• Home
  • »
  • News
  • »
  • telangana
  • »
  • HYDERABAD BUSINESSMAN ADOPTS ROYAL TIGER NAMED PRABHAS IN NEHRU ZOOLOGICAL PARK MK

కరోనా కష్టకాలంలో పారిశ్రామిక వేత్త దాతృత్వం...రాయల్ బెంగాల్ టైగర్ దత్తత...

రాయల్ బెంగాల్ టైగర్ ప్రభాస్

ఆరిజెన్ ఫార్మాస్యూటికల్ సర్వీసెస్ లిమిటెడ్ సీఈవో, రవి వెంకటరమణన్ జూపార్కులోని రాయల్ బెంగాల్ టైగర్‌ను సంవత్సరం పాటు అన్ని ఖర్చులు భరించేలా దత్తత తీసుకున్నారు.

  • Share this:
    కోవిడ్ ప్రభావం మూగజీవాలపై కూడా పడింది. హైదరాబాద్ లోని నెహ్రూ జువాలాజికల్ పార్క్ లాక్ డౌన్ కారణంగా మూసివేశారు. దీంతో నిధుల కటకట ఏర్పడింది. అయితే కొందరు దాతలు మాత్రం జంతువులను దత్తత తీసుకొని తమ దాతృత్వం చాటుకుంటున్నారు. తాజాగా ఆరిజెన్ ఫార్మాస్యూటికల్ సర్వీసెస్ లిమిటెడ్ సీఈవో, రవి వెంకటరమణన్ జూపార్కులోని రాయల్ బెంగాల్ టైగర్‌ను సంవత్సరం పాటు అన్ని ఖర్చులు భరించేలా దత్తత తీసుకున్నారు. పులి ఖర్చుల నిమిత్తం లక్ష రూపాయల చెక్కును నెహ్రూ జూలాజికల్ పార్క్ క్యురేటర్ ఎ. నాగమణికి అందించారు. కాగా దత్తత తీసుకున్న పులి అసలు పేరు ప్రభాస్ కావడం విశేషం.

    నెహ్రూ జూలాజికల్ పార్క్ క్యురేటర్ ఎ. నాగమణికి చెక్కు అందిస్తున్న ఆరిజెన్ ఫార్మాస్యూటికల్ సర్వీసెస్ లిమిటెడ్ సీఈవో, రవి వెంకటరమణన్


    కాగా ఒక సంవత్సరం పాటు రాయల్ బెంగాల్ పులిని దత్తత తీసుకోవటానికి దాత రవి వెంకటరామన్ ఆసక్తి చూపినందుకు క్యూరేటర్ నాగమణి ధన్యవాదాలు తెలిపారు. కరోనా నేపథ్యంలో వన్యప్రాణులను కాపాడేందుకు జూ పార్కులో పరిరక్షణ కార్యక్రమాన్ని చేపట్టామని. అయితే నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో జంతువులను దత్తత తీసుకోవడానికి ఎక్కువ మంది ముందుకు వస్తున్నారని, ఆమె తెలిపారు. అలాగే ఈ కష్ట కాలంలో జంతువులను ఆదుకునేందుకు జంతు ప్రేమికులు ముందుకురావాలని ఆమె అభ్యర్థించారు.
    Published by:Krishna Adithya
    First published: