హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad | Amit Shah : అమిత్‌షా పర్యటనలో భద్రత వైఫల్యం..కాన్వాయ్‌కి అఢ్డొచ్చిన గుర్తు తెలియని వాహనం

Hyderabad | Amit Shah : అమిత్‌షా పర్యటనలో భద్రత వైఫల్యం..కాన్వాయ్‌కి అఢ్డొచ్చిన గుర్తు తెలియని వాహనం

Amit Shah

Amit Shah

Hyderabad: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తెలంగాణ పర్యటనలో మరోసారి భద్రత వైఫల్యం కొట్టొచ్చినట్లుగా కనిపించింది. హైదరాబాద్‌లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు హాజరైన అమిత్‌షా కాన్వాయ్‌కి గుర్తు తెలియని ఓ కారు అడ్డురావడంతో భద్రత సిబ్బంది అప్రమత్తమయ్యారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తెలంగాణ పర్యటనలో మరోసారి భద్రత వైఫల్యం కొట్టొచ్చినట్లుగా కనిపించింది. హైదరాబాద్‌లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు హాజరైన అమిత్‌షా కాన్వాయ్‌కి గుర్తు తెలియని ఓ కారు అడ్డు వచ్చింది. కారు వెంటనే పక్కకు తీయకపోవడంతో అమిత్‌షా సెక్యురిటీ సిబ్బంది కారు అద్దాలు పగలగొట్టారు. ఈసంఘటన హరిత ప్లాజా సమీపంలో చోటుచేసుకుంది. అయితే కేంద్రమంత్రి కాన్వాయ్‌కి అడ్డుపెట్టిన కారు ఎవరికి...ఎందుకు అలా జరిగిందనే విషయంపై భద్రత సిబ్బంది ఆరా తీస్తున్నారు.

త్యాగధనులకు నివాళులు..

తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అమిత్‌షా హైదరాబాద్‌ను భారతదేశంలో చేర్చడంతో పాటు నిజాం పాలన యొక్క క్రూరత్వాల నుండి ప్రజలను విముక్తి చేసిన ఉక్కు మనిషి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కొనియాడారు. ఆయన్ని స్మరించుకుంటూ భారతమాత నివాళులు అర్పించారు అమిత్‌షా.

Published by:Siva Nanduri
First published:

Tags: Amit Shah, Hyderabad, Telangana News

ఉత్తమ కథలు