Home /News /telangana /

HYDERABAD CLEAN TOILETS NO LONGER A HERCULEAN TASK IN HYDERABAD GH VB

Hyderabad She Toilets: హైదరాబాద్​లోటాయిలెట్ల కొరతకు చెక్​.. సూపర్ కాన్సెప్ట్ తీసుకొచ్చిన సాఫ్ట్​వేర్​ ఇంజినీర్..

షీ టాయిలెట్స్

షీ టాయిలెట్స్

Hyderabad She Toilets: మెట్రో సిటీ హైదరాబాద్ నిత్యం రద్దీగా ఉంటుంది. నగరంలో లక్షలాది మంది నిత్యం ఉద్యోగాలు, పనుల కోసం ఒకచోటి నుంచి మరొకటి చోటికి ప్రయాణాలు చేస్తుంటారు. ఇలాంటి చోట్ల టాయిలెట్లను గుర్తించడం ప్రజలకు చాలా కష్టమైన పనిగా మారింది. అయితే ఈ సమస్యను పరిష్కరించేందుకు సుష్మా కల్లెంపూడి నూతన ఆవిష్కరణను తీసుకొచ్చారు.

ఇంకా చదవండి ...
మెట్రో సిటీ హైదరాబాద్ నిత్యం రద్దీగా ఉంటుంది. నగరంలో లక్షలాది మంది నిత్యం ఉద్యోగాలు, పనుల కోసం ఒకచోటి నుంచి మరొకటి చోటికి ప్రయాణాలు చేస్తుంటారు. అనేక ప్రాంతాల్లో జనాలు ఎక్కువగా తిరుగుతుంటారు. ఇలాంటి చోట్ల టాయిలెట్లను గుర్తించడం ప్రజలకు చాలా కష్టమైన పనిగా మారింది. వీలైనంత వరకు ప్రభుత్వం పబ్లిక్ టాయిలెట్లను ఏర్పాటు చేస్తున్నా.. సరిపోవడం లేదు. అందులోనూ పరిశుభ్రత కూడా టాయిలెట్లలో సమస్యగా మారింది. ముఖ్యంగా టాయిలెట్లు ఎక్కడ ఉన్నాయో గుర్తించలేక మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ సమస్యను పరిష్కరించేందుకు సుష్మా కల్లెంపూడి నూతన ఆవిష్కరణను తీసుకొచ్చారు. మొబైల్ షీ టాయిలెట్స్ కాన్సెప్ట్​ను ప్రవేశపెట్టారు. అధునాతన రీతిలో టాయిలెట్లను ఆటో రిక్షాల్లో ఏర్పాటు చేసి.. రద్దీగా ఉండే ప్రాంతాల్లో క్లీన్​గా ఉండే టాయిలెట్ల సదుపాయాన్ని మహిళలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. హైదరాబాద్​లో పరిశుభ్రంగా ఉండే టాయిలెట్లు దొరకక నిత్యం వేలాది మంది మహిళలు ఇబ్బందులు పడుతున్నారని, అందుకే ఈ ఆలోచన చేశానని సుష్మ చెప్పారు.

సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​గా పని చేస్తున్న సమయంలో ఆమె ఈ సమస్యను గుర్తించారు. “2017లో అమెరికా నుంచి భారత్​కు వచ్చినప్పటి నుంచి ఈ సమస్యను పరిష్కరించడంపై ఆలోచిస్తున్నా. ఇందుకోసం సరైన టెక్నాలజీని కనుగొనేందుకు చాలా పరిశోధన చేశా” అని ఆమె అన్నారు. మహిళలకు శానిటరీ ప్యాడ్లు అందించాలని ముందు అనుకున్నా.. ఇప్పటికే చాలా ఎన్​జీవోలు ఆ పని చేస్తుండడంతో కొత్తగా ఏదైనా చేయాలని సుష్మ అనుకున్నారు. దీంతో మహిళల కోసం ఈ మొబైల్ షీ టాయిలెట్స్​ను ఏర్పాటు చేయాలని నిశ్చయించుకున్నారు. ఈ కాన్సెప్ట్ డిజైన్ పూర్తయ్యాక అప్పట్లో నిధుల కోసం సుష్మా తన ప్రతిపాదనను జీహెచ్​ఎంసీ, రాష్ట్ర్, కేంద్ర ప్రభుత్వాలతో పాటు 50 కార్పొరేట్ సంస్థల సీఎస్​ఆర్ వింగ్స్​కు పంపారు. ప్రస్తుతం మరిన్ని మొబైల్ షీ టాయిలెట్స్​ను సుష్మా తయారు చేయిస్తున్నారు. అలాగే జీహెచ్​ఎంసీ, టీఎస్​ఆర్​టీసీ కూడా పాత వాహనాల్లో ఈ కాన్సెప్ట్​ను వినియోగించి మొబైల్​ వాష్​రూమ్స్​ను ఏర్పాటు చేస్తున్నాయి.

మరో ఆరు నెలల్లో 25 షీ టాయిలెట్స్​ను అందించాలని సుష్మ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో ఈ మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రజల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వీటిని నిలుపుతారు. వాహనం చిన్నగా ఉండడంతో వీటిని పార్క్ చేయడం కూడా ఎంతో సులభం. ప్రతీ మొబైల్ షీ టాయిలెట్​ను మహిళలే ఆపరేట్​, మెయింటెనెన్స్ చేస్తారు. సుష్మా భర్త సుధీర్​ ఎలక్ట్రిక్​ వెహికల్ తయారీ బిజినెస్​లో ఉండడంతో షీ టాయిలెట్లను ఏర్పాటు చేయడం ఆమెకు సులువైంది. ఫ్లష్​, వాష్​బేసిన్​, 100 లీటర్ల డ్రైనేజీ సిస్టం ఉండే ఈ మొబైల్ టాయింట్ల తయారీ ఒక్కొక్కటికి రూ.4లక్షల ఖర్చవుతుంది. అలాగే మొబైల్ టాయిలెట్​ ఏ ప్రాంతంలో ఉందో గుర్తించేందుకు జీపీఎస్​ ట్రాకింగ్ డివైజ్​లు కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్టు సుష్మా చెప్పారు.
Published by:Veera Babu
First published:

Tags: GHMC, Hyderabad, Old city, She teams

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు