హోమ్ /వార్తలు /తెలంగాణ /

Chilukur:ఈనెల 12నుంచి బ్రహ్మోత్సవాలు..సంతాన ప్రాప్తి కోసం గరుడ ప్రసాదం పంపిణి

Chilukur:ఈనెల 12నుంచి బ్రహ్మోత్సవాలు..సంతాన ప్రాప్తి కోసం గరుడ ప్రసాదం పంపిణి

Chilukur Balaji:చిలుకూరు బాలాజీ టెంపుల్‌లో ఈసారి బ్రహ్మోత్సవాలను వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 12వ తేదిన ద్వజారోహణం తర్వాత సంతానప్రాప్తి కోరుకునే మహిళలకు గరుడ ప్రసాదం స్వీకరించాలని పూజారులు చెబుతున్నారు

ఇంకా చదవండి ...

చిలుకూరు (Chilukur) బాలాజీ టెంపుల్‌లో ఈనెల 12వ తేది నుంచి చిలుకూరు బ్రహ్మోత్సవాలు(Brahmotsavam)ప్రారంభం కానున్నాయి. ఈనేపధ్యంలో ఆలయ అర్చకులు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లును చేస్తున్నారు. శ్రీరామనవమి (Sri Ramanavami) ముగిసిన తర్వాత రెండో రోజున అంటే చైత్రమాసం శుక్లపక్షం ఏకాదశి నాడు ఆలయంలో ఉన్న ధ్వజస్తంభంపై గరుడ పటాన్ని ఎక్కించిన తర్వాత ధ్వజస్తంభం కింద ఉన్న గరుత్మంతుని విగ్రహానికి అభిషేకం చేస్తారు అర్చకులు. గరుత్మంతుని ఆరాధన, అలంకారం తర్వాత ద్వజారోహణం సమయంలో నాలుగు దిక్కుల ఉన్న గరుత్మంతుల వారికి పొంగలి నైవేద్యంగా సమర్పంచుకుంటారు. దీన్ని గరుడపిండం అని లేదంటే గరుత్మంతుని నైవేద్యంగా పిలుస్తారు. అయితే ఈ గరుత్మంతుని నైవేద్యాన్ని సంతానం కావాలని కోరుకునే మహిళలు తీసుకుంటే సంతానవతి అవుతుందని ఆగమ శ్లోకంలో ఉంది. ఉండటమే కాదు చిలుకూరు బాలాజీ ఆలయంలో గత కొన్నేళ్లుగా ఈ క్రతువు నిర్వహిస్తున్న సమయంలో గురుత్మంతుని నైవేద్యాన్ని స్వీకరించిన మహిళలు గర్భం దాల్చినట్లుగా స్వయంగా వాళ్లే వచ్చి ఈ ఆలయ అర్చకులతో చెప్పుకున్న సందర్భాలు ఉన్నాయి.

సంతాన ప్రాప్తిరస్తు..

మొదట్లో ఈ వాస్తవాన్ని కొందరు కొట్టిపారేసినప్పటికి ప్రసాదం తీసుకున్న స్త్రీలలో చాలా మంది గర్భవతులు కావడం వల్ల ఏటా ఈ ప్రసాదం తీసుకునేందుకు వచ్చే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోందని ఆలయ అర్చకులు చెబుతున్నారు. ఈసారి కూడా ఈనెల 12వతేదిన ధ్వజారోహణము జరుగుతుంది. అదే రోజు భక్తులందరికీ గరుడ ప్రసాదం ఇవ్వబడుతుంది. భక్తులందరూ ఆ రోజు ఉదయం 8.30 గం.లకు వచ్చి పూజానంతరం ఇవ్వబడే గరుడ ప్రసాదాన్ని స్వీకరించవలసినదిగా ఆలయ ప్రధాన అర్చకులు చెబుతున్నారు. ప్రసాదం కోసం వచ్చే స్త్రీలు ఉదయం 8.30గంటలలోపు ఆలయంలో ఉండాలని సూచిస్తున్నారు. గరుడ ప్రసాదం ప్రాశస్యం గురించి కొన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్న వాస్తవాల్ని అర్చకులు భక్తులకు వివరిస్తున్నారు. మూడేళ్ల క్రితం ఓ మహిళ గర్భసంచి సమస్య వల్ల ఆరేళ్లుగా సంతానం కలగకపోవడంతో గరుడ ప్రసాదాన్ని స్వీకరించింది. అటుపై పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డను తీసుకొని తిరిగి స్వామివారి ఆలయానికి చేరుకొని భక్తులందరికి పండ్లు పంచిపెట్టిన విషయాన్ని అర్చకులు గుర్తు చేస్తున్నారు. అంతే కాదు విజ్ఞాన శాస్త్రానికి అతీతంగా ఒక శక్తి ఉందని... ఆ శక్తి మహిమలు కేవలం అనుభవించిన వారికే తెలుస్తాయంటున్నారు పూజారురు. అయితే వాటిని రుజువు చేయమని కోరే వైద్యలు కోసమే తన ఈ ప్రయత్నం అంటూ తెలియజేశారు ఆలయ అర్చకులు.

గరుడ ప్రసాదం విశిష్టత..

అయితే గత రెండేళ్ల నుంచి కరోనా కారణంగా ఆలయంలో బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తూ వస్తున్నారు. అందువల్ల గరుడ ప్రసాదం తీసుకునే భాగ్యం చాలా మంది స్త్రీలకు దక్కలేదు. ప్రస్తుతం శుభకృత్ నామ సంవత్సరం కావడం వల్ల స్వామివారి బ్రహ్మోత్సవాలను వైభవోపేతంగా జరపాలని ఆలయ అర్చకులు నిర్ణయించారు. అందులో భాగంగానే భక్తులు అందర్ని ఆహ్వానిస్తున్నారు. భగవంతుడ్ని భక్తితో కొలిస్తే ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలే కాదు సంతాన ప్రాప్తి ప్రసాదిస్తారని పండితులు చెబుతున్నారు.

First published:

Tags: Chilkoor Balaji Temple

ఉత్తమ కథలు