Home /News /telangana /

HYDERABAD BIOLOGICAL E SEEKS PERMISSION FOR CORBEVAX COVID VACCINE TO VACCINATE CHILDREN BETWEEN THE AGE OF 5 TO 12 YEARS PRV

Covid Vaccine for Children: 5 నుంచి 12 ఏళ్ల వయస్సున్న చిన్నారులకూ కోవిడ్​ వ్యాక్సిన్​.. అనుమతి కోరుతూ హైదరాబాద్​ సంస్థ దరఖాస్తు.. ధర ఎంత ఉంటుందంటే..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వ్యాక్సిన్ ప్రక్రియను మరింత వేగం చేసే దిశగా దేశ వ్యాప్తంగా అడుగులు పడుతున్నాయి. ఫార్మా కంపెనీ ‘బయలాజికల్‌ ఈ’ తయారుచేసిన కొర్బెవాక్స్‌ వ్యాక్సిన్‌కు సంబంధించి గుడ్​న్యూస్​​ వచ్చింది.

    ప్రస్తుతం కరోనా (Corona)ను ఎదుర్కోడానికి మన దగ్గర ఉన్న ప్రధాన ఆయుధం వ్యాక్సిన్ (Vaccine) మాత్రమే.. ప్రస్తుతం 12 ఏళ్లు నిండిన వారికి (Covid Vaccine for Children) మాత్రమే వ్యాక్సిన్ సరఫరా చేస్తోంది. ఇప్పటికే చాలామంది వ్యాక్సినేట్ అయ్యి ఉన్నారు. ఈ వ్యాక్సిన్ ప్రక్రియను మరింత వేగం చేసే దిశగా దేశ వ్యాప్తంగా అడుగులు పడుతున్నాయి. హైదరాబాద్ (Hyderabad)​కు చెందిన ఫార్మా కంపెనీ ‘బయోలాజికల్​ ఈ (Biological E) ’ తయారుచేసిన కొర్బెవాక్స్‌ వ్యాక్సిన్‌ (Corbevax vaccine)కు సంబంధించి గుడ్​న్యూస్​​ వచ్చింది. బయోలాజికల్​ ఈ (Biological E)  వ్యాక్సిన్​ అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలంటూ కంపెనీ దరఖాస్తు చేసుకుంది.  ఐదేళ్ల నుంచి పన్నెండేళ్ల వయసు (Between 5 to 12 years) వారికి  టీకా వేసేందుకు దీన్ని రెడీ చేస్తున్నారు. కోవ్యాగ్జిన్, జైడస్ క్యాడిలాకు చెందిన జైకోవ్‌-డీ తర్వాత భారత్‌లో తయారవుతున్న మూడో వ్యాక్సిన్ కొర్బెవాక్సిన్ (Corbevax).

    ఫిబ్రవరిలో డీసీజీఏ ఆమోదం..

    బయోలాజికల్​ ఈ (Biological E) వ్యాక్సిన్‌ కొర్బెవాక్స్‌ (Corbevax) ట్రయల్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలను సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్‌ కమిటీకి ఆ సంస్థ అందించినట్టు ఏఎన్‌ఐ వార్తాసంస్థ పేర్కొంది. 12 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న వాళ్లకు కోర్బెవ్యాక్స్‌ వేసేందుకు ఫిబ్రవరిలో డీసీజీఏ ఆమోదం తెలిపింది. వ్యాక్సిన్​ కొన్ని షరతులతో కూడిన అనుమతి ఇచ్చినట్టు బయోలాజికల్​ ఈ పేర్కొంది. తాజాగా ఐదేళ్ల నుంచి 12 ఏళ్ల మధ్య వయస్సున్న చిన్నారులకు (Covid Vaccine for Children) టీకా వేసేందుకు అనుమతి కోరింది.

    కొర్బెవాక్స్‌కు సంబంధించిన అనుమతి త్వరలోనే వస్తుందని బయోలాజికల్​ ఈ సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది. భద్రత, ఇమ్యునోజెనిసిటీ డేటాను చూసిన తర్వాత మాత్రమే EUAకి SEC సిఫార్సు చేసింది. ఈ వ్యాక్సిన్‌ (Corbevax)కు పన్నులు మినహాయించి రూ.145 ఖర్చవుతుందని అంచనా. నిర్ణీత వ్యవధిలో రెండు సార్లు లబ్ధిదారులకు కొర్బెవాక్స్‌ ఇవ్వనున్నారని సమాచారం.



    కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఐదు కోట్ల కార్బెవాక్స్ (Corbevax) వ్యాక్సిన్ డోస్‌లను కొనుగోలు చేసి కొన్ని రాష్ట్రాలకు పంపిణీ చేసిందని అధికారిక వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ 2021లో బయోలాజికల్​  ఈ ఫేజ్ II మరియు ఫేజ్ III క్లినికల్ ట్రయల్స్ కోసం దరఖాస్తు చేసింది.

    గతంలో ఐదు కోట్ల డోసులు ఆర్డర్​..

    బయోలాజికల్ ఈ కొర్బెవాక్స్‌ తొలిసారి స్వదేశీంగా అభివృద్ధి చేసిన రిసెప్టర్-బైండింగ్ డొమైన్ (RBD) ప్రోటీన్ సబ్-యూనిట్ వ్యాక్సిన్. ఆర్‌బీడీ అనేది సార్స్‌-కొవ్‌-2 స్పైక్ ప్రోటీన్‌లో భాగం. వైరస్ స్పైక్ ప్రొటీన్‌ను హోస్ట్ సెల్‌లకు అటాచ్ చేసుకుంటుంది.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Children, Corona Vaccine, Covid, Covid vaccine, Hyderabad

    తదుపరి వార్తలు