హోమ్ /వార్తలు /తెలంగాణ /

Business Idea: చెత్తతో అదిరిపోయే వ్యాపారం.. ప్రతి నెలా లక్షల్లో ఆదాయం

Business Idea: చెత్తతో అదిరిపోయే వ్యాపారం.. ప్రతి నెలా లక్షల్లో ఆదాయం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Business Ideas: రీసైక్లింగ్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముందు.. మీ చుట్టూ ఉంటే వ్యర్థ పదార్థాలను సేకరించాల్సి ఉంటుంది. చెత్తను తొలగించే వారి నుంచి కూడా వీటిని కొనుగోలు చేయవచ్చు. లేదంటే మున్సిపల్ కౌన్సిల్ నుంచి కూడా వ్యర్థాలు తీసుకోవచ్చు

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఈ రోజుల్లో బిజినెస్ (Business Ideas) చేసేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. లక్ష కంటే తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో అధిక లాభాలిచ్చే వ్యాపారాలు చాలా ఉన్నాయి. వాటిలో రీసైక్లింగ్ బిజినెస్ కూడా ఒకటి. ప్రతి రోజూ ఇంట్లో చెత్త పేరుకుపోతుంది. ఆ చెత్తను మున్సిపాలిటీ వారు సేకరిస్తారు. ఐతే అందులో మనకు పనికి వచ్చేవి చాలానే ఉంటాయి. వాటిని రీసైకిల్ చేసి.. భారీగా సంపాదించవచ్చు. కేవలం రూ.15వేల పెట్టుబడితో రీసైక్లింగ్ బిజినెస్ ప్రారంభించవచ్చు. ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా.. బాగా కష్టపడితే.. భవిష్యత్ అంతా బంగారుమయం అవుతుంది.

అధిక వేతనంపై పింఛన్లు పొందే వారికి EPFO భారీ షాక్.. విశ్రాంత ఉద్యోగుల్లో ఆందోళన..

రీసైక్లింగ్ వ్యాపారం చాలా పెద్దది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 2 బిలియన్ టన్నుల కంటే ఎక్కువ వ్యర్థాలు ఉత్పత్తి అవుతాయి. మన భారతదేశంలో 277 మిలియన్ టన్నులకు పైగానే  చెత్త ఉత్పత్తి అవుతుంది. ఇతర భారీ మొత్తంలో వ్యర్థాలను నిర్వహించడం చాలా కష్టమైన పని. ఈ క్రమంలోనే చాలా మంది ఆ చెత్తను రీసైక్లింగ్ చేసి అద్భుతాలు సృష్టిస్తున్నారు. చెత్తతో ఇంటి అలంకరణ వస్తువులు, ఆభరణాలు, వేస్ట్ మెటీరియల్‌తో పెయింటింగ్‌లు వంటి వాటిని తయారు చేస్తూ..ఎంతో మంది వ్యాపారం చేస్తున్నారు. నెలనెలా లక్షలు సంపాదిస్తున్నారు.

 ఎంఎంటీఎస్ ప్రయాణికులకు అలర్ట్.. మార్చి 25 వరకు ఈ సర్వీసులు రద్దు.. వివరాలివే

రీసైక్లింగ్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముందు.. మీ చుట్టూ ఉంటే వ్యర్థ పదార్థాలను (Waste Materials) సేకరించాల్సి ఉంటుంది. చెత్తను తొలగించే వారి నుంచి కూడా వీటిని కొనుగోలు చేయవచ్చు. లేదంటే మున్సిపల్ కౌన్సిల్ నుంచి కూడా వ్యర్థాలు తీసుకోవచ్చు. చెత్తను సేకరించిన తర్వాత వాటిని పూర్తిగా శుభ్రం చేయాలి. ఇప్పుడు వాటి నుంచి ఎన్నో రకాల వస్తువులను తయారు చేయవచ్చు. చెత్తను పూర్తిగా శుభ్రం చేయాలి. ఉదాహరణకు టైర్ల నుండి టైర్ సీటింగ్ చైర్ తయారు చేయవచ్చు. అమెజాన్‌లో దీని ధర దాదాపు రూ.700. అంతే కాకుండా కప్, వుడెన్ క్రాఫ్ట్, కెటిల్, గ్లాస్, దువ్వెన, ఇతర గృహాలంకరణ వస్తువులను కూడా తయారు చేయవచ్చు.

మీరు తయారు చేసిన వస్తువులను మార్కెటింగ్ చేయాలి. నేరుగా విక్రయించవచ్చు. లేదంటే ఈ రోజుల్లో ఎన్నో ఈకామర్స్ ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ , ఫ్లిప్‌కార్ట్ సైట్లో వాటిని విక్రయించవచ్చు. ది కబాడీ.కామ్ స్టార్టప్ యజమాని శుభమ్ రీసైక్లింగ్ బిజినెస్‌కు సంబంధించి వివరాలను న్యూస్18తో పంచుకున్నాడు. ఈ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాడు? ఎలా సక్సెస్ అయ్యారు? అనే క్షుణ్ణంగా వివరించారు. మొదట్లో ముగ్గురు మిత్రులు కలిసి ఇంటింటికీ రిక్షా, ఆటోలతో చెత్తను సేకరించామని శుభమ్ చెప్పారు. ఇలా ఒక్కో మెట్టు ఎదిగి.. ఇప్పడు లక్షలు సంపాదిస్తున్నారు. ఇప్పుడు వారి ఒక నెల టర్నోవర్ ఎనిమిది నుంచి పది లక్షల రూపాయలకు చేరుకుంది. ఈ కంపెనీలు నెలలో 40 నుంచి 50 టన్నుల చెత్తను సేకరిస్తాయి. ఎంత ఎక్కువ చెత్తను సేకరిస్తే.. అన్ని ఉత్పత్తులను తయారు చేయవచ్చు. తద్వారా అధిక మొత్తంలో ఆదాయం వస్తుంది.

(Disclaimer: ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. ఈ వ్యాపారం ప్రారంభించే ముందు లోతైన అధ్యయనం చేయడం, సంబంధిత మార్కెట్ నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం)

First published:

Tags: Business, Business Ideas, Hyderabad, Local News

ఉత్తమ కథలు