హోమ్ /వార్తలు /తెలంగాణ /

Cow Dung Fuel: ఆవు పేడతో నడిచే కార్ల తయారీ.. మారుతి సుజుకి సంచలనం..!

Cow Dung Fuel: ఆవు పేడతో నడిచే కార్ల తయారీ.. మారుతి సుజుకి సంచలనం..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Cow Dung Fuel: బయో ఇంధనం ఉత్పత్తి కోసం నేషనల్ డెయిరీ డెవలప్ మెంట్ బోర్డు, బనాస్ డెయిరీ సంస్థతో తాము ఒప్పందం కుదుర్చుకున్నట్టు మారుతి సుజుకి తెలిపింది. జపాన్‌లో ఆవుపేడ నుంచి ఇంధనం తయారుచేసే ఫ్యుజిసాన్ అస్గిరి బయోమాస్ సంస్థలోనూ పెట్టుబడులు పెట్టామని వెల్లడించింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

పర్యావారణ కాలుష్యం (Pollution).. ఇప్పుడు యావత్ ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య. అన్ని దేశాలు కూడా వాతవారణ కాలుష్యంపై దృష్టిసారించాయి. కాలుష్యాన్ని తగ్గించుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఈక్రమంలో కాలుష్య రహిత ఇంధనంపై పెద్ద ఎత్తున ప్రయోగాలు జరుగుతున్నాయి. అందుకే అన్ని దేశాలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను (Electric Vehicles) ప్రోత్సహిస్తున్నాయి.  జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ సుజుకీ కూడా ప్రత్యామ్నాయ ఇంధనంపై దృష్టిసారించింది. సుజుకీ భారత అనుబంధ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki) ఆవు పేడతో నడిచే కార్లను తయారు చేసే పనిలో నిమగ్నమైంది.

Budget-2023 : రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. ఆ సాయం రూ.8వేలకు పెంచే అవకాశం..!

ఒక నివేదిక ప్రకారం.. మనదేశంలో సీఎన్జీతో నడుస్తున్న కార్లలో 70 శాతం మారుతి సుజుకికి చెందినవే ఉన్నాయి.ఈ నేపథ్యంలో మారుతీ సుజుకికి చెందిన సిఎన్‌జి మోడల్స్‌ని బయోగ్యాస్‌తో నడపగలిగితే అది విప్లవాత్మకమవుతుంది. ఈ దిశగా బయోగ్యాస్‌పై మారుతి సుజుకీ పనిచేస్తోంది.  ఎలాగైనా సరే CNGకి ప్రత్యామ్నాయంగా బయోగ్యాస్‌ను తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. బయోగ్యాస్‌తో వాహనాలు నడిచే టెక్నాలజీని అభివృద్ధి చేస్తోంది.

కొనసాగుతున్న లేఆఫ్స్ ఫీవర్.. పోటీ పడి మరీ ఉద్యోగాలు తీసేస్తున్న కంపెనీలు ఇవే..

సాంప్రదాయ ఇంధనంపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్, ఫ్లెక్స్ ఇంధనం , బయోగ్యాస్ ప్రాజెక్టులపై మారుతి సుజుకి కంపెనీ నిరంతరం దృష్టి సారిస్తోంది. పెరుగుతున్న కాలుష్యం, ఖరీదైన సాంకేతికతను ఎదుర్కోవటానికి.. ఈ కంపెనీ బయోగ్యాస్ ప్రాజెక్ట్‌పై పనిచేస్తోంది. ఆవు పేడతో బయోగ్యాస్ తయారవుతుంది.  మనదేశంలో ఆవు పేడకు కొదువ లేదు. ముఖ్యంగా  గ్రామీణ ప్రాంతాల్లో పాడి వ్యర్థాల పరిమాణం ఎక్కువగా ఉంటుంది. దాని సహాయంతో బయోగ్యాస్‌ను సులభంగా తయారు చేయవచ్చు అందువల్ల బయో గ్యాస్ ఉత్పత్తికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.   ఈ బయో ఇంధనాన్ని తమ సీఎన్జీ మోడల్స్‌లో వినియోగిస్తామని మారుతి  సుజుకి తెలిపింది. ఆవుపేడతో తయారయ్యే ఈ ఇంధనాన్ని భారత్‌తో పాటు ఆఫ్రికా, జపాన్‌ వంటి దేశాల్లోనూ వినియోగించనుంది.

ఈ ఇంధన ప్రత్యామ్నాయం దేశంలో కర్బన ఉద్గారాలను తగ్గించడమే కాకుండా... దేశ ఆర్థికాభివృద్ధికి కూడా దోహదపడుతుందని మారుతి సుజుకి తెలిపాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొంది.  ఈ బయో ఇంధనం ఉత్పత్తి కోసం నేషనల్ డెయిరీ డెవలప్ మెంట్ బోర్డు, బనాస్ డెయిరీ సంస్థతో తాము ఒప్పందం కుదుర్చుకున్నట్టు మారుతి సుజుకి తెలిపింది. జపాన్‌లో ఆవుపేడ నుంచి ఇంధనం తయారుచేసే ఫ్యుజిసాన్ అస్గిరి బయోమాస్ సంస్థలోనూ పెట్టుబడులు పెట్టామని.. ఈ కంపెనీతో కలిసి టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నామని పేర్కొంది.

First published:

Tags: Business, Hyderabad, Local News

ఉత్తమ కథలు