ప్రస్తుతం ఎంతో మంది యువత తమ జాబ్స్‌ని వదిలిపెట్టి సొంతూళ్లకు వెళ్తున్నారు. తల్లిదండ్రుల వద్ద ఉంటూ సొంతంగా వ్యాపారం చేస్తున్నారు. అందులోనూ వ్యవసాయానికి (Agriculture Ideas) సంబంధించి బిజినెస్ (Business Ideas) చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. ఒకవేళ మీరు కూడా సొంతంగా వ్యాపారం చేయాలని భావిస్తుంటే.. అందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. అందులో ఇవాళ ఓ పంట గురించి తెలుసుకుందాం. ఇది తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఇస్తుంది. నెలల వ్యవధిలోనే లక్షలు సంపాదించవచ్చు. రెస్టారెంట్లలో వీటిని అధికంగా వినియోగిస్తారు. దోసకాయలతో సలాడ్‌లు చేస్తుంటారు.
Business Idea: ఈ వ్యాపారానికి పెట్టుబడి కేవలం రూ.10 వేలే.. కానీ, నెలకు రూ.లక్ష ఆదాయం.. ఓ లుక్కేయండి
దోసకాయలు (Cucumber Farming) నీరు పుష్కలంగా ఉన్న ఇసుక, లోమీ నేలల్లో బాగా పండుతుంది. నేల pH విలువ 6-7 మధ్య ఉండాలి. అధిక ఉష్ణోగ్రతలో సాగు చేస్తే దిగుబడి ఎక్కువగా ఉంటుంది. నదులు, చెరువుల పక్కన ఉండే భూముల్లో పండించవచ్చు. ఈ పంటను గ్రామాలతో పాటు నగరాల్లో కూడా సాగు చేయవచ్చు. దోస పంట సాగుకు ప్రభుత్వాలు సైతం సాయం చేస్తాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోరమైన విధానం ఉంటుంది. మీ సమీపంలోని వ్యవసాయ కేంద్రానికి వెళ్తే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుస్తాయి. దోసకాయ పంట కేవలం 60 నుంచి 80 రోజుల్లోచే చేతికి వస్తుంది. ఆ తర్వాత దోసకాయలను కోసి మార్కెట్లో విక్రయించవచ్చు.
నేటి నుంచి ఈ బ్యాంక్ కనిపించదు.. కస్టమర్లు గుర్తించుకోవాల్సిన 10 అంశాలివే
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Agriculture, Business Ideas, Farmers, Local News