Hyderabad: హైదరాబాద్ లో అర్ధరాత్రి షాకింగ్ ఘటన.. ప్రేమించిన అమ్మాయికి నిశ్చితార్థం జరిగిందని తెలిసి ఓ ప్రియుడు చేసిన నిర్వాకమిది..!

బాాధితుడు నదీమ్ (ఫైల్ ఫొటో), సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యం

తన ప్రేయసికి ఓ వ్యక్తితో నిశ్చితార్థం జరిగిందని ఆ ప్రియుడికి తెలిసింది. అంతే అతడు తట్టుకోలేకపోయాడు. ఓ దారుణ నిర్ణయం తీసుకున్నాడు. నిశ్చితార్థం చేసుకున్న వ్యక్తి ఎక్కడ ఉంటాడో తెలుసుకుని మరీ..

 • Share this:
  ప్రేమించిన యువతికి మరో వ్యక్తితో పెళ్లి నిశ్చయం అయిందనుకోండి. మహా అయితే ఏం చేస్తారు. ప్రేయసి వద్దకు వెళ్లి ‘ఏ గుడిలో అయినా పెళ్లి చేసుకుందాం. నాతో వచ్చెయ్‘ అని అడుగుతారు. దానికి ప్రేయసి కూడా నో చెబితే ఓ విఫల ప్రేమికుడిగా విరహగీతాలు పాడుకుంటుంటారు. ప్రేయసి చేతిలో మోసపోయానని కొందరు, ప్రేయసి కోసం ప్రేమను త్యాగం చేశానని మరికొందరు విరక్తితో మద్యానికి అలవాటవుతుంటారు. కానీ హైదరాబాద్ లో మాత్రం సీన్ రివర్స్ అయింది. తన ప్రేయసితో ఓ వ్యక్తికి నిశ్చితార్థం జరిగిందని ఆ ప్రేమికుడికి తెలిసింది. అంతే అతడు అందరిలా సైలెంట్ అయిపోలేదు. ఓ వింత నిర్వాకానికి పాల్పడ్డాడు. ఏకంగా నిశ్చితార్థం చేసుకున్న వ్యక్తిని కిడ్నాప్ చేశాడు. హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  హైదరాబాద్ లోని పాతబస్తీలో ఉండే అల్తాప్ అనే 25 ఏళ్ల యువకుడు బహదూర్ పురాలో ఉండే ఓ యువతిని చాలా కాలం నుంచి ప్రేమిస్తున్నాడు. అయితే ఇటీవల రాజేంద్రనగర్ సర్కిల్ శాస్త్రిపురం డివిజన్ కింగ్స్ కాలనీలో ఉండే నదీమ్ ఖాన్ అనే 25 ఏళ్ల కుర్రాడితో ఆ యువతికి పెళ్లి నిశ్చయం అయింది. నిశ్చితార్థం కూడా పూర్తయింది. ఈ విషయం కాస్తా అల్తాఫ్ కు తెలిసింది. తాను ప్రేమిస్తున్న యువతితో నిశ్చితార్థం చేసుకన్న నదీమ్ ఖాన్ పై కోపం పెంచుకున్నాడు. తాను ఉండే ప్రాంతంలోనే అమీనా క్లినిక్ లో నదీమ్ ఖాన్ పనిచేస్తుంటాడు. శుక్రవారం అర్ధరాత్రి 12.30గంటలకు క్లినిక్ ను మూసేసే సమయంలో నదీమ్ కు ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. చికిత్స కోసం వస్తున్నామనీ, కొద్ది సేపు ఆగాలని కోరారు.
  ఇది కూడా చదవండి: భర్త దారుణ హత్య.. పర్సు తీసుకొస్తానని పోలీసులకు చెప్పి ఇంట్లోకి వెళ్లిన భార్య.. ఎంతకూ తిరిగి రాకపోవడంతో వెళ్లి చూస్తే..

  దీంతో నదీం ఆ క్లినిక్ కు తాళాలు వేసి తన బైక్ పై కూర్చున్నాడు. నదీం ఎదురుగానే ఓ నెంబర్ ప్లేట్ లేని కారు వచ్చి ఆగింది. మాస్కు ధరించినర ఇద్దరు యువకులు నదీం వద్దకు వచ్చారు. అతడి బైక్ తాళం తీసేశారు. ‘ఒకళ్లు ప్రేమిస్తున్న యువతిని నువ్వు పెళ్లి చేసుకుంటావా? మాతో రా.. నీ పెళ్లి మేం చేస్తాం. నడవరా‘ అంటూ దుర్భాషలాడారు. అతడిని కారులో బంధించి తీసుకెళ్లిపోయారు. దూరం నుంచి వీరి వ్యవహారం చూస్తున్న స్థానికులకు అనుమానం వచ్చేలోపే అక్కడి నుంచి నదీంతో సహా ఎస్కేప్ అయిపోయారు. ఇది కాస్తా అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డయింది.  నదీం కుటుంబ సభ్యులు మైలాన్ దేవుపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నదీం మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా శనివారం మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో నదీంను రక్షించారు. కిడ్నాపర్లను అరెస్ట్ చేశారు. అయితే కిడ్నాప్ వ్యవహారంలో అల్తాప్ స్వయంగా పాల్గొన్నాడనీ, కారులో కొద్ది దూరం వచ్చిన తర్వాత దిగి తిరిగి ఇంటికి వెళ్లిపోయాడని తెలిసింది. దీంతో అతడిని కూడా అరెస్ట్ చేశారు. నదీమ్ ను బీదర్ కు తీసుకెళ్లి అక్కడే బంధించి ఉంచాలనుకున్నారని పోలీసుల విచారణలో తెలిసింది.
  ఇది కూడా చదవండి: ప్రియుడితో తల్లి ఎస్కేప్.. తండ్రి బాధను చూడలేక.. పదేళ్ల తర్వాత కన్న కొడుకే పనోడిలా చేరి ఇలా పగతీర్చుకున్నాడు..!
  Published by:Hasaan Kandula
  First published: