Home /News /telangana /

HYDERABAD CASE FILED AGAINST MINISTER TALASANI SRINIVAS YADAV SON TALASANI SAI KIRAN FOR NEGLIGENT DRIVING MKS

Hyderabad : కారుతో వ్యక్తిని ఢీకొట్టిన తలసాని సాయికిరణ్ -మంత్రి తలసాని కొడుకుపై ఎట్టకేలకు కేసు!

పోలీసులతో బాధితుల వాగ్వాదం(photo credit mirchi 9)

పోలీసులతో బాధితుల వాగ్వాదం(photo credit mirchi 9)

నిర్లక్ష్యంగా కారును నడిపి ఓ వ్యక్తిని ఢీకొట్టి, బాధితుడి కాలు నుజ్జు చేసిన ఘటనలో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు, టీఆర్ఎస్ యువనేత తలసాని సాయికిరణ్ యాదవ్ పై ఎట్టకేలకు పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం రాత్రి ఘటన జరిగితే ఆదివారం ఉదయం దాకా కేసు నమోదు చేయకపోవడంపై విమర్శలు రావడంతో..

ఇంకా చదవండి ...
నిర్లక్ష్యంగా కారును నడిపి ఓ వ్యక్తిని ఢీకొట్టి, బాధితుడి కాలు నుజ్జు చేసిన ఘటనలో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు, టీఆర్ఎస్ యువనేత తలసాని సాయికిరణ్ యాదవ్ పై ఎట్టకేలకు పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం రాత్రి ఘటన జరగ్గా, ఆదివారం ఉదయానికిగానీ పోలీసులు కేసు నమోదు చేయకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. మంత్రి కొడుకును సేవ్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తాయి. హైదరాబాద్ లోని సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో ఇవాళ ఉదయం మంత్రి కొడుకుపై ఎఫ్ఐఆర్ నమోదైంది. పోలీసులు, బాధితులు, ప్రత్యక్ష సాక్షలు చెప్పిన వివరాలివి..

యాదవ పరివారానికి చెందిన తలసాని కుటుంబం ఏటా సిటీలో జరిగే సదర్ ఉత్సవాల్లో పాల్గొంటుండటం తెలిసిందే. మంత్రి తలసాని కొడుకు సాయికిరణ్ శుక్రవారం నాడు ఖైరతాబాద్ లో జరిగిన సదర్ ఉత్సవానికి హాజరయ్యారు. వేడుకల నుంచి తిరిగి వెళుతోన్నక్రమంలో రైల్వే గేటు సమీపంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నడుచుకుంటూ వెళ్లున్న ఇందిరానగర్‌కు సంతోష్‌(32) ఎడమ పాదం పైనుంచి మంత్రి కుమారుడు ప్రయాణిస్తున్న కారు టైరు వెళ్లింది. సంతోష్ కాలు నుజ్జయిపోవడంతో బాధితుడి కుటుంబం, స్థానికులు కలిసి మంత్రి కొడుకు కారును అడ్డుకున్నారు.

అయితే, గాయపడ్డ వ్యక్తిదే తప్పంటూ తలసాని అనుచరులు.. బాధిత వ్యక్తి కుటుంబీకులు, స్థానికులతో వాగ్వాదానికి దిగారు. ఇది గమనించిన పోలీసులు.. కారు మంత్రి కొడుకుది కావడంతో ఇరువురికీ నచ్చచెప్పి పంపేసి, బాధితుడిని పోలీస్ వాహనంలోనే సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. తలసాని సాయికిరణ్ కారు ఉదంతం వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. దీనిపై వేల మంది పౌరులు స్పందించారు. కారుతో వ్యక్తిని ఢీకొట్టి గాయపర్చిన మంత్రి కొడుకుపై పోలీసులు కేసు పెట్టకపోవడంపై ప్రశ్నలు వెల్లువెత్తాయి. చివరికి..

తలసాని సాయికిరణ్ కారు ఉదంతం ఘటనలో ‘టీఎస్ 07 హెచ్‌డబ్ల్యూ 0001’నంబర్ గల కారును ప్రమాదకరంగా, నిర్లక్ష్యంగా నడిపినట్లు సైఫాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీ 337, ఐపీసీ 279 సెక్షన్ల కింద కేసు నమోదైంది. అయితే ఈ కేసులో మంత్రి కొడుకు పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చారా? లేదా? అనేదానిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. పోలీసులు మాత్రం సాయికిరణ్‌ యాదవ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

మీ నగరం నుండి (​హైదరాబాద్)

తెలంగాణ
​హైదరాబాద్
తెలంగాణ
​హైదరాబాద్
Published by:Madhu Kota
First published:

Tags: Accident, Hyderabad, Minister talasani srinivas, Police, Sai kiran, Trs

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు