హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad:క్యాష్ ఉంటేనే క్యాబ్ బుకింగ్.. కుంటి సాకులతో రైడ్ క్యాన్సిల్

Hyderabad:క్యాష్ ఉంటేనే క్యాబ్ బుకింగ్.. కుంటి సాకులతో రైడ్ క్యాన్సిల్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Hyderabad:హైదరాబాద్‌లో క్యాబ్, ఆటో సర్వీసులు ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. దూర ప్రదేశాల్లో రైడ్ బుక్‌ చేసుకుంటే వెళ్లడం లేదని విమర్శలు ఉన్నాయి. ఆన్‌లైన్‌ పేమెంట్స్ అయితే ట్రిప్ క్యాన్సిల్ చేసుకుంటున్నారు డ్రైవర్లు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్‌ని నమ్ముకున్న ప్రజలు కొత్త టైపు సమస్యల్ని ఫేస్ చేస్తున్నారు.

ఇంకా చదవండి ...

హైదరాబాద్‌(Hyderabad)లో ఏం కావాలన్నా కాళ్ల దగ్గరకు, కళ్ల ముందు ప్రత్యక్షమయ్యే విధంగా పరిస్థితి మారింది. నగరవాసులకు మెయిన్‌టెన్స్‌ కాస్త లగ్జరీ(Luxury)గా మారినప్పటికి సౌకర్యాల విషయంలో మాస్తంర కొదవలేదనే విధంగా ఉంది. ముఖ్యంగా కరోనా తర్వాత ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్‌(Private Transport)పై ఆధారపడిన చాలా మంది బిజినెస్ వర్క్స్, ఆఫీసులు, కాలేజీలు ఇతరత్ర పనుల కోసం క్యాబ్‌ సర్వీసులు(Cab services)ఉపయోగిస్తున్నారు. అయితే కొద్దిరోజుల క్రితం వరకు బాగానే ఉన్న క్యాబ్ ఫెసిలిటీ(Cab Facility)..ఇప్పుడు కొత్త చిక్కులు తెచ్చి పెడుతోంది. ముఖ్యంగా క్యాబ్‌ బుక్‌ చేసుకుంటే గతంలో ఎలాగైనా డబ్బులు చెల్లించే సౌకర్యం ఉండేది. ప్రస్తుతం అలా కుదరడం లేదు. క్యాష్ ఉంటనే క్యాబ్‌ దొరికే పరిస్థితి. నో ఆన్‌లైన్‌ పేమెంట్స్(Online Payments)...క్యాష్‌ (cash)ఇస్తేనే క్యాబ్ బుక్ అవుతుందనే విధంగా మారిపోయింది. డబ్బులు లేకపోతే క్యాబ్‌ ట్రిప్ క్యాన్సిల్(Ride Cancel)అవుతున్నాయి. క్యాబ్‌లే కాదు ఆటో సర్వీసులు సైతం ఇదే పరిస్థితి. బుక్‌ చేసుకున్న తర్వాత చివరి నిమిషంలో రైడ్ క్యాన్సిల్ కావడంతో ప్రయాణికులు చేతుల్లో డబ్బులు లేక..గమ్యస్థానాలకు సకాలంలో చేరుకోలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు.

సర్వీసులు సరిగా లేవు..

ఉబెర్, ఓలా వంటి గుర్తింపు కలిగిన సంస్థల క్యాబ్‌లు, ఆటోలైతే ప్రయాణికులకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. ఆర్టీఏ, పోలీస్‌ అధికారులు క్యాబ్ సర్వీసుల నిర్వాహణపై ఫోకస్ పెట్టకపోవడంతో కొందరు క్యాబ్ డ్రైవర్లకు ఆడిందే ఆట పాడిందే పాటగా తయారైంది. మోటర్ వెహికల్ చట్టం ప్రకారం ఎట్టిపరిస్థితుల్లో రైడ్ క్యాన్సిల్ చేయకూడదు. చేస్తే రూ.500 వరకు జరిమానా విధించవచ్చు. కాని దీన్ని ఎవరూ పకడ్బందీగా అమలు చేయడం లేదు. సిటీలో క్యాబ్స్, ఆటోలు నడిపే డ్రైవర్లలో పది ట్రిప్పుల్లో మూడు, నాలుగు రైడ్స్ క్యాన్సిల్ చేస్తున్నట్లుగా నగరపౌరులే చెబుతున్నమాట.

ట్రాన్స్‌పోర్ట్‌ పేరుతో టార్చర్..

క్యాష్ ఉంటేనే క్యాబ్‌ వచ్చే పరిస్థితితో పాటు సిటీకి కొద్దిగా దూరంలో ఉన్న ప్రయాణికులు క్యాబ్‌, ఆటో బుక్‌ చేసుకుంటే సమయానికి రాలేని దుస్థితి. అదేంటని అడిగితే డ్రైనర్‌ పేరుతో డ్రైవర్లు రైడ్ కన్ఫమ్ చేయకుండా గంటల తరబడి ప్యాసింజర్లను రోడ్లపై నిలబెడుతున్నారనే అపవాదు ఉంది. డోర్ టు డోర్ సర్వీస్‌ పేరుతో మొదలైన క్యాబ్‌ సర్వీసులు నగరవాసుల్ని ఇంత ఇబ్బందిపెడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఎవరికి వారే పనులు, ఊరి ప్రయాణాలపై బయటకు వెళ్లే కావడంతో క్యాబ్‌ సర్వీస్ ప్రొవైడర్స్, డ్రైవర్ల అరాచకాలు బయటకు రావడంలేదు.

అంతా బిజినెస్ ట్రిక్స్..

పెళ్లిళ్లు, ఫంక్షన్‌, పార్టీలకు సిటీ ఔట్స్‌ కట్స్‌కి క్యాబ్ బుక్ చేసుకుంటే వెళ్లడం సంగతి పక్కన పెడితే తిరిగి ఇంటికి చేరుకోవడం కష్టంగా మారుతోంది. దూర,భారాలను దృష్టిలో పెట్టుకొనే క్యాబ్, ఆటో డ్రైవర్లు సైతం ట్రిప్ క్యాన్సిల్ చేసుకుంటున్నారనే విమర్శలు నగరవాసుల నుంచి గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్‌ని నమ్ముకున్న వాళ్లకు ఎదురైన ప్రత్యక్ష అనుభవాలపై ఆటో, క్యాబ్ డ్రైవర్లు సైతం తెలివిగా సమర్ధించుకుంటున్నారు. రైడ్‌ దొరకని దూర ప్రదేశాలకు వెళ్లడం వల్ల రిటన్‌లో కాళీగా రావాల్సి వస్తోందని...దానికి తోడు డీజిల్ ధరలు పెరగడం, ఓలా, ఉబెర్‌ సంస్థలు ఇచ్చే కమీషన్లు గిట్టుబాటు కావడం లేదని తెలిపిగా తప్పించుకుంటున్నారు.

Published by:Siva Nanduri
First published:

Tags: Cab services, Greater hyderabad

ఉత్తమ కథలు