Home /News /telangana /

HYDERABAD CASE AGAINST ACTRESS KANGANA RANAUT IN HYDERABAD ON SHIV SENA TELANGANA UNIT LEADERS COMPLAINT MKS

kangana ranaut : కంగనపై hyderabadలోనూ కేసు -శివసేన పార్టీ తెలంగాణ శాఖ ఫిర్యాదుతో..

కంగనపై హైదరాబాద్ లో కేసు

కంగనపై హైదరాబాద్ లో కేసు

స్వాతంత్ర్యపోరాటాన్ని కించపరుస్తూ వివాదాస్పద కామెంట్లు చేసిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పై వెల్లువలా పోలీస్ కేసులు నమోదవుతున్నాయి. హైదరాబాద్ లోని నారాయణగూడ పోలీస్ స్టేషన్ లోనూ శనివారం మరో కేసు నమోదైంది. శివసేన పార్టీ తెలంగాణ శాఖ నేతల ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. వివరాలివి..

ఇంకా చదవండి ...
స్వాతంత్ర్యపోరాటాన్ని కించపరుస్తూ వివాదాస్పద కామెంట్లు చేసిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పై వెల్లువలా పోలీస్ కేసులు నమోదవుతున్నాయి. దేశ వ్యాప్తంగా పలు పార్టీల నేతలు కంగనా వ్యాఖ్యలను ఖండిస్తూ, ఆమె పద్మశ్రీని వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో కంగనపై కేసులు నమోదయ్యాయి. ఇటు తెలంగాణలోనూ నటిపై తొలి కేసు నమోదైంది..

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్‌పై హైదరాబాద్‌లోని నారాయణగూడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దేశస్వాతంత్ర్యం గురించి అవమానకరంగా మాట్లాడారంటూ కంగనాపై తెలంగాణ శివసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుదర్శన్ ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. ఫిర్యాదు అనంతరం శివసేన నేత సుదర్శన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘1947లో మనకు వచ్చింది భిక్ష మాత్రమే. 2014లో అసలైన స్వాతంత్ర్యం వచ్చిందని కంగనా అంటున్నారు. ఒక భారతీయురాలు అయ్యుండి ఇలా మాట్లాడటం ఏంటి? కంగనా పిచ్చి కూతలు మానుకోవాలి. ఆమెను వెంటనే అరెస్ట్ చేయాలి. ఇమెకు ఇచ్చిన పద్మశ్రీ అవార్డును వెనక్కి తీసుకోవాలి’అని డిమాండ్ చేశారు.

encounter : మావోయిస్టులకు భారీ షాక్ -మరో అగ్రనేత తేల్తుంబ్డే సహా 26మంది హతం -Gadchiroli తాజా అప్‌డేట్స్


రెండు రోజుల కిందట ఓ జాతీయ మీడియా నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ దేశ స్వాతంత్రం గురించి కంగనా రనౌత్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. కాగా, వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో కంగనాపై కేసు నమోదు చేశారు. ఆమెను అరెస్ట్ చేయాలని, పద్మశ్రీ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

hyderabad : కోడి కూరలో విషం -ప్రియుడి కోసం తండ్రిపై మైనర్ బాలిక దారుణం -ఎన్నో ట్విస్టులు


కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, ఎన్సీపీ, శివసేన పలు పార్టీల నేతలు నేరుగా ఆయా రాష్ట్రాల్లో పోలీసులకు ఫిర్యాదులు చేయడంతోపాటు కంగనపై దేశద్రోహం కేసు పెట్టేలా ఆదేశించాలని డిమాండ్లు చేస్తున్నారు. పలువురు కాంగ్రెస్ నేతలు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను ట్యాగ్ చేసి కంగన పద్మశ్రీని వెనక్కి తీసుకోవాలన్నారు. డ్రగ్స్ మత్తులోనే కంగన దేశస్వాతంత్ర్యాన్ని కించపర్చారని ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఎద్దేవా చేశారు. బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ కూడా కంగన కామెంట్లను తప్పుపట్టారు.
Published by:Madhu Kota
First published:

Tags: Hyderabad, Kangana Ranaut, Police Case, Shiv Sena

తదుపరి వార్తలు