దేశ వ్యాప్తంగా ఏక్కడ ఏ నేరం జరిగినా దాని మూలాలు లేదంటూ ఆ సంఘటనకు సంబంధించిన బాధితులు తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్‌తో సంబంధాలు ఉంటున్నాయి.. ఇలా తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఉదంతంలో కూడా నిందితులకు హైదరాబాద్‌తో సంబంధాలు ఉన్నట్టు బయటపడుతున్నాయి. వ
వివరాల్లోకి వెళితే.. చిన్నపిల్లలపై అత్యాచారాలు, అత్యాచారాలకు ప్రధాన కారణం డ్రగ్స్, గంజాయితో పాటు బ్లూ ఫిలిమ్స్ కూడా కారణం అవుతున్నాయి. ఇలా విచ్చవిడిగా పిల్లలపై బ్లూ ఫిలిమ్స్ ఉండడంతో వాటి ప్రభావం యువతపై పడడడంతో పాటు నేరాలకు ఉసిగొల్పుతుంది. అయితే ఇందుకు సంబంధించిన ఓ షాకింగ్ సంఘటన తాజాగా ఢిల్లీలో వెలుగు చూసింది. అయితే దాని మూలాలు కూడా హైదరాబాద్‌లో ఉండడంతో స్థానిక పోలీసులు దృష్టి సారించారు..
ఇది చదవండి : టీఆర్ఎస్ విజయ గర్జన వాయిదా.. ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యుల్ ఎఫెక్ట్...
ఈ క్రమంలోనే చిన్న పిల్లలతో తీసిన వీడియో లింకులు ఇస్తామని చెబుతూ ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తికి ఇటివల ఓ మెస్సెజ్ వచ్చింది. కొద్ది అమౌంట్‌ను చెల్లిస్తే చాలు వందల లింకులు పంపిస్తామని వివరించారు. అనంతరం తాను రెండు వేల రూపాయలు ఇస్తానని ఆ లింకులు పంపించాలని వారిని కోరారు..దీంతో అన్ని డబ్బులు అవసరం లేదని , కేవలం 500 పంపిస్తే.. చాలని చెప్పి ఆ డబ్బులు పంపించిన అనంతర ఏకంగా నాలుగు వేల లింకులు పంపించాడు. దీంతో ఖంగుతిన్న ఆయన వెంటనే చిన్నారుల హక్కుల పరిరక్షణ కమిషన్‌ను సంప్రదించి సమాచారం అందించారు.
ఇది చదవండి : ఖమ్మంలో మరో బాల భీముడు.. 5 కిలోల బరువుతో శిశువు..
వెంటనే రంగంలోకి దిగిన కమిషన్ సభ్యులు ఢిల్లీ పోలీసు కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. లింకులు ఐడిలు ఇవ్వడంతో వాటిని పరీశీలించిన పోలీసులు వాటి మూలాలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నట్టు గుర్తించారు. దీంతో హైదరాబాద్ పోలీసులకు సమాచారం అందించారు.. ముఖ్యంగా ఆ వీడియోలను హైదరాబాద్నుండి అప్లోడ్ చేసినట్టు గుర్తించినట్టు సమాచారం. అయితే ఆప్‌లోడ్ చేసిన వ్యక్తి విజయవాడకు చెందిన వాడిగా గుర్తించినట్టు సమాచారం. దీంతో మరింత లోతుగా వాటికి సంబంధించి విచారణ జరిపి నిందితులను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు సమచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: National News, Porn Movies, Telangana