బుల్లెట్ ప్రూఫ్ వెహికిల్ కేటాయింపు విషయంలో ప్రభుత్వ వైఖరిపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్ అయ్యారు. నాకు ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కారాబ్ అయితే రెండు రోజుల క్రితం పురానాపూల్ చౌరస్తాలో వదిలిపెట్టి వచ్చినని ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. పదే పదే రిపేర్కు వస్తున్నా అదే వాహనాన్ని బాగు చేయించి పంపుతున్నారే తప్ప కొత్త వెహికిల్ ఇవ్వడంలేదని విమర్శించారు. తనకు పాడైపోయిన కారు ఇచ్చారని అయన మండిపడ్డారు. రాజా సింగ్ మాట్లాడుతూ ఆ బులెట్ ప్రూఫ్ వెహికిల్ ను మళ్ళీ రిపేర్ చేయించి తన దగ్గరకు తీసుకువచ్చారు.
ఇప్పటికే ఇట్లా చాలాసార్లు ప్రభుత్వం కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ రిపేరుకు వస్తుంది. ఎక్కడ ఆగిపోతుందో నాకే తెలుస్తలేదు. గతంలో కూడా చాలా సార్లు చెప్పిన ఎక్కడ పడితే అక్కడే ఆగుతుందని. అఖయినా ఖరాబైన వెహికల్ ని మళ్లీ మళ్లీ నాకే ఎందుకు పంపిస్తున్నరనీ పోలీస్ ఉన్నతాధికారులను అడిగాను. అధికారుల పేర్లు చెప్పను కానీ…. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదే వెహికల్ ను ఎమ్మెల్యే రాజా సింగ్ కు పంపమని చెప్పారట అని అన్నారు.
తనకు ఈ పాత బుల్లెట్ ప్రూఫ్ వాహనం వద్దని అధికారులకు గతంలోనే లేఖ రాశానని, కానీ వారు పాత వాహనానికి మరమ్మతులు చేసి తిరిగి తన వద్దకు పంపించారని రాజాసింగ్ వెల్లడించారు. గతంలోనూ ఇలా చాలాసార్లు జరగిందని, ఎక్కడ ఆగిపోతుందో తెలియని ఆ బుల్లెట్ ప్రూఫ్ వెహికిల్ ను మార్చాలని ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని అన్నారు. ఖరాబైన వెహికిల్ను రిపేర్ చేసి ఎందుకు పంపుతున్నారని పోలీసు ఉన్నతాధికారులను ప్రశ్నిస్తే సీఎం కేసీఆర్ తనకు అదే వాహనాన్ని కేటాయించాలని ఆదేశించిన విషయం చెప్పారని అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Raja Singh