హోమ్ /వార్తలు /తెలంగాణ /

Bandi sanjay | Ganesh Chaturthi: ‘‘హిందువులారా.. సద్ది కట్టుకుని ట్యాంక్​బండ్​ వద్దకు రండి’’:  బండి సంజయ్​

Bandi sanjay | Ganesh Chaturthi: ‘‘హిందువులారా.. సద్ది కట్టుకుని ట్యాంక్​బండ్​ వద్దకు రండి’’:  బండి సంజయ్​

బండి సంజయ్​ (ఫైల్​)

బండి సంజయ్​ (ఫైల్​)

గణేష్‌ నవరాత్రుల (Ganesh Chaturthi) సందర్భంగా రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్‌ (TRS)కి ప్రతిపక్ష బీజేపీకి మధ్య మరోసారి వార్ కొనసాగుతోంది. ట్యాంకు బండ్​పై గణేశుడి విగ్రహాల నిమజ్జనం అంశం కీలక మలుపులు తిరుగుతోంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  గణేష్‌ నవరాత్రుల (Ganesh Chaturthi) సందర్భంగా రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్‌ (TRS)కి ప్రతిపక్ష బీజేపీకి మధ్య మరోసారి వార్ కొనసాగుతోంది. ట్యాంకు బండ్​పై గణేశుడి విగ్రహాల నిమజ్జనం అంశం కీలక మలుపులు తిరుగుతోంది. హుస్సేన్​ సాగర్​ (Hussain sagar)లో  పరిమిత సంఖ్యలో మాత్రమే వినాయక విగ్రహాల నిమజ్జనానికి అనుమతి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే భాగ్యనగర్​ గణేశ్​ ఉత్సవ కమిటీ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళన సైతం చేసింది. ఇపుడు ఈ వాదనను బీజేపీ ఎత్తుకుంది. ఈ సందర్భంగా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (BJP Chief Bandi Sanjay)​ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందువులందరినీ (Hindus) ట్యాంక్​ బండ్​ (Tank bund) మీదకి రావాల్సిందిగా పిలుపునిచ్చారు. కేసీఆర్​ హిందుత్వ వాదం బయటపెడుదాం అంటూ వెల్లడించారు.

  బండి సంజయ్​ పిలుపునిస్తూ.. ‘‘హిందువులారా.. సద్ది కట్టుకుని ట్యాంక్ బండ్ వద్దకు రండి. ట్యాంక్ బండ్ పైనే వినాయక నిమజ్జనం చేద్దాం. ట్యాంక్ బండ్ పై హిందువులు ఇబ్బందులు పడుతుంటే దారుస్సలాంలో సంబురాలు చేసుకుంటున్నారు . దారుస్సలాంను సంతృప్తి పర్చడానికి హిందువులను ఇబ్బంది పెడతారా? –

  నిఖార్సైన హిందువని చెప్పుకుంటున్న కేసీఆర్ కు కావాల్సింది ఇదేనా?.

  భాగ్యనగర ఉత్సవ సమితి దీక్షలకు దిగొచ్చి ట్యాంక్ బండ్ పై ఇప్పుడు  క్రేన్లు ఏర్పాటు చేస్తున్నారు. అయినా ఇప్పటికీ తూతూ మంత్రంగానే నిమజ్జన ఏర్పాట్లు. మంత్రుల అబద్దాలకు అడ్డూఅదుపు లేదా? మున్సిపల్ మంత్రి నాస్తికుడు. నిఖార్సైన కేసీఆర్ హిందుత్వ బండారాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం.”అని వ్యాఖ్యానించారు బండి సంజయ్​. కాగా, బండి సంజయ్​ వ్యాఖ్యల నేపథ్యంలో పోలీసులు అలెర్ట్​ అయ్యారు.

  నిబంధనల పేరుతో..

  తెలంగాణలో బీజేపీ (BJP) , టీఆర్ఎస్‌కి (TRS) మధ్య బయటకు కనిపించని వార్ జరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా జరుపుకునే గణేష్ నవరాత్రి ఉత్సవాలకు, గణేష్ నిమజ్జనం కార్యక్రమాల ఏర్పాట్లను ప్రభుత్వం చేపట్టడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇంతకుముందే విమర్శించారు. కేవలం సుప్రీం కోర్టు ఉత్తర్వుల పేరుతో గణేష్‌ నిమజ్జనం కార్యక్రమాన్ని ఎలాగైనా అడ్డుకోవాలనే ఆలోచనలో టీఆర్ఎస్ సర్కారు ఉందని ఆయన ఆరోపించారు. కేవలం ఒక వర్గం ఓట్ల కోసం యావత్ హిందూ సమాజాన్ని చులకన చేయడం, నిర్లక్ష్యంగా చూడటం మంచి పద్దతి కాదన్నారు బండి సంజయ్. గణేష్‌ నిమజ్జనం కార్యక్రమాన్ని తాము ప్రశాంతంగా నిర్వహించాలని చూస్తుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం నిబంధనల పేరుతో అలజడి సృష్టించాలని చూస్తోందన్నారు.

  ఎంఐఎం (MIM) లాంటి మతతత్వ పార్టీని సంతృప్తి పరచడానికే వినాయక ఉత్సవాలను ప్రభుత్వం అడ్డుకుంటోందన్నారు. కేవలం ఒక వర్గం ఓట్ల కోసం ఇంతటి రాజకీయ దిగజారుడు తనం సరికాదని చెప్పారు బండి సంజయ్. కరోనా విపత్కర పరిస్థితుల్లో రంజాన్‌ పండుగకు ఓల్డ్ సిటీలో ముస్లింలు ప్రార్ధనలు చేసుకుంటే హిందువులు ఎవరూ అభ్యంతరం చెప్పలేదన్నారు. అలాంటి ఇప్పుడు టీఆర్ఎస్‌ ప్రభుత్వం హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తోందన్నారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Bandi sanjay, Ganesh Chaturthi​ 2022

  ఉత్తమ కథలు