Home /News /telangana /

HYDERABAD CHIEF MINISTER K CHANDRASEKHAR RAO WILL WELCOME PRIME MINISTER NARENDRA MODI WHO IS ARRIVING IN HYDERABAD ON SATURDAY FOR A VISIT TO TELANGANA PRV

PM Narendra modi: ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్​లో మరో కొత్త ట్విస్టు.. స్వాగతం పలకడానికి వస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్​

నరేంద్రమోదీ, కేసీఆర్ (ఫైల్ ఫోటో)

నరేంద్రమోదీ, కేసీఆర్ (ఫైల్ ఫోటో)

తెలంగాణ పర్యటన కోసం శనివారం హైదరాబాద్‌కు వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని స్వాగతించే, వీడ్కోలు చెప్పే కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించినట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి.

    తెలంగాణ పర్యటన (Telangana Tour) కోసం శనివారం హైదరాబాద్‌కు వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra modi)ని స్వాగతించే, వీడ్కోలు చెప్పే కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు (CM KCR) నిర్ణయించినట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలను నిజం చేస్తూ స్వాగత బాధ్యతలను మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌కు అప్పగిస్తున్నట్టు సీఎం కార్యాలయం శుక్రవారం ప్రకటించింది. షెడ్యూల్‌ (Schedule) ప్రకారం.. శనివారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకునే ప్రధాని మోదీకి.. గవర్నర్‌ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, సీఎం కేసీఆర్‌ తదితరులు స్వాగతం పలకాల్సి ఉంది. కానీ, శనివారం మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి కుమారుడి వివాహం శంషాబాద్‌ విమానాశ్రయం సమీపంలోని ఓ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరుగుతోంది. దీంతో స్వాగత బాధ్యతలను మంత్రి తలసానికి అప్పగిస్తూ ప్రభుత్వం ప్రకటన సైతం జారీ చేసింది. సీఎం కేసీఆర్‌ ఆ వివాహ వేడుకల్లో పాల్గొన్న అనంతరం ముచ్చింతల్‌ (Mucchintal)కు రావాల్సి ఉంది. అయితే అనూహ్యంగా షెడ్యూల్​లో మార్పులు (changes in schedule) చోటుచేసుకున్నాయి. సీఎం కేసీఆర్​ ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు వస్తున్నారు.

    ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు శంషాబాద్ సీఎంఆర్ ఫంక్షన్ హాల్లో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్ది కుమారుడి పెళ్లికి  సీఎం కేసీఆర్ (CM KCR) హజరవుతారు. అటు నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సీఎం వెళ్లనున్నారు. ఎయిర్​పోర్టులో  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra modi)కి స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి ఇక్రిశాట్​కు మోదీతో పాటు సీఎం కేసీఆర్​ హెలికాఫ్టర్​లో వెళ్లనున్నారు. ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ 7 నిమిషాలు ప్రసంగిస్తారు. అక్కడి నుంచి ప్రధానితో పాటు ముచ్చింతల్ కు సీఎం కేసీఆర్​ వెళతారు. ముచ్చింతల్లో సీఎం  8 నిమిషాలు ప్రసంగిస్తారు.

    2016 తర్వాత ఇప్పుడే..

    ప్రధాని మోదీ (PM Narendra modi)తో సీఎం కేసీఆర్‌ ఒకే వేదిక పంచుకుని దాదాపు ఆరేళ్లు అవుతోంది. చివరిసారిగా 2016లో గజ్వేల్‌లో మిషన్‌ భగీరథ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఇరువురూ పాల్గొన్నారు. కేంద్రంలో ప్రధానిగా మోదీ (PM Narendra modi), రాష్ట్రంలో సీఎంగా కేసీఆర్‌ రెండోసారి అధికారంలోకి వచ్చాక.. 2020 నవంబర్‌లో మోదీ హైదరాబాద్‌కు వచ్చారు.

    కానీ కరోనా వ్యాప్తి, ఇతర పరిస్థితుల నేపథ్యంలో.. గవర్నర్‌గానీ, సీఎంగానీ ఎవరూ రావాల్సిన అవసరం లేదని ప్రధాని కార్యాలయం నుంచి ప్రత్యేక సమాచారం పంపించారు. హాకీంపేట ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో విమానం దిగిన మోదీ.. నేరుగా భారత్‌ బయోటెక్‌ పరిశ్రమకు వెళ్లారు. కోవిడ్‌ వ్యాక్సిన్ల తయారీకి సంబంధించి శాస్త్రవేత్తలతో మాట్లాడి అట్నుంచే తిరిగి వెళ్లిపోయారు.

    ప్రధాని పర్యటన షెడ్యూల్ ఇదీ..


    • ‌‌శనివారం మధ్యాహ్నం గం. 2.10లకు శంషాబాద్ ఎయిర్ పోర్టు




    • ప్రత్యేక హెలికాప్టర్‌లో 2.45లకు ఇక్రిశాట్




    • 2.45 నుండి 4.15 వరకు ఇక్రిశాట్ 50వ వార్షికోత్సవ ప్రారంభ కార్యక్రమం




    • 5 గంటలకు ముచ్చింతల్




    • అక్కడి గెస్ట్ హౌస్‌లో 10 నిమిషాలు రీప్రెష్ అయి ప్రత్యేక వస్త్రధారణలో యాగశాలకు..




    • 5 గంటల నుంచి 8 గంటల వరకు సమతా మూర్తి విగ్రహవిష్కరణ కార్యక్రమం




    • సాయంత్రం 7 గంటలకు సమతామూర్తి విగ్రహం జాతికి అంకితం




    • 8.20 కి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణం



    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: CM KCR, Hyderabad, PM Narendra Modi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు