Home /News /telangana /

HYDERABAD BJP GOUD CASTE GROUPS ARE DEMANDING THE GOVERNMENT TO CHANGE THE NAME OF JANGAON DISTRICT TO SARDHAR SARVAI PAPANA SNR

Telangana : తెరపైకి జిల్లా పేరు మార్పు అంశం .. సర్దార్ సర్వాయి పాపన్నపేరుతో మార్చాలని బీజేపీ డిమాండ్

Sardhar Sarvai Papana

Sardhar Sarvai Papana

Telangana : తెలంగాణలో కొత్త అంశం తెరపైకి వచ్చింది. పోరాటయోధుడు, విప్లవనాయకుడు సర్వాయి పాపన్నగౌడ్‌కు రాష్ట్ర ప్రభుత్వం సముచిత గౌరవం ఇవ్వడం లేదని బీజేపీ ఆరోపిస్తోంది. పాపన్న జయంతి సందర్భంగా జనగామ జిల్లా పేరును పాపన్న పేరు పెట్టాలనే డిమాండ్‌ చేస్తున్నారు బీజేపీ నేతలు, గౌడ కుల సంఘాలు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
తెలంగాణ(Telangana)లో కొత్త అంశం తెరపైకి వచ్చింది. పోరాటయోధుడు, విప్లవనాయకుడు సర్వాయి పాపన్న(Sardhar Sarvai Papana)కు రాష్ట్ర ప్రభుత్వం సముచిత గౌరవం ఇవ్వడం లేదని బీజేపీ ఆరోపిస్తోంది. పాపన్న 372జయంతి సందర్భంగా ఆయన పుట్టిన జిల్లా జనగామ(Jangaon)కు ఆయన పేరు పెట్టాలని తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీ(BJP MP)డాక్టర్ కే.లక్ష్మణ్(Dr. K. Laxman)డిమాండ్ చేశారు. బీజేపీ ప్రస్తావనకు తెచ్చిన జిల్లా పేరు మార్పు అంశాన్ని ఐదు రోజుల క్రితమే గౌడ జన హక్కుల సంఘం నేతలు సైతం డిమాండ్ చేశారు. పాపన్న చూపించిన ఆత్మగౌరవ పోరాటస్ఫూర్తిని కొనసాగిద్దామన్న సీఎం కేసీఆర్(KCR)జనగామ జిల్లా పేరు మార్పును స్వాగతిస్తారా లేక వ్యతిరేకిస్తారా అనే చర్చ మొదలైంది.

Bathukamma sarees : ఉచితంగా పంపిణికి సిద్ధంగా ఉన్న కోటి 10లక్షల బతుకమ్మ చీరలు .. ఎప్పటి నుంచి ఇస్తారంటే



తెరపైకి కొత్త అంశం ..
తెలంగాణలో బీజేపీ నేతలు కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చారు. పోరాటయోధుడు, విప్లవనాయకుడు సర్ధార్ సర్వాయి పాపన్నకు రాష్ట్ర ప్రభుత్వం తగిన గౌరవం ఇవ్వడం లేదని బీజేపీ రాజ్యసభసభ్యుడు, బీజేపీ పార్లమెంటరీ బోర్డు, కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడు డాక్టర్ కే. లక్ష్మణ్‌ ఆరోపించారు. పాపన్న 372వ జయంతి వేడుకల్లో పాల్గొన్న లక్ష్మణ్ అణచివేత, వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన పాపన్నగౌడ్ పేరును ఆయన పుట్టిన జిల్లా జనగామకు పెట్టాలని జిల్లా పేరును మార్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నందనం కృపాకర్‌ రచించిన మరోచత్రపతి-మన తెలంగాణ దళపతి పుస్తకాన్ని ఆవిష్కరణ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ కే. లక్ష్మణ్. అంతే కాదు హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.


జిల్లా పేరును మార్చాల్సిందే ..
ఓబీసీ మోర్చా అధ్యక్షుడి పదవిలో ఉంటూ రాజ్యసభకు ఎన్నికైన కే,. లక్ష్మణ్‌కు పార్టీ అధిష్టానం ఇటీవలే మరో పెద్ద పదవిని కట్టబెట్టింది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు మెంబర్‌తో పాటు, కేంద్ర ఎన్నికల కమిటీలో సభ్యుడిగా అవకాశం కల్పించింది. దీంతో ఆయన దూకుడు పెంచారు. మునుగోడు బై పోల్‌లో గెలిచేది బీజేపీనే అన్నారు.కేస్ఆర్ అవినీతి పాలనకు ఉపఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని తెలిపారు. సర్వాయి పాపన్న స్పూర్తిగా తీసుకొని టీఆర్ఎస్‌ ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాలని పిలుపునిచ్చారు బీజేపీ ఎంపీ.

కులసంఘాల డిమాండ్‌ కూడా అదే..
ఇదే అంశాన్ని ఐదు రోజుల క్రితం జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలో గౌజ జన హక్కుల పోరాట సమితి నేతలు సైతం డిమాండ్ చేశారు. పోరాటయోధుడు సర్దార్ సర్వాయి పాపన్నపేరును జిల్లాకు పెట్టి ఆయన కట్టిన కోటలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గౌడకుల సంఘాల నేతలు. పాపన్న విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలని కోరారు. పాపన్న జయంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న సందర్భంగా కార్మికులందరికి సొసైటీలో గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు.పెండింగ్‌ ఎక్స్‌గ్రేషియాను విడుదల చేయాలన్నారు. గీత కార్మికులకు ద్విచక్రవాహనాలు ఇవ్వాలని ఫించన్‌ను కూడా ఐదు వేలకు పెంచాలని కోరారు. పించన్‌ను ఐదు వేలకు పెంచాలని కోరారు.

 TSRTC: టీఎస్​ఆర్టీసీ గుడ్​న్యూస్​.. రైతులకు నేరుగా ఎరువుల సరఫరా.. వివరాలివే



పేరు మార్చేనా ..
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తెలంగాణ వీరత్వానికి, పరాక్రమానికి ప్రతీక అని కొనియాడిన సీఎం కేసీఆర్‌ ఆయన పేరును జిల్లాకు ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌పై ఎలా స్పందిస్తుందో చూడాలి. బడుగు బలహీన వర్గాల నాయకత్వాన్ని సముచితంగా గౌరవించుకుంటున్నదని తెలంగాణ సీఎం..జనగామ జిల్లాకు సర్ధార్ సర్వాయి పాపన్న పేరును పెడతార లేదా అనే సందేహాలు రాజకీయంగా కొత్త్ చర్చకు దాకి తీశాయి.
Published by:Siva Nanduri
First published:

Tags: Bjp, Telangana News

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు