తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం జరిగింది. ఈ సమయంలో సీన్ బీఆర్ఎస్ వర్సెస్ ఎంఐఎంగా (BRS vs MIM) మారింది. అసెంబ్లీలో అన్నీ చెబుతారు కానీ..బయట నెరవేర్చరంటూ MIM ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ (Akbaruddin Owaisi) ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇక పాతబస్తీకి మెట్రో సంగతేంటి?. ఉస్మానియా ఆసుపత్రి పరిస్థితి ఏంటని అక్బరుద్దీన్ వాదించారు. ఉర్ధూ రెండో భాష అయినా అన్యాయమే జరుగుతుంది. సీఎం, మంత్రులు మమ్మల్ని కలవనివ్వడం లేదన్నారు. మీరు చెప్రాసీని చూపిస్తే వారినైనా కలుస్తాం అని MIM ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ (Akbaruddin Owaisi) చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీకి మద్దతు ఇచ్చిందని..కానీ బీజేపీ రాష్ట్రానికి ఏమి ఇచ్చిందన్నారు. నోట్ల రద్దు, జిఎస్టీకి మద్దతు ఇవ్వొద్దన్నామని, బీజేపీ మొదటి నుండి తెలంగాణకు అన్యాయమే చేస్తుందన్నారు. ఇటు బీఆర్ఎస్ పై, అటు బీజేపీపై చంద్రయాన్ గుట్ట ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ విమర్శలు గుప్పించారు.
ఏడుగురు సభ్యులున్న పార్టీకి ఎక్కువ సమయం కేటాయించడం సరికాదని మంత్రి కేటీఆర్ (minister Ktr) కల్పించుకున్నారు. గొంతు చించుకున్నంత మాత్రాన ఉపయోగం ఉండదు. అక్బరుద్దీన్ ఒవైసీ (Akbaruddin Owaisi) బిఏసి సమావేశానికి రాకుండా మాట్లాడడం సరికాదు. మంత్రులు అందుబాటులో లేరనడం కరెక్ట్ కాదని మంత్రి కేటీఆర్ (minister Ktr) తెలిపారు. ఇక మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ..మాకు కోపం రావడం లేదు. అక్బరుద్దీన్ ఒవైసీకి కోపం వస్తుంది. ఇంతకుముందు అక్బరుద్దీన్ ఒవైసీ బాగానే మాట్లాడేవారు. కానీ ఇప్పుడు అక్బరుద్దీన్ కు ఎందుకు కోపం వస్తుందో అర్ధం కావడం లేదన్నారు. గవర్నర్ ప్రసంగంపై మాట్లాడాలని అక్బరుద్దీన్ (Akbaruddin Owaisi) కు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) సూచించారు.
కాగా రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ఎంఐఎంకు మధ్య మంచి సంబంధాలున్నాయి. అయితే అసెంబ్లీలో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ గా వార్ ఉంటుందని అంతా భావించారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంపై అసెంబ్లీ వేదికగా విమర్శలు చేశారు. ఈ క్రమంలో మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి కల్పించుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వంపై అక్బరుద్దీన్ విమర్శలతో అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు హాట్ హాట్ గా సాగాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Akbaruddin owaisi, BRS, Kcr, MIM, Minister ktr, Telangana, Telangana Assembly