(బాలకృష్ణ, న్యూస్18 తెలుగు, హైదరాబాద్)
ఎవరైనా వ్యవసాయం (Agriculture) చేయాలనుకుంటే ఏం ఉండాలి మొదట...సాగుకు అనుకూలంగా ఉండే భూమి ఉండాలి కదా? అయితే భూమితో పని లేకుండా వ్యవసాయం చేస్తే ఎలా ఉంటుంది? భూమి లేకుండా వ్యసాయం ఎలా చేస్తారు? ఇదెలా సాధ్యమని అనుకుంటున్నారా? ఏం మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమే. మట్టి అవసరం లేకుండా మనకు నచ్చిన పంటను సాగు చేయవచ్చు. ప్రస్తుతం చాలా ప్రచారంలో ఉన్న ఈ విధానాన్ని హెడ్రోపోనిక్ ఫార్మింగ్ (Hydroponic Farming) అంటారు. ప్రస్తుతం ఒక గజం స్థలం దొరకడమే గగనమవుతున్న రోజుల్లో ఈ విధానంలో వ్యవసాయం చేసే విధానం ఇప్పుడు అందర్ని ఆకట్టుకుంటుంది. ఈ విధానంలో మన ఇంట్లో లేదా బాల్కనిలోనే వ్యవసాయం చేయవచ్చు.
సొంతంగా వ్యాపారం చేయాలనుకుంటున్నారా? అయితే, ఈ బిజినెస్ తో నెలకు రూ.40 వేల ఆదాయం
ప్రస్తుతం ఇదే విధానంలో హైదరాబాద్(Hyderabad) చెందిన సత్యనారాయణ వ్యవసాయం చేస్తూ నెలకు లక్షల్లో సంపాధిస్తున్నారు. ఆయన్ను న్యూస్ 18 టీమ్ పలకరించింది. హైడ్రోపోనిక్ విధానంలో వ్యవసాయం ఎలా చేయాలి? ఎంతో స్థలం ఉండాలి? ఎలాంటి పంటను పండిస్తే ఎక్కువ లాభాలు వస్తాయి? వంటి అంశాలను ఆయన న్యూస్ 18కి వివరించారు. హెడ్రోపోనిక్ విధానం అంటే మట్టితో పని లేకుండా వ్యవసాయం చేయడం. అంటే మట్టి నుంచి మొక్కకు దొరికే పోషకాలను నీరు ద్వారా అందిస్తూ వ్యవసాయం చేయడాన్ని హెడ్రోఫోనిక్ విధానం అంటారు. ఈ విధానంలో అన్ని పంటలను పండించవచ్చని చెబుతున్నారు సత్యనారాయణ రెడ్డి. ఇక్కడ మొక్క పెరడానికి మట్టిని బదులు కొబ్బరి పీచును ఉపయోగిస్తారు. మట్టిలో సహజసిద్ధంగా లభించే పోషకాలను నీటి ద్వారా అందించి మొక్కలను పెంచారు.
Recession: అమెరికాలో ఆర్థిక మాంద్యంతో భారత్‌కు లాభం చేకూరనుందా ?
''నేను ఈ హెడ్రోపోనిక్ విధానాన్ని జపాన్‌లో 2010లో చూశాను. ఇండియా వచ్చి ఇక్కడ ఇదే విధానంలో సాగు చేస్తే ఎలా ఉంటుందని ట్రై చేశాను. తొలత మా ఇంటి బాల్కనీలో కొద్దిపాటి సాగు ప్రారంభించాను. ఐతే అవగాహన లేకపోవడం వల్ల సరైన ఫలితాలు రాలేదు.ఆ తర్వాత ఇదే అంశంపై చాలా స్టడీ చేసి.. 2019లో ఒక స్టార్టప్‌లా ప్రారంభించాను. ఇన్ఫినిటీ ఫార్మింగ్ పేరుతో ఒక సంస్థను ప్రారంభించి మట్టి లేకుండా వ్యవసాయం చేస్తున్నా. పంట ఉత్పత్తులను నగరంలో ఉన్న వివిధ సూపర్ మార్కెట్లకు సప్లై చేస్తున్నాం.'' అని సత్యనారాయణ తెలిపారు.
ఈ హెడ్రోపోనిక్ విధానంలో ఎవరైనా వ్యవసాయం చేయాలనుకుంటే టెర్రస్‌పైన లేదా బాల్కనిలో కొంచెం స్థలం ఉంటే సరిపోతుంది. అందుబాటులో ఉన్న స్థలంలోనే హెడ్రోపోనిక్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి మనకు నచ్చిన పంటను వేసుకోవచ్చు. ఎక్కువగా ఆకుకూరలు, బ్రకోలి లాంటి పంటలను ఈ విధానంలో పండించుకుంటే మంచి గిట్టుబాటు అవుతుందని న్యూస్ 18తో తెలిపారు సత్యనారాయణ. హెడ్రోపోనిక్ విధానంలో వ్యవసాయం చేయలానుకుంటే మనకున్న స్థలాన్ని బట్టి పెట్టుబడి అవుతుంది. 2000 గజాల స్థలంలో హైడ్రోపోనిక్ వ్యవసాయం చేయడానికి పాలి హౌస్‌తో పాటు ఇతర ఖర్చులు కలుపుకోని దాదాపు 16 లక్షల వరకు అవుతుంది. ఇది
వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే. ఇందులో ప్రస్తుతం మార్కెట్లో గిట్టుబాటు ఉన్న పంటలు పండిస్తే నెలకు రూ.4 లక్షల నుంచి 6 లక్షల వరకు కూడా సంపాందించవచ్చని చెబుతున్నారు సత్యనారాయణ.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Agriculture, Farmer, Hyderabad