హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad | Rape: బాలికపై బీఆర్ఎస్‌ నేత అత్యాచారయత్నం.. తెలంగాణ రాజధానిలో దారుణం

Hyderabad | Rape: బాలికపై బీఆర్ఎస్‌ నేత అత్యాచారయత్నం.. తెలంగాణ రాజధానిలో దారుణం

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Hyderabad | rape: హైదరాబాద్‌లో మైనర్‌ బాలికపై అధికార పార్టీకి చెందిన ఓ మైనార్టీ సెల్ నాయకుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బేగంబజార్‌ డివిజన్‌లో ఈసంఘటన చోటుచేసుకుంది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

హైదరాబాద్‌(Hyderabad)లో మైనర్‌ బాలిక(Minor girl)పై అధికార పార్టీకి చెందిన ఓ మైనార్టీ సెల్ నాయకుడు(Minority cell leader) అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బేగంబజార్‌ డివిజన్‌(Begambazar Division)లో జరిగిన ఈసంఘటనతో బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీస్ కంప్లైంట్ చేశారు. విపక్ష పార్టీల నాయకులు బీఆర్ఎస్‌ నేత(BRS)పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

Telangana: పేరుకు అర్బన్‌ పార్క్‌ ..చూడటానికి అద్భుతమైన టూరిస్ట్ స్పాట్‌..ఎక్కుడుందంటే..!

మైనర్‌ బాలికపై అత్యాచారయత్నం..

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో పన్నెండేళ్ల బాలికపై అత్యాచారయత్నం చేశాడు బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఓ మైనార్టీ నేత. బేగంబజార్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఉత్తరప్రదేశ్‌ నుంచి బ్రతుకు దెరువు కోసం వచ్చిన ఓ ఫ్యామిలీ నివసిస్తోంది. పనులు చేసుకుంటూ ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది బాధిత బాలిక కుటుంబం. అదే బస్తీకి చెందిన బీఆర్ఎస్‌ మైనార్టీ సెల్ నాయకుడు ఎండీ అఖిల్ అహ్మద్ అనే 55ఏళ్ల వ్యక్తి స్థానికంగా మెడికల్ షాపు నడుపుకుంటున్నాడు. బాలిక తల్లికి ఆరోగ్యం బాగోకపోవడంతో టాబ్లెట్లు కోసం మెడికల్ షాపుకు వెళ్లింది. ఆ టైమ్‌లో 12ఏళ్ల బాలిక చేయి పట్టుకున్న మెడికల్ షాపు యజమాని అఖిల్ అహ్మద్ షాపులోకి తీసుకెళ్లాడు. అటుపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు.

నడి వయస్సు కామాంధుడు..

55సంవత్సరాల నడి వయసు కలిగిన వ్యక్తి 12ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా బయటపడింది. బాధిత బాలిక ఇంటికి వెళ్లి జరిగిన దారుణాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్రాన్స్ జెండర్లకు తెలంగాణ సర్కార్ మరో శుభవార్త..ఇక నుంచి అక్కడ ఫ్రీ ఆపరేషన్స్..పూర్తి వివరాలివే..

శిక్షించాలని డిమాండ్ ..

బ్రతుకు దెరువు కోసం వలస వచ్చిన కుటుంబంలోని మైనర్‌ బాలికను చెరబట్టాలని చూసిన మైనార్టీ సెల్ నాయకుడు అఖిల్ అహ్మద్‌ తీరుపై స్థానికులు, బీజేపీ , కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కామాంధుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. బాలిక కుటుంబానికి న్యాయం చేయలంటున్నారు.

First published:

Tags: Minor girl raped, Telangana crime news

ఉత్తమ కథలు