హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad : స్పందించిన పీవిపీ కేసుకు సంబంధించి వివరణ .. చట్టప్రకారమే అంటూ ఓ వీడియో..

Hyderabad : స్పందించిన పీవిపీ కేసుకు సంబంధించి వివరణ .. చట్టప్రకారమే అంటూ ఓ వీడియో..

pvp file photo

pvp file photo

Hyderabad : ప్రముఖ వ్యాపార వేత్త, వైసీపీ నాయకుడు పొత్తూరి వరప్రసాద్ పై హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైన నేపథ్యంలో ఆయన తన వివరణ ఇచ్చారు. అంతా చట్టం ప్రకారమే చేస్తున్నామని, కావాలనే కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని వివరించారు.

ఇంకా చదవండి ...

ప్రముఖ వ్యాపారవేత్త ,వైసీపీ నాయకుడు పోట్లూరీ వరప్రసాద్ పై మరోసారి హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదుకావడంతో ఆయన ఆ కేసుపై స్పందించారు. ఆ కేసుకు సంబంధించి పలు అంశాలను ఆయన వివరించారు. తానపై ఇటివల కొంతమంది కావాలనే కేసులు పెడుతున్నారని చెప్పారు. ఇక కూల్చివేతలకు సంబంధించి హైకోర్టు ఆదేశాలనే తాము తాము అమలు పరిచామని, దాని ప్రకారం ఏ ఒక్క అతిక్రమణ కూడా చేయలేదని వివరించారు. ఇక దాడులు చేశారు. కుక్కలతో వదిలి బెదిరింపులకు దిగారనే వార్తలపై కూడా ఆయన స్పందించారు. తాము లేనప్పుడు ఇంట్లోకి వచ్చారని, ఒకవేళ తాము దాడులు చేస్తే అంత్యంత టెక్నాలజీ ఉన్న సంధర్భంలో బయటకు రాకుండా ఉంటాయా అని ప్రశ్నించారు. ఓ మీడియా సంస్థ కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇక కేసులకు సంబంధించి తాము ఎప్పుడు బయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఎలాంటీ తప్పు చేయలేదంటూ ఓ వీడియోను మీడియాకు విడుదల చేశారు.

కాగా నిన్న సాయంత్రం పోట్లూరీ వరప్రసాద్ పై మరోసారి హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 7లోని తాను కొనుగోలు చేసిన విల్లాలో డికే అరుణ కుమార్తె శృతి రెడ్డి ఇంట్లోకి ప్రవేశించి ఆమె స్వంతగా నిర్మించుకున్న ప్రహరి గోడతో పాటు రేకులను సైతం పీవిపీ అనుచరుడు బాలాజీ మరికొందరితో కలిసి జేసీబితో ధ్వంసం చేయించారు. అయితే దీనిపై ప్రశ్నించిన శృతిరెడ్డిని బెదిరింపులకు గురి చేసినట్టు తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పీవిపీతోపాటు సంఘటన స్థలంలో ఉన్న బాలాజీ అతనికి సహకరించిన మరికొందరిపై కేసు నమోదు చేశారు.


Khammam : ముందుగా మర్యాద రామన్న ఆ తర్వాత మున్నాభాయ్ ఎంబీబీఎస్.. మాములుగా లేదు కథ..

కాగా గతంలో పీవిపీ తన రియల్ కంపనీ ద్వారా ప్రేమ్ పర్వత్ విల్లాస్ అనే వెంచర్ వేసి వాటిని అమ్ముకున్నారు. అయితే విల్లాలు కొనుగోలు చేసిన వారు తమకు అనుకూలంగా ఇంటిని మార్చుకుంటుండడంతో ఆయన అడ్డుకుంటున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. ఇలా గత రెండు సంవత్సరాల క్రితం కూడా రెనోవేషన్ చేసుకుంటున్న ఇంట్లోకి ప్రవేశించి ఆ ఇంటిని కూలగొట్టినట్టు కేసు నమోదైంది. కాగా ఆ కేసు విచారణకు వెళ్లిన పోలీసులపైకి ఆయన కుక్కల్ని వదలడంతో ఆ కేసు సైతం వివాదస్పదమైంది. దీంతో ఆకేసులో ముందస్తు బెయిల్ తెచ్చుకోవడంతో కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతోంది. తాజాగా అదే తరహాలో కేసు నమోదు కావడంతో ఆయన స్పందించారు.

First published:

Tags: Hyderabad, Telangana

ఉత్తమ కథలు