Bjp letter : కరోనా దృష్ట్యా మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేయాలి..గవర్నర్‌కు మెయిల్ చేసిన బీజేపీ

కేసీఆర్, లక్ష్మణ్

Bjp letter to governor : ఓ వైపు తెలంగాణలో కరోనా విజృంభిస్తున్నా..మరోవైపు రాష్ట్ర్రంలోని మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడం పై బీజేపీ నేత లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. వెంటనే ఎకలను నిలిపివేసి..హెల్త్ ఎమర్జెన్సి ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.

  • Share this:


ఓ వైపు తెలంగాణలో కరోనా విజృంభిస్తున్నా..మరోవైపు రాష్ట్ర్రంలోని మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడం పై బీజేపీ నేత లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. వెంటనే ఎకలను నిలిపివేసి..హెల్త్ ఎమర్జెన్సి ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.

తెలంగాణలో కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేయాలని గవర్నర్‌ తమిళ సైకి బీజేపీ నేత లక్ష్మణ్‌ ఈ మెయిల్ ద్వార విజ్ఝప్తి చేశారు.. ప్రభుత్వానికి ఎన్నికలపై ఉన్న శ్రద్ద.. ప్రజల ప్రాణాలపై లేదన్నారు. ఈ నేపథ్యంలోనే మున్సిపల్ ఎన్నికలను వెంటనే వాయిదా వేయాలని లక్ష్మణ్‌ డిమాండ్ చేశారు. కరోనా విపరీతంగా విజృంభిస్తున్నా... ప్రభుత్వం మాత్రం ఎన్నికలను వాయిదా వేయాల్సిన అవసరం లేదనటం బాధ్యతారాహిత్యమని విమర్శించారు..

దీంతో పాటు తెలంగాణలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ నామమాత్ర మంత్రిగా మారాడని ఈ సంధర్భంగా విమర్శించారు. కరోనా కట్టడికి యుద్ధప్రాతిపదికన చేపట్టాల్సిన చర్యలపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. కరోనా కట్టడికి రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేస్తామన్న సీఎం మాటలు బూటకమని దుయ్యబట్టారు. ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్‌మెంట్‌ చేయడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందన్నారు. కరోనా చికిత్సను వెంటనే ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.
Published by:yveerash yveerash
First published: