స్పోర్ట్స్ స్టార్లు, వరల్డ్ చాంపియన్స్ సినిమాల్లో, సినిమా స్టార్లతో కలిసి రీల్ వీడియో(Reel video)లు చేయడం వాటిని సోషల్ మీడియా(Social media)గ్రూప్‌లలో షేర్ చేయడం ఈమధ్య కాలంలో బాగా ట్రెండ్ అవుతోంది. తెలంగాణకు చెందిన వరల్డ్ ఫీమేల్ బాక్సర్ నిఖత్ జరీన్(Nikhat Zareen)కూడా ఇదే విధంగా తన అభిమాన నటుడు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్(Salman Khan)తో కలిసి ఓ సాంగ్‌కి డ్యాన్స్ చేసింది. ఆ వీడియోని రీల్లో ఇన్స్టాగ్రామ్(Instagram)లో పోస్ట్ చేసి తన చిరకాల కోరిక నెరవేరిందంటూ సంతోషం వ్యక్తం చేసింది. బాలీవుడ్ సూపర్ స్టార్ రేంజ్ హీరో ..వరల్డ్ బాక్సర్ పక్కన డ్యాన్స్ చేస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది.
కండలవీరుడితో లేడీ బాక్సర్..
బర్మింగ్ హామ్ కామన్వెల్త్ 2022 క్రీడా పోటీల్లో, ఉమెన్స్ బాక్సింగ్ ఫైనల్లో గోల్డ్ మెడల్ సాధించిన నిఖత్ జరీన్ చాలా రోజుల తర్వాత వార్తల్లోకి వచ్చింది. ఈ లేడీ బాక్సర్ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్‌కి వీరాభిమాని. అందుకే అతనితో కలిసి నటించాలని, లేదంటే డ్యాన్స్ చేయాలనే కోరిక ఎప్పటి నుంచో ఉందట. అందుకే రీసెంట్గా సల్మాన్‌ఖాన్‌తో లవ్ సినిమాలోని సాథియా తూనే క్యా కియా అనే సాంగ్‌కి నిఖత్ జరీన్ డ్యాన్స్ చేసింది. ఇద్దరూ కలిసి చేసిన రీల్ వీడియోని నిఖత్ తన ఇన్‌స్టా హ్యాండిల్లో షేర్ చేయడంతో వార్తతో పాటు వీడియో వైరల్ అవుతోంది.
View this post on Instagram
హిట్ సాంగ్‌కి స్టెప్పులు..
1991లో సల్మాన్‌ఖాన్ నటించిన లవ్ సినిమా హిందీలో సూపర్ హిట్టైంది. ఈ సినిమా తెలుగులో ప్రేమ పేరుతో అంతే సక్సెస్ సాధించింది. డీసెంట్ లవ్ స్టోరీలోని హిట్ సాంగ్‌కి సల్మాన్‌తో కలిసి నిఖత్ డ్యాన్స్ చేయడమే కాకుండా వీడియో కింద తన కల నెరవేరిందంటూ(చివరగా ఇంతేజార్ ఖతం హువా) అని క్యాప్షన్ పెట్టింది. అయితే ఈదే తరహాలో గతంలో పీవీ సింధు, గుత్తా జ్వాలా కూడా సినిమా వాళ్లతో వీడియోలు తీసుకొని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఇప్పుడు నిఖత్ జరీన్ కూడా అదే రూట్లో వెళ్తోంది. మరి సినిమాల్లో కూడా యాక్ట్ చేయాలని ఉందేమోనని అభిమానులు చెవులు కొరుక్కుంటున్నారు.
నాటి సూపర్ హిట్ మూవీ ..
సల్మాన్, రేవతి జంటగా సురేష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'లవ్'. తెలుగులో వచ్చిన 'ప్రేమ' చిత్రానికి ఇది రీమేక్. మేకర్స్ అసలు చిత్రం నుండి విషాదకరమైన క్లైమాక్స్‌ను సుఖాంతంతో మార్చారు. ఈ సినిమా 'సాథియా తూనే క్యా కియా' అనే రొమాంటిక్ సాంగ్ కూడా గుర్తుండిపోతుంది. కొత్త నటితో బాక్సాఫీస్ వద్ద సల్మాన్‌కి ఇది వరుసగా ఏడవ విజయవంతమైన చిత్రం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood actor, Nikhat Zareen, Salman khan, Telangana