Home /News /telangana /

HYDERABAD CHILD WHO WENT MISSING IN HYDERABAD 8 YEARS AGO AND WAS REUNITED WITH HIS PARENTS THROUGH A TV SHOW SNR

Hyderabad: 8ఏళ్ల క్రితం తప్పిపోయిన బిడ్డ తిరిగి తల్లిదండ్రుల చెంతకు చేరింది .. అంతా ఆ టీవీ షో పుణ్యమే

(Photo Credit:Youtube)

(Photo Credit:Youtube)

Hyderabad: జీవిత కథల్నే సినిమాలు తీస్తారనే సంగతి తెలుసు కానీ..నిజంగా సినిమాల్లో చూపించినట్లుగా యదార్ధ జీవితంలో జరుగుతుంతా అంటే అవుననే చెప్పాలి. 8ఏళ్ల క్రితం తల్లిదండ్రుల నుంచి తప్పిపోయిన చిన్నారి ఓ టీవీ షో ద్వారా మళ్లీ కలిశారు.

సినిమాల్లో చూపించే కొన్ని సంఘటనలు ఒక్కోసారి మన జీవితాల్లో ఎదురవుతూ ఉంటాయి. జీవిత కథల్నే సినిమాలు తీస్తారనే సంగతి తెలుసు కానీ..నిజంగా సినిమాల్లో చూపించినట్లుగా యదార్ధ జీవితంలో జరుగుతుంతా అంటే అవుననే చెప్పాలి. సుమారు 8సంవత్సరాల(8Years)క్రితం మూడు సంవత్సరాల వయసున్న ఇందు అనే చిన్నారి తల్లిదండ్రుల వెలు విడిచిపెట్టింది(Missing). అంతే అప్పడు కన్నవాళ్లకు దూరమైపోయిన చిట్టితల్లి ఇప్పుడు ఓ టీవీ షో( TV show)ద్వారా వాళ్ల చెంతకు చేరింది. ఈమధ్య కాలంలో ఆమె ఎక్కడుంది..ఎలా తల్లిదండ్రుల చెంతకు చేరిందో తెలుసా.

పేరెంట్స్‌కి బిడ్డను దక్కించిన టీవీ షో..
హైదరాబాద్‌ ఈసీఐల్‌లోని కమలానగర్‌కు చెందిన పిన్నిమోని కృష్ణ, అనురాధ దంపతులకు నలుగురు కుమార్తెలు. అందులో ఒకరే చిన్నారి ఇందు. 8ఏళ్ల క్రితం అంటే 2014సెప్టెంబర్ 3వ తేదిన తల్లిదండ్రుల నుంచి తప్పిపోయింది. బిడ్డ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఆమె ఆచూకి కోసం చాలా రోజులు వెదికారు. బంధువుల ద్వారా చుట్టు పక్కల ఉన్న అనాధశ్రమాలకు వెళ్లారు. ఎంత గాలించినా చిన్నారి తల్లి జాడ దొరకలేదు. ఏడాదికిపైగా బంధువులు, తల్లిదండ్రులు వెదికినప్పటికి దొరక్కపోవడంతో ఇక దొరకదని భావించి వదిలేశారు. కాని ఇందు తల్లి మాత్రం బిడ్డ ఏ రోజుకైనా దొరుకుతుందనే ఆశతో ఎదురుచూస్తోంది. ఫాదర్స్‌ డే ఆమె 8ఏళ్ల కలను నిజం చేసింది.



ఆ విధంగా కలిసొచ్చిన ఫాదర్స్ డే..
ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్ ఫాదర్స్‌ డే సందర్భంగా నిర్వహించిన కామెడీ షో ఇందుకు వేదికైంది. జూన్‌19న ఈటీవీ టెలికాస్ట్ చేసిన శ్రీదేవి డ్రామా కంపెనీ వినోద కార్యక్రమానికి కిస్మత్‌పూరాలోని చెరీష్ అనే అనాధశ్రమానికి చెందిన బాలికలను వీక్షకులుగా ఆహ్వానించారు. షో ప్రారంభంలో చెరీష్ అనాధాశ్రమం నిర్వాహకురాలు మాట్లాడిన తర్వాత పిల్లల పరిచయం కార్యక్రమం జరిగింది. అప్పుడే 8సంవత్సరాల క్రితం తల్లిదండ్రుల నుంచి తప్పిపోయిన ఇందు సింధుగా షోలో పరిచయం చేసుకుంది. టీవీలో ఈకార్యక్రమం చూసిన చిన్నారి తల్లిదండ్రులు ఆమె తమ బిడ్డలాగానే ఉందని ఫిక్సయ్యారు. వెంటనే టీవీ షో నిర్వాహకులను సంప్రదించి..పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారో వివరాలు తెలుసుకున్నారు.

ఇది చదవండి: తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్‌లో మట్టి బిడ్డ : ఫస్టియర్ బైపీసీలో టాపర్ ఈ గిరిజన బాలిక



కథ సుఖాంతం..
అటుపై రంగారెడ్డి జిల్లా బాలల సంరక్షణ అధికారుల సాయంతో కిస్మత్‌పూర్‌లో చెరిష్‌ అనే అనాథ బాలల సంరక్షణ కేంద్రానికి వెళ్లి తమ బిడ్డను చూసి మురిసిపోయారు. 8ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన బిడ్డ ఇందు అంటూ అందుకు సంబంధించిన అధారాలను చూపించారు. చిన్నారి తల్లిదండ్రులు చూపించిన బర్త్ సర్టిఫికెట్ వంటి ఆధారాలను పరిశీలించిన తర్వాత 8ఏళ్ల క్రితం తప్పిపోయిన బాలిక ఇందు ఒకరేనని నిర్ధారించారు. జేజే ఆక్ట్‌ -2015 ప్రకారం ఆ పాపను రాష్ట్ర బాలల హక్కుల కమిషన్‌ చైర్‌పర్సన్‌, సభ్యులు, అధికారుల సమక్షంలో తల్లిదండ్రులు కృష్ణ, అనురాధ దంపతులకు అప్పగించారు. బిడ్డను తల్లిదండ్రుల చెంతకు చేర్చడం ఎంతో సంతోషంగా ఉందని చెరీష్ అనాధాశ్రమం నిర్వహకులు, బాలల సంరక్షణ అధికారులు తెలిపారు.

ఇది చదవండి: ఇంటర్ ఫలితాల్లో సత్తాచాటిన వీణ-వాణి.. మార్కులు ఎన్నంటే..?

Published by:Siva Nanduri
First published:

Tags: Hyderabad, Sridevi drama company show, Telangana

తదుపరి వార్తలు