ఫుడ్‌కోర్టులోని (food court)మహిళల బాత్రూంలో సెల్‌ఫోన్ కెమెరా...(cell camera) వ్యవహారం వెలుగు చూసింది. జూబ్లీహిల్స్‌లోని వన్‌డ్రైవ్ ఫుడ్ కోర్టులో ఈ కేమెరాను గుర్తించారు. కాగా నేడు ఫుడ్ కోర్టుకు ఓ మహిళ నేపథ్యంలోనే బాత్రూంలో(Bathroom) ఆన్ చేసి ఉన్న సెల్‌ఫోన్‌ను గుర్తించింది. దీంతో వెంటనే జూబ్లీహిల్స్ పోలీసులకు (police)ఫిర్యాదు చేసింది.
స్పందించిన పోలీసులు ఫుడ్‌కోర్టులోని సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆ సెల్ ఫోన్ నిన్నటి నుండి ఆన్‌లోనే ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. కాగా బాత్రూంలో కెమెరా పెట్టిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. ఫుడ్‌కోర్టులో బాత్రూం క్లీనింగ్ చేసే బెనర్జీ అనే వ్యక్తి ఇందుకు కారణమని పోలీసులు కనిపెట్టారు. దీంతో బెనర్జీని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
ఇది చదవండి : కరోనా మృతుల కుటుంబాలకు 50 వేల ఎక్స్‌గ్రేషియా.. రాష్ట్రాలు ఇవ్వాలన్న కేంద్రం
కాగా ఇటివల ఓ మహిళ తన బాత్రూంలో స్నానం చేస్తుండగా తీసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా తాజాగా ఈ సెల్ కెమెరా కలకలం రేపుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో చిన్నారుల నుండి మహిళల వరకు అత్యాచారాలు జరుగుతుండగా మరోవైపు ఇలాంటీ దుర్మార్గపు చర్యలకు దుండగులు దిగుతుండడం ఆందోళన కల్గిస్తోంది. అయితే ఇలా ఎన్ని రోజులుగా ఫుడ్ కోర్టులో సెల్ రికార్డింగ్ వ్యవహరం నడుస్తుందో అనే ఆందోళన చెలరేగుతోంది. అయితే పోలీసుల అదుపులో ఉన్న బెనర్జీ ఈ చర్యకు ఎందుకు పాల్పడ్డాడనేది పోలీసుల విచారణలో తేలనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Hyderabad