హోమ్ /వార్తలు /తెలంగాణ /

Business Ideas: తల వెంట్రుకలు కోట్లు కురిపిస్తాయని మీకు తెలుసా? ఇలా చేస్తే డబ్బే డబ్బు

Business Ideas: తల వెంట్రుకలు కోట్లు కురిపిస్తాయని మీకు తెలుసా? ఇలా చేస్తే డబ్బే డబ్బు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Business Ideas: తిరుపతి వంటి పుణ్యక్షేత్రాల్ల నిత్యం వేలాది మంది తలనీలాలు సమర్పిస్తారు. అలా భక్తులు సమర్పించిన వెంట్రుకలను వేలంలో విక్రయిస్తారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తల వెంట్రుకలతో ప్రపంచవ్యాప్తంగా (Human Hair Business) కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. మన దేశంలోనూ వెంట్రుకలతో వ్యాపారం చేసే వారు చాలా మందే ఉన్నారు. వాటినే ఆదాయ వనరుగా మర్చుకొని.. విదేశాలకు ఎగుమతి చేసి.. కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారు. ఇండియా నుంచి దాదాపు 4 మిలియన్ డాలర్ల విలువైన జుట్టు విదేశాలకు ఎగుమతి అవుతోంది. 2020లో విదేశాలకు పంపిన తల వెంట్రుకల్లో 39 శాతం వార్షిక పెరుగుదల నమోదయింది. తల నుంచి కత్తిరించిన ఈ వెంట్రుకలతో కోట్లల్లో బిజినెస్ జరుగుతుంది. అందుకే గ్రామీణ ప్రాంతాలే కాదు.. పట్టణాల్లో కూడా ఇంటింటికీ వెళ్లి వెంట్రుకలను సేకరిస్తారు.

బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. రేపటి నుంచి 5 రోజులు సెలవులు.. మధ్యలో ఒక్కరోజే ఛాన్స్..

జుట్టు నాణ్యత బట్టి ధర ఉంటుంది. తక్కువలో తక్కువ.. కిలోకు రూ.8వేల నుంచి 10 వేల ధర పలుకుతుంది. వెంట్రుకల మరింత నాణ్యంగా ఉంటే ఈజీగా రూ.20వేల నుంచి 25 వరకు ధర లభిస్తుంది. ఎంత పొడవు ఉంటే.. అంత ఎక్కువ రేటు వస్తుంది. కోల్‌కతా, చెన్నై, ఏపీలోని వ్యాపారవేత్తలు హోల్‌సేల్‌గా వెంట్రుకలను కొనుగోలు చేస్తారు. ఆ వెంట్రుకలను విదేశాలకు ఎగుమతి చేసి.. కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. కోల్‌కతా నుంచి 90శాతం వెంట్రుకలను చైనాలోనే విక్రయిస్తున్నారు. ఐతే గుజరాత్ వెంట్రుకలకు మార్కెట్‌లో గిరాకీ ఎక్కువగా ఉంటుంది. అక్కడి వెంట్రుకలు దృఢంగా, మెరుస్తూ ఉండడం వల్లే డిమాండ్ అధికంగా ఉంటుంది. రేటు కూడా బాగుటుంది.

ఇన్‌కం ట్యాక్స్‌ రేట్లు సవరించే యోచనలో ప్రభుత్వం..? లేటెస్ట్‌ అప్‌డేట్‌ ఇదే..

ఈ వెంట్రుకలను హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌తో పాటు విగ్గుల తయారీలో వినియోగిస్తారు. కత్తిరించిన జట్టును శుభ్రం చేసి.. ఆ తర్వాత రసాయనాల్లో ఉంచుతారు. అనంతరం స్ట్రెయిట్ చేసి వాడుతారు. పూర్తిగా సిద్ధమైన తర్వాత చైనా వంటి విదేశాలకు ఎగుమతి చేస్తారు. వెంట్రుకల పొడవు కనీసం 8 అంగుళాలు ఉండాలి. అలాంటి వాటికే విదేశాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.

భారత దేశంలో స్వాతంత్య్రాని కంటే ముందు నుంచే వెంట్రుకల వ్యాపారం జరుగుతుంది. భారతీయ మహిళ జట్టు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే మనోళ్ల జట్టు చాలా పొడుగ్గా ఉంటుంది. నల్లగా మెరుస్తుంది. అందుకే వీటికి అధిక ధర లభిస్తుంది. రంగు వేయని జట్టుకైతే.. మార్కెట్లో మంచి రేటు వస్తుంది. బాగా పొడవు ఉండి.. నిగనిగలాడే దృఢమైన జట్టుకు.. కిలోకు రూ.50వేల వరకు చెల్లిస్తారు. ఆసియాలోని చైనా, మలేషియా, థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు, మయన్మార్ దేశాలకు పంపిస్తారు. అమెరికా, యూరప్‌లో దేశాలు కూడా భారత్ నుంచి వెంట్రుకలను కొనుగోలు చేస్తాయి.

మన దేశంలోని ప్రముఖ ఆలయాల్లో భక్తులు తలనీలాలు ఇస్తుంటారు.ముఖ్యంగా తిరుపతి వంటి పుణ్యక్షేత్రాల్ల నిత్యం వేలాది మంది తలనీలాలు సమర్పిస్తారు. అలా భక్తులు సమర్పించిన వెంట్రుకలను వేలంలో విక్రయిస్తారు. 2014లో రూ.220 కోట్ల వెంట్రుకలను విక్రయించారు. మీరు కూడా ఇలాంటి వ్యాపారం చేయాలనుకుంటే ఇంటికి ఇంటికీ తిరిగి జుట్టును సేకరించే వారితో పాటు ఆలయాలతో ఒప్పందం చేసుకోవచ్చు. అనంతరం ఆ వెంట్రుకలను పెద్ద పెద్ద కంపెనీలకు విక్రయించి.. భారీగా డబ్బు సంపాదించవచ్చు.

(Disclaimer: ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. ఈ వ్యాపారం ప్రారంభించే ముందు లోతైన అధ్యయనం చేయడం, సంబంధిత మార్కెట్ నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం)

First published:

Tags: Business, Local News

ఉత్తమ కథలు