హోమ్ /వార్తలు /తెలంగాణ /

Road Accident : నాగోల్‌లో రోడ్డు ప్రమాదం .. వ్యక్తిని బలంగా ఢీకొట్టిన కారు

Road Accident : నాగోల్‌లో రోడ్డు ప్రమాదం .. వ్యక్తిని బలంగా ఢీకొట్టిన కారు

రోడ్డు ప్రమాద దృశ్యం

రోడ్డు ప్రమాద దృశ్యం

Road Accident : రోడ్డు ప్రమాదాల్లో ఎవరో ఒకరిది తప్పు ఉంటుంది. మరి ఈ ఘటనలో ఏం జరిగింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

హైదరాబాద్.. నాగోలులో.. రోడ్డుపై నడుస్తూ వెళ్తున్న వ్యక్తిని ఓ కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో తప్పు ఆ వ్యక్తిదే. అతను రోడ్డుపై మొబైల్ చూసుకుంటూ.. రాంగ్ రూట్‌లో వస్తున్నాడు. అతనికి ఎదురుగా ఓ కారు దూసుకొచ్చింది. కారు దగ్గరి దాకా వచ్చినప్పుడు అతను కారును చూశాడు. సరిగ్గా అదే సమయంలో కారు అతన్ని ఢీకొట్టడంతో.. గాల్లోకి ఎగిరి 15 అడుగుల దూరంలో పడ్డాడు. వెంటనే స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించారు.

ప్రమాదం తర్వాత ఆ కారు.. ఎదురుగా ఉన్న స్తంభాన్ని ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ఘటనలో ఆ కారు కూడా అతి వేగంతో వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఆ ఏరియాలో అంత వేగం ఎక్కువే అనిపిస్తోంది.

ఈ ఘటనలో గాయపడిన వ్యక్తిని జైకుమార్‌గా గుర్తించారు. ప్రస్తుతం అతనికి ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ అందుతోంది. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాన్ని అక్కడి సీసీటీవీ రికార్డ్ చేసింది.

First published:

Tags: Hyderabad, Road accident

ఉత్తమ కథలు