కరోనా మహమ్మారి(Coronavirus) ఎంతో మంది జీవితాలను మార్చేసింది. ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డ వారు చాలా ఉన్నారు. ఐతే వారిలో చాలా మంది సొంతూర్లకు వెళ్లిపోయి వ్యవసాయం చేస్తున్నారు. తల్లిదండ్రుల అడుగు జాడల్లో నడుస్తూ రైతుగా మారుతున్నారు. మీకు ప్రస్తుతం జాబ్ లేకపోయినా.. ఉద్యోగం బోర్ కొడుతున్నా.. మీరు కూడా ఎంచక్కా వ్యవసాయం చేయవచ్చు. మార్కెట్లో ఉన్న డిమాండ్ ఉన్న పంటలను పండించి లక్షలు సంపాదించవచ్చు. అందులో ఒకటి జీలకర్ర సాగు (Cumin Farming). ప్రతి ఫ్యామిలీ దీనిని ఉపయోగిస్తుంది. వంటింట్లో తప్పకుండా ఉండాల్సి ఐటమ్ ఇది. అంతేకాదు జీలకర్రలో అనేక ఔష గుణాలు కూడా ఉన్నాయి. అందుకే మార్కెట్లో ఏడాది పొడవునా జీలకర్రకు డిమాండ్ ఉంటుంది. మరి జీలకర్ర సాగు ఎలా చేయాలి? ఎన్ని రోజులకు పంట వస్తుంది? ఎంత లాభం వస్తుందో ఇక్కడ తెలుసుకుందాం.
బ్యాంక్ కస్టమర్లకు హెచ్చరిక.. ఈ నెంబర్ బ్లాక్ లిస్ట్‌లో పెట్టేయండి, లేదంటే.
మనదేశంలో ఉత్పత్తి అవుతున్న జీలకర్రలో 80 శాతానికి పైగా గుజరాత్ , రాజస్థాన్‌లోనే పండిస్తున్నారు. రాజస్థాన్‌లో ఈ పంటను ఎక్కువ మంది రైతులు సాగు చేస్తారు. దేశంలోని మొత్తం ఉత్పత్తిలో ఒక్క రాజస్థానే 28 శాతం వాటాను కలిగి ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఈ పంట పెద్దగా కనిపించదు.
Black Pepper Farming : మిరియాల సాగు.. లాభాల వివరాలు ఇవే!
జీలకర్ర సాగు ఎలా..?
జీలకర్ర విత్తడానికి ముందుగా పొలాన్ని అన్ని విధాలా సిద్ధం చేసుకోవాలి. చక్కగా దున్ని.. మట్టి మెత్తగా ఉండేలా.. చేసుకోవాలి. కలుపు మొక్కలు లేకుండా జాగ్రత పడాలి. తేలికగా ఉండే భూముల్లో జీలకర్ర బాగా పండుతుంది. దిగుబడి అధికంగా ఉంటుంది. గట్టిగా ఉండే నేలల్లో జీలకర్ర సాగు చేస్తే ఆశించిన దిగుబడి రాదు. జీలకర్ర విత్తనాల్లో మూడు రకాల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. RZ 19, 209, RZ 223, GC 1-2-3 రకాలు మంచివని మార్కెట్లో పేరుంది. ఈ రకాల విత్తనాలను వేస్తే 120-125 రోజులల్లో పంట చేతికి వస్తుంది. ఒక హెక్టారుకు 510 నుంచి 530 కిలోల దిగుబడి వస్తుంది. అందువల్ల ఈ రకాల విత్తనాలతో జీలకర్ర సాగు చేస్తే మంచి ఆదాయం పొందవచ్చు.
జీలకర్ర సాగుకు హెక్టారుకు దాదాపు రూ.30 వేల నుంచి 35 వేల వరకు అవుతుంది. పంట బాగా పండితే.. ఒక హెక్టారుకు 7-8 క్వింటాళ్ల జీలకర్ర విత్తనాలు వస్తాయి. కిలో జీలకర్ర ధరరూ.100గా తీసుకుంటే.. ఖర్చులు పోను.. హెక్టారుకు రూ.40,000 నుంచి 50,000 వరకు నికర లాభం పొందవచ్చు. మీరు ఒకవేళ 5 ఎకరాల సాగులో జీలకర్రను సాగు చేస్తే రూ.2 నుంచి 2.50 లక్షల వరకు ఆదాయం వస్తుంది. 4 నెలల పంటకు రెండున్నర లక్షల ఆదాయం.. అంటే నెలకు దాదాపు రూ.60వేలు వస్తున్నట్లే..!
(Disclaimer:షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం రిస్క్‌తో కూడుకున్నది. పైన పేర్కొన్న స్టాక్‌లు బ్రోకరేజ్ హౌస్‌ల సలహాపై ఆధారపడి ఉంటాయి. మీరు వీటిలో దేనిలోనైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే, ముందుగా సర్టిఫైడ్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్‌ను సంప్రదించండి. మీకు కలిగే లాభం లేదా నష్టానికి News18 ఎలాంటి బాధ్యత వహించదు. ) (ప్రతీకాత్మక చిత్రం )
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Business, Hyderabad, Local News, Telangana