హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad: ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వారి డ్రైవింగ్ లైసెన్సుల రద్దు ..ఒక్క రోజులో ఎంత మంది అంటే..?

Hyderabad: ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వారి డ్రైవింగ్ లైసెన్సుల రద్దు ..ఒక్క రోజులో ఎంత మంది అంటే..?

HYDERABAD POLICE

HYDERABAD POLICE

Hyderabad: న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వారికి పోలీసులు భారీ షాక్ ఇచ్చారు. డిసెంబరు 31 రాత్రి నూతన సంవత్సర సంబరాలు చేసుకుని ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వారిలో ఎంత మంది డ్రైవింగ్ లైసెన్స్‌లు రద్దు చేశారో తెలిస్తే షాక్ అవుతారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

(M.Balakrishna,News18,Hyderabad)

న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ (Hyderabad)నగరంలో ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వారికి పోలీసులు (Police)భారీ షాక్ ఇచ్చారు. డిసెంబరు 31 రాత్రి నూతన సంవత్సర సంబరాలు చేసుకుని ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వారి 5819 డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేసినట్టు హైదరాబాద్ పోలీసులు తెలిపారు. ఇందులో డ్రంకన్ డ్రైవ్(Drunk drive)కేసులే అధికంగా ఉన్నాయని హైదరాబాద్ జాయింట్ ట్రాన్సుపోర్టు కమిషనర్ పాండురంగా నాయక్(Panduranga Naik) తెలిపారు. 2021లో  3220 మంది డ్రైవింగ్ లైసెన్సు(Driving license)లు రద్దు చేయగా ఈ ఏడాది భారీగా పెరిగాయి.

Telangana: చోరీ చేసినా ఇంట్లోనే ఒక రోజంతా నిద్రపోయిన దొంగ .. ఇక్క‌డే ఉంది ట్వీస్ట్

జోన్ల వారిగా కేసులు..

ఒక్క జోన్లో మినహా తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ, కేంద్ర జోన్లలో ఈ లైసెన్సులు రద్దు చేశారు. తూర్పు జోన్ మినహా మిగిలిన అన్ని జోన్లలో డ్రైవింగ్స్ లైసెన్సులు అధిక సంఖ్యలో రద్దు చేశామని నాయక్ ప్రకటించారు. నార్త్ జోన్లో 1103, దక్షిణ జోన్లో 1151, తూర్పు జోన్లో 510,వెస్ట్ లో 1345 డైవింగ్ లైసెన్సులు రద్దు చేశారు.సైబరాబాద్ లో డ్రంకెన్ డ్రైవింగ్ కేసులురోడ్డు ప్రమాదాలు తగ్గించడం కోసం డిసెంబరు 31 రాత్రి నుంచి జనవరి 1వ తేదీ ఉదయం వరకు జరిగే ప్రమాదాలు నివారించడంపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. నగర వ్యాప్తంగా డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు పెద్ద ఎత్తున నిర్వహించారు.  మందు కొట్టి డ్రైవింగ్ చేస్తున్న 1314  వారిపై కేసులు కూడా నమోదు చేశారు.

ఎంజాయ్‌మెంట్ పేరుతో ..

తెలంగాణలో ప్రమాదాలు ఎక్కువేతెలంగాణలో డ్రంకెన్ డ్రైవ్ కేసులు ఏటా భారీగా పెరిగిపోతున్నాయి. జాతీయ నేర గణాంకాల ప్రకారం తెలంగాణలోని పురుషుల్లో సగం మంది  ఆల్కహాల్ సేవిస్తున్నారని తేలింది. దీంతోపాటు తెలంగాణలో 2 కోట్ల ద్విచక్ర వాహనాలు 30 లక్షల కార్లు ఉన్నాయి. హైదరాబాద్ నగరం కూడా వేగంగా విస్తరిస్తోంది. అర్థరాత్రి వరకు పనిగంటలు ఉంటున్నాయి. బార్లు రెస్టారెంట్లు, పబ్బులు అర్థరాత్రి దాటినా నడుస్తూనే ఉన్నాయి. దీంతో వీకెండ్ ఆనందం కోసం అనేక మంది ఆల్కహాల్ సేవిస్తున్నారు. ఆ తరవాత ఇంటికి చేరుకునేందుకు డ్రైవింగ్ చేస్తున్నారు. దీంతో ప్రమాదాలు వేగంగా పెరుగుతున్నాయి.

తగ్గేదేలే ..

పోలీసులు ప్రత్యేక డ్రైవ్ లురోడ్డు ప్రమాదాలు నివారించేందుకు నగర పోలీసులు పెద్ద ఎత్తున స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నారు. వేలాదిగా డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేస్తున్నారు. తాగి వాహనం నడిపితే రూ.10వేల జరిమానా విధిస్తున్నారు. అయినా మందుబాబులు తగ్గడం లేదు. మొదటిసారి ఫైన్ తో వదిలేస్తున్న పోలీసులు, తరవాత డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తున్నారు. అయినా తాగి వాహనాలు నడిపే కేసులు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది.

First published:

Tags: Hyderabad police, Telangana News

ఉత్తమ కథలు