హోమ్ /వార్తలు /తెలంగాణ /

Raja singh: BJP ఎమ్మెల్యే రాజాసింగ్​ చుట్టు ఉచ్చు బిగిస్తున్న తెలంగాణ ప్రభుత్వం!

Raja singh: BJP ఎమ్మెల్యే రాజాసింగ్​ చుట్టు ఉచ్చు బిగిస్తున్న తెలంగాణ ప్రభుత్వం!

రాజాసింగ్ (ఫైల్​)

రాజాసింగ్ (ఫైల్​)

గోషామహల్​ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్​పై ఉచ్చు బిగిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. రాజాసింగ్‌.. మహమ్మద్‌ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మజ్లీస్‌ నేతల ఫిర్యాదు మేరకు కేసులు నమోదయ్యాయి.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  గోషామహల్​ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్​పై (BJP MLA Raja singh) ఉచ్చు బిగిస్తోంది తెలంగాణ ప్రభుత్వం (Telangana government). రాజాసింగ్‌.. మహమ్మద్‌ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మజ్లీస్‌ నేతల ఫిర్యాదు మేరకు కేసులు నమోదయ్యాయి. దీంతో, పోలీసులు రాజాసింగ్‌ను అరెస్ట్‌ (Raja singh arrest) చేశారు. అనంతరం, కోర్టు రాజాసింగ్‌కు బెయిల్‌ మంజూరు చేయడంతో ఆయన బయటకు వచ్చారు. కాగా, ఎమ్మెల్యే వ్యాఖ్యలు హైదరాబాద్ (Hyderabad)​లో మత కల్లోలాలు సృష్టించేలా ఉన్నాయని ఆరోపణలతో ఆయనపై గతంలో చాలా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ కేసులు అన్నీ ఇపుడు బయటికి వస్తున్నాయి.


  పాత కేసులకు (Old cases) సంబంధించి రెండు కేసుల్లో 41(A) సీఆర్పీసీ నోటీసులు అందజేశారు. ఫిబ్రవరి, ఏప్రిల్‌ నెలకు సంబంధించి రాజాసింగ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు మంగళ్‌హట్‌, షాహినాయత్‌గంజ్‌ పోలీసులు రెండు నోటీసులు ఇచ్చారు. మంగళ్‌హట్‌ పీఎస్‌లో 68/2022 క్రైమ్‌ నంబర్‌ కేసులో, షాహినాయత్‌గంజ్‌ పీఎస్‌లో క్రైమ్‌ 71/2022లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.  ఫిబ్రవరి 19న మంగళ్​హాట్ పీఎస్​లో..


  ఈ ఏడాది ఫిబ్రవరి 19న మంగళ్​హాట్ పీఎస్​లో రాజాసింగ్​పై కేసు నమోదైంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల సందర్భంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని... కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు మంగళ్​హాట్ పీఎస్​లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రాజాసింగ్​పై పోలీసులు కేసు నమోదు చేశారు.


  షాహినాయత్ గంజ్ పీఎస్​లోనూ ఏప్రిల్ 12న మరో కేసు నమోదైంది. శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా బేగంబజార్ ఛత్రి ప్రాంతంలో రెచ్చగొట్టే విధంగా పాట పాడారని, ఎస్సై రాజేశ్వర రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు షాహినాయత్ గంజ్ పీఎస్​లో పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది.


  Hyderabad: కోర్టుకెక్కిన ఎమ్మెల్సీ కవిత, ఎంపీ బండి సంజయ్​.. వివరాలివే


  ఈ సందర్భంగా పోలీసుల నోటీసులపై రాజాసింగ్‌ స్పందించారు. ఇక, రాజాసింగ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నన్ను మళ్లీ అరెస్ట్‌ చేయడానికి పోలీసులు కుట్ర చేస్తున్నారు. పాత కేసులకు సంబంధించి 41(A) సీఆర్పీసీ నోటీసులు ఇచ్చారు. ఏప్రిల్‌ ఘటనకు సంబంధించి ఇప్పుడు నోటీసులు ఇవ్వడమేంటి’’ అని ప్రశ్నించారు.


  హైకోర్టుకు పోలీసులు..


  ఎమ్మెల్యే రాజాసింగ్ విషయంలో నాంపల్లి కోర్టు ఆదేశాల పై హైకోర్టును ఆశ్రయించారు పోలీసులు. నాంపల్లి కోర్టు ఆదేశాలను కొట్టివేయాలని హైకోర్టును కోరారు పోలీసులు.ఈ నెల 23న ఉదయం మంగళ్‌హట్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అదే రోజు సాయంత్రం నాంపల్లి కోర్టులో ఆయనను పోలీసులు హజరు పర్చారు. ఈ విషయమై కోర్టులో ఇరు వర్గాల వాదలను విన్న తర్వాత కోర్టు రాజాసింగ్ కు బెయిల్ మంజూరు చేసింది. 41 సీఆర్‌పీసీ కింద ఎలాంటి నోటీసులు జారీ చేయని విషయాన్ని రాజాసింగ్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. ఇరు వర్గాల వాదనలను విన్న కోర్టు రాజాసింగ్ కు బెయిల్ ను మంజూరు చేసింది. నాంపల్లి కోర్టు రాజాసింగ్ కు బెయిల్ ను మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ఇవాళ పోలీసులు హైకోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. నాంపల్లి కోర్టు ఇచ్చిన ఆదేశాలను పోలీసులు హైకోర్టును కోరారు.


  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Hyderabad police, Raja Singh, Telangana Government

  ఉత్తమ కథలు