దస్తగిరి, న్యూస్ 18, ఓల్డ్ సిటీ
ఈ రోజు శ్రీరామనవమి సందర్భంగా శోభాయాత్ర నిర్వహించనున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ శోభాయాత్రపై హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజాసింగ్ ఓ వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే . దీనిలో ఆయన.. దేశం నలుమూలల నుంచి ఈ శోభాయాత్ర చూడడానికి రామభక్తులు అందరూ పెద్ద సంఖ్యలో నగరానికి వస్తారన్నారు. ప్రతీ ఒక్కరూ హాజరై ఈ శోభాయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ధూల్ పేటలోని ఆకాష్ పూరి హనుమాన్ ఆలయం నుండి ఈ రాముడి శోభాయాత్ర ప్రారంభమవుతుందని గుర్తు చేశారు.
కాగా, రెండు రోజుల క్రితం సీతరాంబాగ్ లోని ద్రౌపతి గార్డెన్ లో సీతారామ శోభయాత్ర సమన్వయ కమిటీ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో మాట్లాడిన నగర సిపి సివి ఆనంద్ మాట్లాడుతూ.. శ్రీరామనవమి శోభాయాత్రకు పోలీస్ శాఖ భారీ ఏర్పాట్లు చేపడుతోందని పేర్కొన్నారు. సీతారాం బాగ్ నుంచి ప్రారంభమయ్యే శోభాయాత్ర హనుమాన్ టేక్డీలో ముగిసేవరకు వందలాదిమంది పోలీసులతో భారీ బందోబస్తును చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నా రు. అన్ని ప్రధాన కూడళ్లు, కీలక ప్రాంతాల్లో, సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాల ద్వారా బందోబస్తును పర్యవేక్షిస్తామన్నారు.
శోభాయాత్రలో డీజే సౌండ్ సిస్టమ్‌లకు ఎలాంటి అనుమతి లేదన్నారు. నిర్వాహకులు నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలన్నారు. శోభాయాత్రలో విగ్రహాల ప్రతిమల సైజు 20 అడుగుల కంటే ఎక్కువగా పెంచరాదని సూచించారు. ముందు జాగ్రత్త చర్యగా 6 ఫైర్ ఇంజన్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. డీఆర్‌ఎఫ్ టీమ్స్ ను కూడా సిద్ధంగా ఉంచుతామన్నారు.
పోలీసుల రూట్ మార్చ్..
ఈ రోజు శోభాయాత్ర జరిగే మంగళ్‌హాట్, జుమ్మేరాత్‌బజార్, సిద్దిఅం బర్‌బజార్, అఫ్జల్‌గం జ్, గౌలిగూడ మీదుగా హనుమాన్ టేక్డీలోని హనుమాన్ వ్యాయామశాల వరకు సీపీ ఆనంద్, ట్రాఫిక్ విభాగం కమిషనర్ సుధీర్‌బాబు, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్‌లు రూట్‌మార్చ్ నిర్వహించారు. అనంతరం హనుమాన్‌టేక్డీలోని హనుమాన్ వ్యాయామశాల గ్రౌండ్స్ ను పర్యవేక్షించారు.
శోభాయాత్రకు వెయ్యి మంది లా ఆండ్ ఆర్డర్, 400 మంది ట్రాఫిక్ పోలీసులతో భారీ బందోబస్తు నిర్వ హించనున్నట్లు సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగ్య నగర్ శ్రీరామనవమి ఉత్సవ కమిటీ ప్రతినిధులు డాక్టర్ భగవంతరావు, గోవింద్‌రాఠీ, కార్పొరేటర్ శంకర్ యాదవ్, సురేఖ, మాజీ కార్పొరేటర్ మెట్టు వైకుంఠం, నాయకులు బంగారు సుధీర్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Local News, Raja Singh, Srirama navami, Telangana