హోమ్ /వార్తలు /తెలంగాణ /

OMG:10ఏళ్ల వయసున్న పిల్లలు ఇంట్లోంచి 4లక్షలు ఎత్తుకెళ్లారు..ఎందుకు ఖర్చు చేశారో తెలుసా

OMG:10ఏళ్ల వయసున్న పిల్లలు ఇంట్లోంచి 4లక్షలు ఎత్తుకెళ్లారు..ఎందుకు ఖర్చు చేశారో తెలుసా

(పిల్లలు కాదు జాదుగాళ్లు)

(పిల్లలు కాదు జాదుగాళ్లు)

OMG:వాళ్లు పిల్లలు కాదు జాదుగాళ్లు. దోస్తుల మాట నమ్మి తల్లిదండ్రులు ఇంట్లో దాచిన డబ్బులు ఎత్తుకెళ్లారు. పట్టుమని పదేళ్లు కూడా లేని అన్నదమ్ములు నాలుగు లక్షలు క్యాష్ ఎత్తుకెళ్లి దేనికి ఖర్చు చేశారో తెలిస్తే షాక్ అవుతారు.

ప్రజెంట్ జనరేషన్‌లో ఉన్న చిన్న పిల్లలు జాదుగాళ్లలా ప్రవర్తిస్తున్నారు. ఇంట్లో తల్లిదండ్రులు మాట్లాడుకునే మాటలు, వారి ఆర్ధిక లావాదేవీలపై ఓ నజర్ వేస్తూనే ఫోన్లలో చూస్తున్న సోషల్ మీడియా(Social media)లో వచ్చే వీడియో(Videos)లు, ఫ్రెండ్స్(Friends) చెప్పే మాటలకు ఆకర్షితులై చిన్నతనంలోనే ఇంటిదొంగలుగా మారిపోతున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌(Greater Hyderabad)లో పదేళ్లలోపు వయసున్న ఇద్దరు అన్నదమ్ములు అరుణాచలం(Arunachalam)సినిమాలో రజనీకాంత్‌(Rajinikanth)లా ఇంట్లో తల్లిదండ్రులు దాచిన నాలుగు లక్షల రూపాయల(Four lakhs)ను ఎంచక్కా 20రోజుల్లో ఖర్చు చేశారు. కనీసం షాపుకు వెళ్లి ఏం కొనుక్కోవాలో తెలియని వయసులో ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేయడానికి ప్రధాన కారణం ఫ్రెండ్స్ అని తేలింది.

పిల్లలు కాదు పిడుగులు..

జీడిమెట్లలోని ఎస్‌ఆర్‌నగర్‌ నాయక్‌నగర్‌కి చెందిన దంపతులకు ఇద్దరు అబ్బాయిలు. ఒకడి వయసు 8సంవత్సరాలు. మరొకటి వయసు 9ఏళ్లు. నెల రోజుల క్రితం దంపతులు 4లక్షల రూపాయల క్యాష్ తెచ్చి బీరువాలో పెట్టారు. పేరెంట్స్ డబ్బులు ఇంట్లో దాచి పెట్టడం చూసిన పిల్లలు అదే విషయాన్ని ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకున్నారు. అంతే సీన్‌ మారిపోయింది. అన్నదమ్ములతో తిరిగే మరో ఇద్దరు మైనర్ ఫ్రెండ్స్ వారికి మాట మాటలు చెప్పి ఇంట్లోంచి కొద్ది కొద్దిగా డబ్బులు బయటకు తీసుకురావడం ఎలాగో నేర్పించారు. తీసుకొచ్చిన డబ్బుల స్థానంలో నకిలీ కరెన్సీ పెట్టి బాగా మేనేజ్ చేశారు.

20రోజుల్లో 4లక్షలు ఖర్చు..

ఇంట్లోంచి సైలెంట్‌గా తీసుకొచ్చిన డబ్బుతో గేమింగ్ సెంటర్‌, రెస్టారెంట్‌లకు వెళ్లి ఎంజాయ్ చేశారు. ఇంకా డబ్బులు చేతిలో మిగిలిపోవడంతో స్మార్ట్ వాచ్‌లు, సెల్‌ఫోన్స్ కొనుగోలు చేసి జల్సాలు చేశారు. పిల్లల ప్రవర్తనపై డౌట్ వచ్చిన తల్లిదండ్రులు ఇంట్లో దాచిన డబ్బులు చెక్ చేసుకోవడంతో అసలు నిజం బయటపడింది. పెట్టిన నాలుగు లక్షల నగదు పూర్తిగా ఖర్చు అయిపోవడమే కాకుండా..ఆ స్థానంలో కొంత నకిలీ కరెన్సీ ఉండటంతో షాక్ అయ్యారు. పిల్లల్ని విచారించడంతో నిజం చెప్పారు.

జాతిరత్నాలు..

పుత్రరత్నాలు చేసిన ఘనకార్యం నుంచి కోలుకున్న తల్లిదండ్రులు జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డబ్బులు ఖర్చు చేసుకుంది పిల్లలేనని తేల్చారు. అయితే మైనర్లకు నకిలీ కరెన్సీ ఎక్కడి నుంచి వచ్చింది...ఎవరిచ్చారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పిల్లల తల్లిదండ్రులు మాత్రం ఇంటి దొంగల వెనుక పెద్దల డైరెక్షన్ ఉండే ఉంటుందని అనుమానిస్తున్నారు. ఇద్దరు పిల్లలతో డబ్బులు తెప్పించిన వాళ్లను ప్రశ్నిస్తున్నారు పోలీసులు. డబ్బులు మొత్తం ఖర్చు చేశారా లేక కొంత ఎవరికైానా ఇచ్చారా అని ఆరా తీస్తున్నారు.

First published:

Tags: Greater hyderabad, Minor