హోమ్ /వార్తలు /తెలంగాణ /

డ్రంకెన్ డ్రైవ్ రద్దు చేశారా?.. క్లారిటీ ఇచ్చిన కమిషనర్..

డ్రంకెన్ డ్రైవ్ రద్దు చేశారా?.. క్లారిటీ ఇచ్చిన కమిషనర్..

హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్

హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్

డ్రంకెన్ డ్రైవ్ చేపట్టడం లేదని సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తున్న నేపథ్యంలో దానిపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ స్పందించారు.

కరోనా వైరస్ చేస్తున్న అరాచకంతో యావత్తు ప్రపంచమే భయం గుప్పిట్లోకి వెళ్లిపోయింది. పది మందిలో తిరగాలన్నా, ఎదుటి వ్యక్తితో మాట్లాడాలన్నా జంకుతున్నారు ప్రజలు. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో భాగ్యనగరం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కాగా, కరోనా విజృంభించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో నగరంలో డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు రద్దు చేశారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం నడుస్తోంది. కరోనా ఒకరి నుంచి ఒకరికి సోకే ప్రమాదం ఉందని, అందుకే డ్రంకెన్ డ్రైవ్ చేపట్టడం లేదని వార్తలొచ్చాయి. అయితే దీనిపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ స్పందించారు.

డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు రద్దు చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని, డ్రంకెన్ డ్రైవ్ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. కరోనా భయం ఉన్నప్పటికీ టెస్టులు చేసే క్రమంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వివరించారు. ప్రతి ఒక్కరికి వేర్వేరు స్ట్రాలతో డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్స్ చేపడుతున్నామని వెల్లడించారు. డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు ఎప్పటిలాగే కొనసాగుతాయని అంజనీ కుమార్ తేల్చి చెప్పారు.

First published:

Tags: Hyderabad, Hyderabad news, Telangana, Telangana News, TRAFFIC AWARENESS

ఉత్తమ కథలు