాగు చేసేందుకు.. నా చివరి రక్తపు బొట్టును కూడా ధారపోస్తాను..” అన్నారు కేసీఆర్​.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: CM KCR, Farmers

  ఉత్తమ కథలు