హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad : 3గంటలు..30వేల మంది సమక్షంలో స్వతంత్ర వజ్రోత్సవ ముగింపు వేడుకలు .. జరిగేది ఎక్కడంటే

Hyderabad : 3గంటలు..30వేల మంది సమక్షంలో స్వతంత్ర వజ్రోత్సవ ముగింపు వేడుకలు .. జరిగేది ఎక్కడంటే

(Photo Credit:Twitter)

(Photo Credit:Twitter)

Hyderabad: భారత స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలను వైభవోపేతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఎల్బీ స్టేడియంలో సుమారు 30వేల మంది పాల్గొనే ఈకార్యక్రమం దేశ చరిత్రలో నిలిచిపోయే విధంగా మూడు గంటల పాటు నిర్వహించనున్నారు. చీఫ్‌ గెస్ట్‌గా సీఎం కేసీఆర్‌ హాజరవుతారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

భారత స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలను తెలంగాణ(Telangana)లో 15రోజుల పాటు ఘనంగా నిర్వహించింది రాష్ట్ర ప్రభుత్వం. ఆగస్ట్(August)8వ తేది నుంచి మొదలైన కార్యక్రమాలు సోమవారం (Monday)ఆగస్ట్ 22వ తేదితో ముగియనున్నాయి. ముగింపు వేడుకలను సైతం వైభవోపేతంగా నిర్వహించేందుకు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసింది ప్రభుత్వం. హైదరాబాద్‌(Hyderabad)లోని ఎల్బీ స్టేడియం(LB Stadium)లో జరిగే ముగింపు కార్యక్రమాలకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ (KCR)చీఫ్‌ గెస్ట్‌గా హాజరుకానున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కీర్తి పతాకాలు సాధించిన క్రీడాకారులను సన్మానిస్తారు.

Amit Shah : మునుగోడులో రాజగోపాల్‌రెడ్డి గెలవడం ఖాయం,కేసీఆర్ పతనం ఆరంభం : అమిత్‌షావైభవోపేతంగా ముగింపు వేడుకలు..

దేశ ప్రజలకు స్వతంత్రం వచ్చి 75ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం భారత స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలను నిర్వహించింది. 15రోజుల పాటు సాగిన ఈవేడుకల ముగింపు కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో జరగనున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చీఫ్‌ గెస్ట్‌గా అటెండ్ అయ్యే ఈ ముగింపు వేడుకల్లో జాతీయ, అంతర్జాతీయ కళాకారులు పాల్గొంటారు. సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శిస్తారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న తెలంగాణా సమరయోధుల వారసులతో పాటుగా ఈటీవల జాతీయ, అంతర్జాతీయ పోటీలలో మెడల్స్ సాధించిన తెలంగాణాకు చెందిన క్రీడాకారులను ఇతర ప్రముఖులను సీఎం కేసీఆర్‌ సన్మానిస్తారు.

30వేల మంది మూడు గంటల పాటు...

భారత స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల ముగింపు కార్యక్రమంలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు. ఈ వజ్రోత్సవ వేడులకు దేశ చరిత్రలో నిలిచిపోయే విధంగా మూడు గంటలపాటు అత్యంత అట్టహాసంగా నిర్వహించనున్నారు. సంగీతంలో జాతీయ స్థాయిలో పేరుగాంచిన ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు శంకర్ మహదేవన్ మ్యూజికల్ కాన్సర్ట్, శివమణి సంగీత వాయిద్య విన్యాసం, పద్మశ్రీ పద్మజ రెడ్డి బృందంచే శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు, వార్సీ బ్రదర్స్ చే ఖవ్వాలి, స్థానిక కళాకారుల ప్రదర్శనలు ఉంటాయి.

Chiranjeevi : మెగా పిక్చర్..నేడు చిరుకి నాడు చెర్రికి డిఫరెంట్‌గా బర్త్‌డే విషెస్ చెప్పిన ఫ్యాన్స్చరిత్రలో నిలిచిపోయే విధంగా..

ప్రభుత్వం నిర్వహించిన 15రోజుల ఈ వజ్రోత్సవ వేడుకలకు సంబంధించిన లఘు వీడియో ప్రదర్శన ఉంటుంది. అనంతరం లేజర్ షో తో పాటు భారీ ఎత్తున బాణసంచా ప్రదర్శనలతో వజ్రోత్సవాలు ముగుస్తాయి. దాదాపు 30 వేలమంది ఈ ముగింపు ఉత్సవాలలో పాల్గొనే విధంగా రాష్ట్ర పాలనాయంత్రాంగం ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు, చైర్మన్లు, డీసీసీబీ చైర్మన్లు, ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్లు, ఎంపిపి లు, జెడ్పిటీసీలతో పాటు పలువురు ప్రజాప్రతినిధులను ఈ ముగింపు ఉత్సవంలో పాలొనేందుకై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రంలోని ప్రతి జిల్లా నుండి ప్రజాప్రతినిధులు అధికారులను సోమవారం ఎల్బీ స్టేడియంకు చేరవేసే బాధ్యతను జిల్లా కలెక్టర్లు పర్యవేక్షిస్తున్నారు.

Published by:Siva Nanduri
First published:

Tags: Azadi Ka Amrit Mahotsav, CM KCR, Independence Day 2022, Telangana News

ఉత్తమ కథలు