హోమ్ /వార్తలు /తెలంగాణ /

Crime news : ఆ ఒక్క మాటతో ఆంటీ మనసు దోచుకున్నాడు.. తన కోరిక తీరగానే ఆ విధంగా బ్లాక్‌మెయిల్

Crime news : ఆ ఒక్క మాటతో ఆంటీ మనసు దోచుకున్నాడు.. తన కోరిక తీరగానే ఆ విధంగా బ్లాక్‌మెయిల్

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Crime News: ఆమె భర్తతో ఉండలేక విడిపోయింది. బిడ్డతో కలిసి జీవిస్తున్న ఆమెపై ఓ వ్యక్తి కన్నేశాడు. నమ్మించి లోబర్చుకున్నాడు. శారీరకంగా ఆరు నెలలు వాడుకొని తర్వాత హ్యాండిచ్చాడు. ఇదేమిటని నిలదీస్తే ..ఫోటోలు చూపించి బ్లాక్ మెయిల్ చేశాడు. ఇదంతా ఎక్కడ జరిగిందంటే.

ఇంకా చదవండి ...

కుటుంబ కలహాలతోనే భర్తను వదిలి కూతుర్ని తీసుకొని వచ్చి విడిగా బ్రతుకుతోంది ఓ మహిళ. ఒంటరి మహిళ కావడంతో ఓ వ్యక్తి ఆమెను ట్రాప్ చేశాడు. ఏం చెబితే ఆమె నమ్ముతుందో అదే మాటలు చెప్పి ఆమెను తన దారిలోకి తెచ్చుకున్నాడు. ఆమెనుపెళ్లి చేసుకుంటానని కూతుర్నిబాగా చూసుకుంటానని చెప్పి ఆరు నెలల(Six months) పాటు ఆమెతో వివాహేతర సంబంధం(Extramarital affair) కొనసాగించాడు. తీరా పెళ్లి(Wedding) చేసుకోమని చెప్పడంతో ఆ కోపంతో చివరకు ఆమెను బ్లాక్‌మెయిల్(Blackmail)చేయడం మొదలుపెట్టాడు. అతడి టార్చర్‌ని భరించలేక పోలీసులకు తన గోడు చెప్పుకుంది.

Hyderabad | Heavy rain : 2గంటల పాటు కురిసిన వర్షానికి జంటనగరాలు జలదిగ్భందం..వీడియోలు చూడండివివాహితకు వల వేసిన వ్యక్తి..

హైదరాబాద్‌ ఎస్‌ఆర్‌నగర్‌లో పార్వతి అనే మహిళ టైలరింగ్ చేస్తూ బిడ్డను పోషించుకుంటోంది. అదే ప్రాంతానికి చెందిన అమర్‌తేజ అనే వ్యక్తి ఆమెను పరిచయం చేసుకున్నాడు. ఒంటరిగా ఉండటంతో ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. ఆమె బిడ్డను బాగా చూసుకుంటానని చెప్పి దగ్గరయ్యాడు. అమర్‌తేజ చెప్పిన మాటలకు పడిపోయింది పార్వతి. అతనితో శారీరక సంబంధం పెట్టుకుంది. ఇలా సుమారు ఆరు నెలల పాటు ఇద్దరూ సహజీవనం చేస్తూ వచ్చాడు అమర్‌తేజ. పెళ్లి విషయంలో ప్రియుడిపై ఒత్తిడి చేస్తూ వచ్చింది బాధితురాలు. అమర్‌తేజ తప్పించుకోవడంతో అనుమానం వచ్చి కూపీ లాగడంతో అసలు విషయం బయటపడింది.

ఫోటోలు చూపించి బ్లాక్‌మెయిల్..

అమర్‌తేజకు పెళ్లి జరిగినట్లుగా బాధితురాలికి తెలియడంతో ప్రియుడ్ని నిలదీసింది. అప్పటి వరకు ఆమెను శారీరకంగా ఉపయోగించుకున్న అమర్‌తేజ..పార్వతి నిలదీయడంతో రివర్స్ అయ్యాడు. గతంలో ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు దిగిన ఫోటోలను చూపిస్తూ బ్లాక్‌మెయిల్ చేశాడు. ప్రియుడు చేసిన మోసాన్ని భరించలేకపోయిన బాధితురాలు చందానగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇద్దరియీ కౌన్సిలింగ్‌ చేసి పంపారు. అయినా అతడిలో మార్పు రాలేదు.

PM Modi | Telangana : అతిపెద్ద తేలాడే సోలార్ ప్లాంట్ -నేడు ప్రధాని మోదీచే ప్రారంభం..


భర్తను వదిలి వస్తే ...

ఇంత జరిగినప్పటికి అమర్‌తేజలో మార్పు రాకపోగా.. తన కోరిక తీర్చాలని..లేదంటే కలిసి దిగిన ఫోటోలను బంధువులతో పాటు సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేస్తానని, చంపుతానంటూ భయపెడుతూ వచ్చాడు. దాంతో బాధితురాలు తిరిగి కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. అతని దగ్గరున్న ఫోటోలను స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నంకు చెందిన బాధితురాలు రెండేళ్ల క్రితమే కలహాల కారణంగా భర్తను వదిలి వచ్చింది. ఇప్పుడు ప్రియుడు మోసం చేయడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో చేరింది.

Published by:Siva Nanduri
First published:

ఉత్తమ కథలు