హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad Dugs case: ‘‘ఉడ్తా హైదరాబాద్​ చేశారుగా.. టాలీవుడ్​ డ్రగ్స్​ కేసు ఏమైంది?’’: టీఆర్​ఎస్​ ప్రభుత్వంపై బండి సంజయ్​ ధ్వజం

Hyderabad Dugs case: ‘‘ఉడ్తా హైదరాబాద్​ చేశారుగా.. టాలీవుడ్​ డ్రగ్స్​ కేసు ఏమైంది?’’: టీఆర్​ఎస్​ ప్రభుత్వంపై బండి సంజయ్​ ధ్వజం

బండి సంజయ్ (ఫైల్ ఫోటో)

బండి సంజయ్ (ఫైల్ ఫోటో)

హైదరాబాద్ లో పెను కలకలం సృష్టించిన రాడిసన్​ పబ్​ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలెన్నో వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఈ కేసులో ప్రభుత్వ చిత్తశుద్ధిని పలువురు వేలెత్తి చూపుతున్నారు. అందులో ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు ముందున్నాయి.

హైదరాబాద్ లో పెను కలకలం సృష్టించిన తాజా డ్రగ్స్ కేసు (Hyderabad Dugs case)లో సంచలన విషయాలెన్నో వెలుగులోకి వస్తున్నాయి. బంజారాహిల్స్ ప్రాంతంలోని రాడిసన్ బ్లూ పబ్బుపై శనివారం అర్ధరాత్రి తర్వాత పోలీసులు దాడి చేయగా, డ్రగ్స్ పార్టీ గుట్టు రట్టయింది. సినీ, రాజకీయ ప్రముఖుల పిల్లలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పిల్లలు పలువురు ఈ కేసులో పట్టుబడ్డారు. అయితే ఈ కేసులో ప్రభుత్వ చిత్తశుద్ధిని పలువురు వేలెత్తి చూపుతున్నారు. అందులో ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు ముందున్నాయి. టీపీసీసీ చీఫ్​ రేవంత్ (TPCC Chief revanth)​ కూడా టీఆర్​ఎస్​ ప్రభుత్వ విచారణపై అనుమానం వ్యక్తం చేశారు. తాజాగా బీజేపీ చీఫ్​ బండి సంజయ్ (Bandi Sanjay)​ కూడా తెలంగాణ ప్రభుత్వం (Government of Telangana)పై సందేహాలు వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ని డ్రగ్స్‌కు (drugs) అడ్డాగా మార్చిన ఘనత టీఆర్ఎస్ (TRS)  ప్రభుత్వానిదేనన్నారు. డ్రగ్స్‌తో సంబంధం వున్న 15 మంది ఐటీ ఉద్యోగులను తొలగించారని ఆయన ఆరోపించారు.

పంజాబ్​లో ప్రభుత్వమే కూలిపోయింది..

డ్రగ్స్‌ (drugs)ను నిర్మూలిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఉడ్తా హైదరాబాద్ అనే పరిస్ధితి తీసుకొచ్చారని ఆయన ఎద్దేవా చేశారు. డ్రగ్స్ వల్లే పంజాబ్‌ (Punjab)లో ప్రభుత్వం కూలిపోయిందని బండి సంజయ్ గుర్తుచేశారు. కెల్విన్ అనేక పేర్లు చెప్పాడని పోలీసులు చెప్పారని.. వాళ్లంతా ఏమయ్యారని ఆయన ప్రశ్నించారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణ ఏమైందని బండి సంజయ్ నిలదీశారు. ఈడీకి ఎందుకు సహకరించడం లేదని ఆయన ప్రశ్నించారు.

20మందికి డ్రగ్స్ సరఫరా..

మరోవైపు హైదరాబాద్‌లో డ్రగ్స్ కేసు (Hyderabad drugs case)లో కీలక విషయాలు తెరపైకి వస్తున్నాయి. రాడిసన్ బ్లూ హోటల్‌లోని ఫుడ్ మింక్ పబ్ కేసులో అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. మింక్ పబ్ వ్యవహారంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు అధికారులు. అయితే పబ్‌లో పట్టుబడ్డ వారిలో కిందరు డ్రగ్స్ తీసుకున్నట్లుగా ఆధారాలు దొరికాయన్నారు. పబ్‌లో 20మందికి డ్రగ్స్ సరఫరా అయినట్లు పోలీసులకు ఆధారాలు లభ్యమమయ్యాయి. డ్రగ్స్ తీసుకున్న 20 మందికి నోటీసులు ఇచ్చే పనిలో పోలీసులు ఉన్నారు.

డ్రగ్స్ తీసుకున్న విఐపిలకు నోటీసు ఇచ్చే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం. పబ్ నిర్వహాకుడు మేనేజర్ అనిల్ తో పాటు అభిషేక్ కనుసన్నల్లోనే డ్రగ్స్ సరఫరా.. జరిగినట్లు తెలుస్తోంది. అభిషేక్ కాంటాక్ట్ లిస్ట్ గోవా ముంబైకు చెందిన కొంతమంది వ్యక్తుల సమాచారం ఉంది. మేనేజర్ అనిల్ కాంటాక్ట్ లో గతంలో డ్రగ్స్ తో పట్టుబడిన పెడ్లర్స్‌తో సంబంధాలు ఉన్నట్లుగా గుర్తించారు. గోవా, ముంబై లో నుంచి అనిల్.. డ్రగ్స్ తెప్పించినట్లుగా ఇచ్చినట్టుగా పోలీసులకు ఆధారాలు..దొరికినట్లు తెలుస్తోంది.

గత వారం పబ్‌లో డ్రగ్స్ వాడుతున్నట్లు సమాచారం రావడంతో అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో పలువురు ప్రముఖులు, రాజకీయ, సినీ సెలబ్రిటీల పిల్లలు పట్టుబడ్డారు. రాత్రి మూడు గంటల ప్రాంతంలో పబ్‌పై దాడులు చేసిన పోలీసులు మొత్తం 150మందిని అదుపులోకి తీసుకొని స్టేషన్‌ను తరలించారు. వారిని విచారించి ఆ తర్వాత ఉదయం 9 గంటల ప్రాంతంలో ఇళ్లకు వదిలి పెట్టారు.

First published:

Tags: Bandi sanjay, Drugs case, Hyderabad, Tollywood drugs case

ఉత్తమ కథలు