ప్రస్తుతం చాలా మంది యువత వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు. ఉద్యోగాల కోసం ప్రయత్నించిన ఫలితం లేకపోవడంతో భూమినే నమ్ముకుంటున్నారు. అంతేకాదు పెద్ద పెద్ద నగరాల్లో సాఫ్ట్‌వేర్ జాబ్ (Software Job) చేసే ఉద్యోగులు కూడా రిజైన్ చేసి.. సొంతూళ్లకు వెళ్తున్నారు. పచ్చటి పొలాల్లో వ్యవసాయం చేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు. మీరు కూడా ఇలా వ్యవసాయంచేయాలని అనుకుంటున్నారా? సంప్రదాయ పంటలు పండిస్తే లాభం తక్కువగా ఉంటుంది. వాణిజ్య పంటు పండిస్తేనే అధికా ఆదాయం వస్తుంది. మార్కెట్‌లో అధిక డిమాండ్ ఉన్న పైనాపిల్ పంటను (Pineapple Farming) సాగుచేస్తే.. లక్షల్లో ఆదాయం వస్తుంది. పలు రాష్ట్రాల్లో రైతులు ఈ పంటను పండిస్తూ.. భారీగా లాభాలు పొందుతున్నారు.
Indian Railway New Scheme: భారతీయ రైల్వే కొత్త పథకం.. ప్రయాణికులకు అద్భుత సౌకర్యాలు..
పైనాపిల్‌తో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు (Health Benefits) ఉన్నాయి. ఇది ఆకలిని పెంచుంది. ఉదర సంబంధిత సమస్యలను తొలగించడంలో ఉపయోగపడుతుంది. పలు రకాల మంధుల్లో కూడా పైనాపిల్‌ను వాడుతారు. అందుకే మార్కెట్లో పళ్లను డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఇతర పంటలతో పోలిస్తే పైనాపిల్ నుంచి అధిక ఆదాయ పొందే అవకాశముంది. పైనాపిల్ వేడి వాతావరణంలో బాగా పెరుగుతుంది. ఏడాది పొడవునా వీటిని సాగు చేయవచ్చు.
Photo : భారత మొదటి సోలార్ పవర్ కారు.. 250కి.మీ మైలేజ్... ఫీచర్స్ అదుర్స్
పైనాపిల్ మొక్క కాక్టస్ జాతికి చెందినది. ఈ పంట మెయింటెనెన్స్ కూడా చాలా సులభం. ప్రతి రోజూ పొలానికి వెళ్లి.. నీళ్లు పెట్టి.. జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం లేదు. వాతావరణం విషయంలోనూ ఆందోళన అవసరం లేదు. కేరళ వంటి అనేక రాష్ట్రాల్లో రైతులు 12 నెలల పాటు ఈ పంటను రైతులు సాగు చేస్తారు. ఇతర పంటలు, మొక్కలతో పోల్చితే పైనాపిల్‌కు తక్కువ నీరే అవసరం ఉంటుంది. విత్తినప్పటి నుంచి పండ్లు పక్వానికి వచ్చేందుకు దాదాపు 18-20 నెలల సమయం పడుతుంది. పండు బాగా పండినప్పుడు, దాని రంగు ఎరుపు-పసుపులోకి మారుతుంది. ఆ తర్వాత కోత పనులు ప్రారంభమవుతాయి.
పైనాపిల్ పళ్లను ఆయుర్వేద మందుల తయారీలోనూ ఉపయోగిస్తారు. అందుకే మార్కెట్లో వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఈ పండును మార్కెట్లో కిలో రూ.150 నుంచి 200 వరకు విక్రయిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు హెక్టారుకు 30 టన్నుల పైనాపిల్ పళ్లను ఉత్పత్తి చేయగలిగితే.. లక్షల్లో ఆదాయం వస్తుంది. పంట కాలం ఎక్కువగా ఉన్నప్పటికీ.. మార్కెట్‌లో దానికి ఉన్న రేటు వల్ల.. అధిక ఆదాయం పొందుతారు.
(Disclaimer: ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. ఈ పంట వేసేముందు, వ్యాపారం ప్రారంభించే ముందు లోతైన అధ్యయనం చేయడం, సంబంధిత మార్కెట్ నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Business, Business Ideas, Farmers, Local News