• Home
  • »
  • News
  • »
  • telangana
  • »
  • HYDERABAD BUSY ON PHONE CALL NURSE GIVES DOUBLE DOSE VACCINE TO YOUNG LADY IN FEW MINUTES GAP IN RANGAREDDY DISTRICT SU

Hyderabad: షాకింగ్.. ఒకేసారి యువతికి రెండు డోసుల వ్యాక్సిన్.. ఇప్పుడు ఆమె ఆరోగ్యం ఎలా ఉందంటే..

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా కొనసాగుతుంది. యువత కూడా పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చి.. వ్యాక్సిన్ తీసుకుంటున్నారు.

  • Share this:
    తెలంగాణలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా కొనసాగుతుంది. యువత కూడా పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చి.. వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. అయితే వ్యాక్సిన్ తీసుకునేందుకు వెళ్లిన ఓ యువతికి మాత్రం షాకింగ్ అనుభవం ఎదురైంది. వ్యాక్సినేషన్ సెంటర్‌లో సిబ్బంది నిర్లక్ష్యం ఆమె ఇబ్బందికరంగా మారింది. ఎందుకంటే ఆమెకు నిమిషాల వ్యవధిలోనే రెండు డోసుల వ్యాక్సిన్ ఇచ్చారు. ఆ తర్వాత కొద్దిసేపటికే యువతి కళ్లు తిరిగి కింద పడిపోయింది. ఈ ఘటన హైదరాబాద్ నగర శివార్లలోని అబ్దులాపూర్ మెట్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. హయాత్‌నగర్ మండలం కుంట్లూరు రాజీవ్ గృహకల్ప కాలనీకి చెందిన 21 ఏళ్ల లక్ష్మీ ప్రసన్న కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవడానికి.. అబ్దుల్లాపూర్‌మెట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ ‌సెంటర్‌కు వచ్చింది.

    అయితే నిర్లక్ష్యంగా వ్యవహరించిన నర్సు పద్మ.. ఫోన్ మాట్లాడుతూ లక్ష్మీ ప్రసన్నకు వ్యాక్సిన్ ఇచ్చింది. నిమిషాల వ్యవధిలోనే రెండు డోసుల వ్యాక్సిన్ ఇచ్చింది. దీంతో వ్యాక్సిన్ తీసుకున్న లక్ష్మీ ప్రసన్న కొద్దిసేపటికే కళ్లు తిరిగి కింద పడిపోయింది. జరిగిన పొరపాటును గుర్తించిన సిబ్బంది వెంటనే ఆమెను వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం యువతిని ఆస్పత్రిలోనే అబ్జర్వేషన్‌లో ఉంచారు. ప్రస్తుతం లక్ష్మీ ప్రసన్న ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.

    చదవండి: Covid Vaccine: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న పురుషుల్లో వీర్య కణాల సంఖ్య తగ్గుతుందా..?

    ఇక, తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1,417 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,10,834కు చేరింది. తాజాగా కరోనాతో 12 మంది మరణించగా.. ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 3,546కి చేరింది. కొత్తగా కరోనా నుంచి 1,897 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 5,88,259కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 19,029 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
    Published by:Sumanth Kanukula
    First published: