Home /News /telangana /

HYDERABAD CLASS 3 GIRLS TRIED TO RUN AWAY FROM HOME TRAGEDY IN HYDERABAD PAH

Hyderabad: పారిపోయేందుకు మూడో తరగతి బాలికల మాస్టర్ ప్లాన్... కారణం తెలిస్తే షాక్ అవాల్సిందే...

బాలికలు చదువుతున్న పాఠశాల

బాలికలు చదువుతున్న పాఠశాల

Class 3 girls tried to Run away from Home: మూడో తరగతి చదువుతున్న బాలికలు ఇంటి నుంచి పారిపోయేందుకు ప్లాన్ వేశారు. ఈ క్రమంలో రోజు లాగే స్కూల్‌కి వెళ్లారు... కానీ స్కూల్ వదిలిన తర్వాత ఆ ఇద్దరి ఆచూకీ తెలియలేదు.

Class 3 girls tried to Run away from Home: ఇద్దరు బాలికలు హైదరాబాద్‌లోని ఒక పాఠశాలలో మూడో తరగతి చదువుకుంటున్నారు. బాలికలు స్కూల్ ముగిసిన అనంతరం పారిపోయేందుకు స్కెచ్ వేశారు. బాలికల ఆచూకీ తెలియకపోవడంతో వారి కుటుంబ సభ్యులు టెన్షన్ కు గురయ్యారు. స్కూల్ పరిసర ప్రాంతాల్లో వెతికినప్పటికీ లాభం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి ఎట్టకేలకు ఆ ఇద్దరు బాలికల ఆచూకీ తెలుసుకుని.. వారి తల్లిదండ్రులకు అప్పగించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలికలు  వనస్థలిపురంలోని క్రాంతి హిల్స్ కాలనీకి చెందినవారు. వీరు స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్లో మూడో తరగతి చదువుతున్నారు. వీరికి 9, 10 ఏళ్లు. ఎప్పటిలాగే ఇటీవల ఓరోజు స్కూల్‌కు వెళ్లిన బాలికలు... స్కూల్ ముగిసిన తర్వాత కనిపించకుండా మాయమయ్యారు. ఇద్దరు బాలికల్లో ఒక బాలిక సోదరుడు, మరో బాలిక తండ్రి ప్రతీ రోజూ స్కూల్ ముగిశాక వారిని ఆటోలో ఇంటికి తీసుకెళ్తారు. ఇదే క్రమంలో ఆ రోజు కూడా స్కూల్ ముగిసే సమయానికి అక్కడికి వెళ్లారు. స్కూల్ గేటు బయట వారి కోసం వేచీ చూశారు. అయితే ఎంతసేపటికీ వారు బయటకు రాకపోవడంతో.. స్కూల్ లోపలికి వెళ్లి పాఠశాల సిబ్బందిని అడిగారు. ఆ ఇద్దరూ అప్పటికే వెళ్లిపోయారని చెప్పడంతో షాక్ కు గురయ్యారు.

వెంటనే అప్రమత్తమైన అధికారులు.. స్కూల్ బయట ఉన్న సీసీ ఫుటెజ్ లను పరిశీలించారు. ఆ ఇద్దరు బాలికలు బయట నడుచుకుంటూ వెళ్లడం గమనించారు. దీంతో వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ బాలికల స్నేహితుడిని విచారించగా షాకింగ్ విషయం చెప్పాడు. గత 3 రోజులుగా ఆ ఇద్దరు పారిపోయేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలిపాడు. అంతేకాదు, సుష్మా థియేటర్ రోడ్డు వైపు వెళ్తున్నట్లు తనతో చెప్పారన్నాని తెలిపాడు. దీంతో పోలీసులు రంగంలోని దిగా వారి కోసం మూడు గంటల పాటు వెతకారు. చివరకు వారంతా.. ఓ బస్టాప్‌లో ఇద్దరు కనిపించారు.

అనంతరం బాలికలను స్కూల్‌కు తీసుకొచ్చి విచారించగా అసలు కారణం తెలిపారు. ఇటీవల హిందీ పరీక్ష సరిగా రాయలేదని... సరైన మార్క్స్ రాకపోతే తల్లిదండ్రులు తమను హాస్టల్లో చేరుస్తారని బెదిరించారని అన్నారు. దీంతో భయంతో ఇంటి నుంచి పారిపోవాలనుకున్నామని చెప్పారు. ఆ ఇద్దరు విద్యార్థుల తల్లిదండ్రులను పిలిచి వారికి అప్పగించారు. తమ పిల్లలు తిరిగి దొరకడంతొో తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. తల్లిదండ్రులు పిల్లలను హెచ్చరించకుండా సున్నితంగా చెప్పాలని వారి తల్లిదండ్రులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపివేశారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Hyderabad, Missing person, Students

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు