హోమ్ /వార్తలు /తెలంగాణ /

Car accident: మద్యం మత్తులో అమ్మాయిలు... జూబ్లీహిల్స్‌ చెక్‌ పోస్ట్‌ వద్ద కారుతో బీభత్సం.. !

Car accident: మద్యం మత్తులో అమ్మాయిలు... జూబ్లీహిల్స్‌ చెక్‌ పోస్ట్‌ వద్ద కారుతో బీభత్సం.. !

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

జూబ్లీహిల్స్‌ చెక్‌ పోస్ట్‌ వద్ద కారు బీభత్సం చేసింది. ఈ ఘటనకు కారణం అమ్మాయిలు. ఫుల్‌గా మద్యం తాగి అమ్మాయిలు కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

హైదరాబాద్‌లో నైట్ అయితే అమ్మాయిలు... అబ్బాయిలు పబ్బులకు...పార్టీలకు వెళ్లడం కామన్. అక్కడ తాగినోళ్లంతా తాగి.. తిరిగి అర్థరాత్రి ఎప్పుడో ఇళ్లకు వెళ్తుంటారు. నగరంలోని కాస్ట్లీ ఏరియాలు అయినా... జూబ్లీ హిల్స్, బంజార హిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ వంటి ప్రాంతాల్లో నైట్ అయితే పబ్బులన్నీ రద్దీగా ఉంటాయి. అయితే కొందరు... తాగి మద్యం మత్తులో ప్రమాదాలు చేస్తుంటారు. ఇలా చాలామంది ఒప్పటికే... పోలీసులకు అడ్డంగా దొరికారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌తో గతంలో కొందరు ప్రముఖుల పిల్లలు కూడా పోలీసులుకు పట్టుబడ్డారు.

అయితే తాజాగా  నగరంలోని జూబ్లీహిల్స్‌ చెక్‌ పోస్ట్‌ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. హై స్పీడ్‌తో వెళ్తున్న ఓ  కారు డివైడర్ ను ఢీకొట్టింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కొందరు యువతులు మద్యం మత్తులో కారు అతివేగంగానడిపినట్టు పోలీసులు గుర్తించారు. ఫుల్‌గా డ్రింక్ చేసి... కారులో షికార్లు చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని సమాచారం. దీంతో కారు అదుపు తప్పి దూసుకువస్తుండటంతో భయంతో అక్కడున్న జనం అంతా పరుగులు తీశారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే  యువతులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై..కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో కారు పాక్షికంగా దెబ్బతిన్నట్లు  పోలీసులు పేర్కొన్నారు.  ప్రమాదానికి గురైన కారు రోడ్డుపై నిలిపోవడంతో దాన్ని అక్కడ్నుంచి తొలగించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కారు ఫిల్మ్ నగర్ వైపు నుంచి చెక్ పోస్ట్ వైపునకు వస్తుండగాఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి కారణమైన యువతుల వివరాలు ఏవీ ఇంతవరకు బయటకు రాలేదు.

First published:

Tags: Car accident, Hyderabad, Local News

ఉత్తమ కథలు