Bride Escape: పెళ్లయిన అర గంటకే ప్రియుడితో పారిపోయిన వధువు.. షాకింగ్ ట్విస్ట్.. అలా చెప్పి..

ప్రతీకాత్మక చిత్రం

కొన్ని ఘటన చూస్తుంటే చాలా షాకింగ్‌గా అనిపిస్తుంది. ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లోని మైలార్​దేవ్​పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పెళ్లయిన అరగంటకే నవ వధువు కనిపించకుండా పోయింది.

  • Share this:
    కొన్ని ఘటన చూస్తుంటే చాలా షాకింగ్‌గా అనిపిస్తుంది. ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లోని(Hyderabad) మైలార్​దేవ్​పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పెళ్లి జరిగిన అరగంటకే నవ వధువు (Bride) కనిపించకుండా పోయింది. అయితే పెళ్లి కోసమని వరుడే.. వధువుకు కొంత డబ్బు, బంగారం ఇచ్చాడు. అయితే పెళ్లి జరిగిన తర్వాత ఆమె ప్రియుడితో కలిసి పారిపోయింది. వివరాలు.. బెంగళూరుకు చెందిన మహ్మద్ ఇలియాస్(22)తో సమ్రిన్‌ బేగంకి(Samreen Begum) పెళ్లి నిశ్చయమైంది. శుక్రవారం రాత్రి పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. బాలాపూర్(Balapur) పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఓ ఇంట్లో ఇరు కుటుంబాల సమక్షంలో నిఖా జరిగింది. ముస్లిం సంప్రదాయం ప్రకారం వేడుకగా పెళ్లి జరిగింది. అయితే పెళ్లికి ముందుగా మాట్లాడుకున్నట్టుగానే అబ్బాయి తరఫు వాళ్లు.. రెండు లక్షల విలువైన బంగారం, 50 వేల రూపాయలు క్యాష్‌ మెహర్ (గిఫ్ట్‌)గా ఇచ్చారు.

    బ్యూటీపార్లర్‌కు వెళ్తున్నానని..
    పెళ్లి (Marriage) పూర్తికావడంతో అంతా ఆనందంలో ఉన్నారు. అయితే కాసేపటికే వధువు సమ్రిన్ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చింది. సమ్రిన్.. బ్యూటీ పార్లర్​కు వెళ్లొస్తానని బయటకు వెళ్లింది. ఈ సమయంలో బయటకు వెళ్లొద్దని పెద్దలు ఎంత చెప్పిన వినుపించుకోలేదు. దీంతో కారు ఇచ్చి ఆమెను బ్యూటీపార్లర్‌కు పంపారు. అయితే కొంత దూరం వెళ్లిన తర్వాత బ్యూటీపార్లర్ వచ్చిదంటూ కారు దిగిన సమ్రిన్.. కనిపించకుండా పోయింది. కారులో ఉన్నవాళ్లు దిగి చూస్తే ఎక్కడ ఆమె ఆచూకీ కనిపించలేదు. ఈ విషయం ఇంట్లో వాళ్లకు చెప్పగా.. వారు కూడా షాక్ తిన్నారు.

    Son Files Case: తండ్రిపై కేసు వేసిన యువకుడు.. సాయం చేయమని పోలీసుల వద్దకు.. ఇంతకీ ఆ తండ్రి ఏం కోరాడంటే..

    ఈ ఘటనతో పెళ్లి కొడుకు కుటుంబం లబోదిబో మంటుంది. సమ్రిన్ డబ్బు, నగలు పట్టుకుని... పెళ్లి కూతురు తన ప్రియునితో కలిసి పరారైందని తెలిసింది. ఇందుకు సమ్రిన్‌కు ఆమె మేనత్త, చిన్నమ్మ సహకరించినట్టుగా తెలుస్తోంది. నిఖా జరిగిన అరగంటకే పెళ్లి కూతురు ఇలా చేయటమేంటని.. బంధువులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తాను మోసపోయానని తెలుసుకున్న వరుడు తలపట్టుకున్నాడు.

    Married Woman: భర్త శారీరకంగా కలవడం లేదన్న భార్య.. సెక్స్ ఎందుకు చేయడం లేదని ప్రశ్నిస్తే..

    ప్రియుడితో జంప్..
    ఇక సమ్రిన్ ప్రియుడితో కలిసి వెళ్లిపోయిందని(Escape With Lover) తెలుసుకున్న వెంటనే వరుడు తరఫు కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. సమ్రిన్ ఎటు వెళ్లింది..?, ఆమె ప్రియుడు ఎవరు..? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక, సమ్రిన్ తనకు భార్యగా వద్దని చెప్పిన ఇలియాస్.. తన వద్ద నుంచి తీసకున్న నగలు, బంగారం ఇచ్చేయాలని ఆమె కుటుంబ సభ్యులను హెచ్చరించాడు. ఇందుకు సమ్రిన్ కుటుంబ సభ్యులు తమకు కొద్దిగా గడువు కావాలని కోరారు.
    Published by:Sumanth Kanukula
    First published: