హోమ్ /వార్తలు /telangana /

Cheating husband: వీడు మామూలోడు కాదు.. వీధికో భార్య.. ఒకరికి తెలియకుండా ఒకరితో పెళ్లి.. 11మందితో కాపురం..

Cheating husband: వీడు మామూలోడు కాదు.. వీధికో భార్య.. ఒకరికి తెలియకుండా ఒకరితో పెళ్లి.. 11మందితో కాపురం..

వెలుగులోకి నిత్య పెళ్లికొడుకు లీలలు

వెలుగులోకి నిత్య పెళ్లికొడుకు లీలలు

Cheating Husband: ఈ రోజుల్లో ఒక్క భార్యను పోషించాలి అంటేనే కష్టం.. అలాంటిది ఓ మన్మధ రాజా 11 మందిని పెళ్లాడాడు.. అది కూడా ఒకరికి తెలియకుండా ఒకరిని మెయింటెన్ చేశారు.. వరుసగా మూడు వీధుల్లో ముగ్గురు భార్యలను పెట్టి మేనేజ్ చేశాడు.. కానీ చివరికి ఏమైంది అంటే..?

ఇంకా చదవండి ...

Cheating husband : మనీ చుట్టూ ప్రపంచం తిరుగుతున్న ఈ రోజుల్లో ఒక్క భార్య (Wife)ను మెయింటేన్ చేయడానికి చినిగి చాటవుతోంది.. కానీ వీడు మామూలోడు కాదు.. ఒకటా రెండా.. ఏకం 11 మందిని పెళ్లాడాడు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే..? అందులో ముగ్గురు భార్యలను పక్కపక్కన ఉన్న.. మూడు వీధుల్లో పెట్టాడు. ముగ్గురితోనూ కాపురం చేస్తూ మేనేజ్ చేస్తూ వస్తున్నాడు. అసలు రెండో పెళ్లి చేసుకుంటేనే ఈ రోజులు ఈజీగా తెలిసిపోతుంది. అలాంటి  పదకొండు మందిని ఎలా పెళ్లాడాడు.. అది కూడా పక్క పక్క వీధుల్లో ఎలా కాపురాలు పెట్టాడు. ఇన్నాళ్లు ఎవరికంటా పడకుండా ఎలా తప్పించుకున్నాడు. వీడెవడండ్రా బాబు అనే రేంజ్ లో బయట పడుతున్నాయి అతడి మన్మధ లీలలు.. సాధారణంగా సినిమాల్లో ఇద్దరు పెళ్లాలు ఉంటే ఫుల్ కామెడీ క్రియేట్ చేస్తారు. ఒకరికి తెలియకుండా మరొకరని మెయింటెన్ చేయడానికి ఆ హీరో పడే కష్టాలను కామెడీ చేసి చూపిస్తారు. సినిమాల్లో హీరోలే తిప్పలు పడుతుంటే.. ఈ కేటుగాడు మాత్రం.. ఒకరా ఇద్దరా 11 మందిని వివాహం చేసుకున్నాడు. ఇక్కడ మరో హైలైట్ ఏంటంటే.. 11 మందిలో ఏడుగురు మహిళలు హైదరాబాద్‌ (Hyderabad) లోని కొండాపూర్‌ (Kondapur) లోని పక్క వీధుల్లోనే ఉంటున్నారు.. అందరికి దాదాపు నడుచుకుని వెళ్లేంత దూరంలోనే ఉన్నా.. ఒకరి గురించి ఒకరి తెలియకుండా ఎలా మేనేజ్ చేశాడో మరి. సాధారణంగా ఓ భర్త పోన్ కు మరో మహిళ నుంచి ఫోన్ వస్తేనే అనుమాన పడే రోజులు ఇవి. అలాంటింది ఒకరికి తెలియకుండా ఒకరిని ఎలా ఇన్నాళ్లూ కవర్ చేశాడో అని తెలిసిన వాళ్లంతా షాక్ అవుతున్నారు.

ఈ నిత్య పెళ్లికొడుకు పేరు శివశంకర్.. గుంటూరు జిల్లా (Guntur District) మంగళగిరి (Mangalagiri) మండలం బేతపూడికి చెందిన అడపా శివ శంకర్‌ బాబు (Shiva Sankar) ఓ ప్రైవేట్ ఉద్యోగి (Private Employee). 2018 లో మంగళగిరి ప్రాంతానికి చెందిన ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. తర్వాత హైదరాబాద్‌కు మకాం మార్చాడు.

మాట్రిమోని సైట్స్‌ ద్వారా రెండో పెళ్లి యువతులను ట్రాప్‌ చేసేవాడు. భార్యతో ఉంటూనే అప్పటికే పెళ్లయి భర్తకు దూరంగా ఉంటున్న మరో యువతికి మాయమాటలు చెప్పి.. నకిలీ విడాకుల పత్రాలు చూపించి పెళ్లి చేసుకున్నాడు. అమెరికాలో ఉద్యోగం వచ్చిందని నమ్మబలికి ఆమె దగ్గర నుంచి లక్షల్లో నగదు తీసుకొని.. ఆ తర్వాత కొన్నాళ్లకు మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు కూడా అమెరికాలో ఐటీ ఉద్యోగమంటూ చెప్పి డబ్బు తీసుకున్నాడు. తర్వాత అదే అమెరికా స్టోరీలతో మరో ఆరుగురిని మోసం చేశాడు. వారిలో ఒకరికి అనుమానం వచ్చి సైబరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

ఇదీ చదవండి : ఆ నేతలందరినీ బోనెక్కిస్తాం.. ఇదే వైసీపీకి లాస్ట్ ఛాన్స్ అంటున్న చంద్రబాబు

ముఖ్యంగా ఒంటరిగా ఉన్న మహిళలు.. విడాకులు తీసుకున్న యువతులను లక్ష్యంగా చేసుకుని తనకు రెండో పెళ్లి అని చెప్పి వారిని నమ్మించే వాడు. పగలు, రాత్రి తేడా లేకుండావీ షిఫ్టుల వారీగా పెద్ద సంస్థలో ఉద్యోగం చేస్తున్నానని చెప్పి పెళ్లికి ఒప్పించి.. కొన్ని రోజుల పాటు వారికి దూరంగా ఉంటూ.. ఎవరో ఒకరి దగ్గర ఉంటూ మేనేజ్ చేస్తూ వచ్చాడు. అలా ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 11 మందిని పెళ్లి చేసుకున్నాడు. ఆశ్చర్యకరంగా చాలా మంది మహిళలు బాగా చదువుకున్నవారే కావడం విశేషం.

ఇదీ చదవండి : గోదావరి ఉగ్రరూపం.. ధవళేశ్వరం దగ్గర మూడో ప్రమాద హెచ్చరిక..! పోలవరంపై ప్రభావమెంత?

ఎవరైనా నమ్మితే చాలా నమ్మితే చాలు నట్టేట ముంచేస్తాడు. విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్న మహిళలకు.. పెళ్లి పేరుతో ఆశలు రేపి అగాధంలో పడేసేవాడు. ఆ తర్వాత వాళ్ల దగ్గరున్న డబ్బు, బంగారంతో ఉడాయించేవాడు.. అలా కేవలం నాలుగేళ్లలోనే 11 మందిని పెళ్లాడాడు. అనుమానం వచ్చిన నిఘా వేయడంతో అతడి మోసాలను ఇద్దరు మహిళలు గుర్తించారు. మీడియా ముందుకు వచ్చి శివశంకర్ మోసం గురించి వెల్లడించారు. శివశంకర్ తమ నుంచి లక్షల రూపాయలు తీసుకుని అదృశ్యమయ్యాడని వాపోయారు. అతను తన ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసాడని.. తర్వాత ఎప్పటికీ కనిపించడు. దాదాపు 60 లక్షల రూపాయల నగదు, బంగారం ఇచ్చినట్లు మహిళలు వెల్లడించారు. శివశంకర్ కూడా ఏపీలో ఓ మంత్రికి బంధువని చెప్పి వారిని మోసం చేసినట్లు తెలుస్తోంది.

First published:

Tags: Andhra Pradesh, AP News, Crime news, Guntur

ఉత్తమ కథలు