ప్రముఖ సాహితీవేత్త, ఆధ్యాత్మికవేత్త, అష్టావధాని అష్టకాల నృసింహరామశర్మ (Ashtakala nrisimhara sharma) హఠాన్మరణం చెందారు. 08-02-2023 బుధవారం(Wednesday) రాత్రి 11:00 గం కి గుండెపోటుతో పరమపదించారు..సాహిత్య రంగంలో ఆధ్యాత్మిక రంగంలో ఆయన చేసిన సేవలు మరువలేనివి. ఆయన సేవలు సిద్దిపేట(Siddipet) ప్రాంతానికే వన్నె తెచ్చాయి. నార్సింగి జెడ్పీ పాఠశాలలో తెలుగు పండిత్ గా విద్యాబుద్దులు నేర్పారు. తాను పనిచేస్తున్న పాఠశాల ప్రాంతంలో ఎప్పుడు అష్టావధానం చేయలేదు. కాని విద్యార్థుల కోసం మొదటి సారి అష్టావధానం నిర్వహించారు. గొప్ప సాహితీవేత్త మరణించడం పట్ల తెలంగాణ(Telangana)ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) సంతాపం ప్రకటించారు.
సాహితీవేత్తకు సీఎం సంతాపం..
ఆధ్యాత్మిక సాహితీవేత్తగా, ఆయా రంగాలకు అష్టకాల నృసింహరామశర్మ చేసిన సేవలు చిరస్మ రణీయమని సీఎం కేసీఆర్ కొనియాడారు. అష్టకాల గారి ఆధ్మాత్మిక సాహిత్య కృషి సిద్ధిపేట ప్రాంత కీర్తి ప్రతిష్టలను మరింతగా ఇనుమడింపచేశాయన్నారు. వారితో తనకున్న అనుబంధాన్ని ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అష్టకాల నృసింహరామశర్మ హఠాన్మరణం సాహిత్య,ఆధ్యాత్మిక రంగాలకు తీరని లోటని ఆయన మరణం పట్ల పలువురు సాహితీవేత్తలు,ఆధ్యాత్మికవేత్తలు తమ ప్రగాఢ సంతాపం ప్రకటించారు.
ప్రముఖ సాహితీ వేత్త, ఆధ్యాత్మిక వేత్త, అష్టావధాని శ్రీ అష్టకాల నృసింహరామశర్మ (80) మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. ఆధ్యాత్మిక, సాహితీ వేత్తగా, ఆ రంగాలలో వారు చేసిన సేవలు చిరస్మరణీయమని సీఎం అన్నారు.
— Telangana CMO (@TelanganaCMO) February 9, 2023
రేపు అంత్యక్రియలు
అనంతసాగర్ శ్రీ సరస్వతీ క్షేత్ర నిర్మాత బ్రహ్మ శ్రీ అష్టకాల నృసింహరామశర్మ అంత్యక్రియలు శుక్రవారం రోజున 10 గంటలకు అనంతసాగర్ నందు జరుగును.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Siddipet, Telangana News