దేశ రాజకీయాల్ని కుదిపేసిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో క్రైమ్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ అధికారులు స్పీడు పెంచారు. కేసును సైలెంట్‌గా స్టడీ చేస్తున్న సీబీఐ తాజాగా మరొకర్ని అరెస్ట్ చేసింది. ముఖ్యంగా ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ చార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబును అరెస్ట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనలో ఎమ్మెల్సీ మాజీ సీఏ పాత్ర ఉందనే అనుమానాలు, ఆధారాలతోనే అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.