హోమ్ /వార్తలు /telangana /

Telangana Jobs: నిరుద్యోగులకు గుడ్​న్యూస్​.. ఖాళీల భర్తీపై కదిలిన యంత్రాంగం.. ఉన్నతాధికారులతో సీఎస్​ భేటీ..!

Telangana Jobs: నిరుద్యోగులకు గుడ్​న్యూస్​.. ఖాళీల భర్తీపై కదిలిన యంత్రాంగం.. ఉన్నతాధికారులతో సీఎస్​ భేటీ..!

మరికొద్దిరోజుల్లోనే తెలంగాణ (Telangana)రాష్ట్రంలో భారీగా ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామని అసెంబ్లీలో  ముఖ్యమంత్రి కేసీఆర్ (Telangana CM KCR) ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే వారి ఆశలన్నీ తీర్చడానికి అధికార యంత్రాంగం కదిలింది.

  మరికొద్దిరోజుల్లోనే తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఉద్యోగ (Telangana Jobs) ఖాళీలు భర్తీ చేస్తామని అసెంబ్లీలో  ముఖ్యమంత్రి కేసీఆర్ (Telangana CM KCR) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ ప్రకటనతో రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన గానీ, నోటిఫికేషన్ (Notification)​ గానీ ఇంతవరకూ విడుదల చేయలేదు. దీంతో నిరుద్యోగులు కొంత అసంతృప్తిలో ఉన్నారు. అయితే వారి ఆశలన్నీ తీర్చడానికి అధికార యంత్రాంగం కదిలింది. ఈ మేరకు ఖాళీల భర్తీకి కావలసిన చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన తదుపరి ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. ముందుగా ఆయా శాఖల్లో ఖాళీల (Vacancies) ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో భర్తీకి సంబంధించి ఆర్థికశాఖ (Financial department) ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన కసరత్తు కొన్నాళ్లుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ (CS Somesh Kumar) గురువారం ఆర్థిక (Finance), సాధారణ పరిపాలన (General administration), విద్య(Education), వైద్య (Medical), హోం శాఖల (Home department) కార్యదర్శులు, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.

  ఆయా శాఖల్లో ఉన్న ఖాళీల( job Vacancies) వివరాలు, వాటి పరిస్థితిపై చర్చించారు. తుది సమాచారం, వివరాల ఆధారంగా ఉద్యోగాల (Telangana Jobs) భర్తీకి నియామక సంస్థలకు అనుమతిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది. అనంతరం ఆయా సంస్థలు నియామక ప్రక్రియను ప్రారంభిస్తాయి.

  అసెంబ్లీ ప్రారంభమైన వెంటనే..

  మార్చి 9న అసెంబ్లీ ప్రారంభమైన వెంటనే ప్రసంగం ప్రారంభించిన సీఎం కేసీఆర్ (CM KCR)... ఉద్యోగాల (Telangana Jobs) పై కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో ప్రస్తుతం మొత్తం 91,142 ఖాళీలు ఉన్నాయని తెలిపారు. అందులో కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ పోగా.. మిగిలిన 80,039 పోస్టులకు ఇవాళ్టి నుంచే నోటిఫికేషన్లు విడుదల చేస్తామని సంచలన ప్రకటన చేశారు. 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు. పోలీస్ శాఖ మినహా ఉద్యోగార్థుల వయోపరిమితిని మరో 10 పదేళ్లకు పెంచుతున్నట్లు వెల్లడించారు సీఎం కేసీఆర్.

  95 శాతం ఉద్యోగాలు..

  95 శాతం ఉద్యోగాలు (Jobs in Telangana) స్థానికులే దక్కేలా రాష్ట్రపతి ఉత్తర్వులు తెచ్చామని.. దీనివల్ల అందరికీ అవకాశాలు వస్తాయని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. షెడ్యూల్ 9, 10 సంస్థల వివాదం పరిష్కారమైతే.. అక్కడ కూడా అవకాశాలు వస్తాయని తెలిపారు. మరో 10 నుంచి 20వేల ఉద్యోగాల ఉద్యోగాలు వచ్చే అవకాశముందని తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ తెలిపారు. ‘‘లక్షా 55 వేల పోస్టులను నోటిఫి చేశాం. లక్షా 30 వేలు భర్తీ అయ్యాయి. 22వేల ఉద్యోగాలకు ప్రాసెస్ జరుగుతుంది. ఏపీ వారితో పంచాయతీ రాకూడదనే ఉద్దేశంతోనే రాష్ట్రపతి ఉత్తర్వుల కోసం పంపించాం. కానీ చాలాకాలం పెండింగ్‌లో పెట్టారు. వెంటపడిమరీ చేయించుకున్నాం”అని అన్నారు కేసీఆర్​.

  First published:

  ఉత్తమ కథలు