హోమ్ /వార్తలు /తెలంగాణ /

Vaishali Kidnap Case: వైశాలి కిడ్నాప్ కేసులో కీలక పురోగతి..ఎట్టకేలకు నవీన్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

Vaishali Kidnap Case: వైశాలి కిడ్నాప్ కేసులో కీలక పురోగతి..ఎట్టకేలకు నవీన్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

దాడిలో గాయపడ్డ వైశాలి కుటుంబసభ్యులు

దాడిలో గాయపడ్డ వైశాలి కుటుంబసభ్యులు

రంగారెడ్డి జిల్లా (Rangareddy) ఆదిభట్లలో జరిగిన వైశాలి (Vaishali) కిడ్నాప్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. నిన్న పట్టపగలు మిస్టర్ టీ ఓనర్ నవీన్ రెడ్డి (Naveen reddy) ఏకంగా 100 మందితో యువతి ఇంటికొచ్చి నానా హంగామా చేశాడు. యువతి ఇంటి వద్ద ఉన్న కార్లను ధ్వంసం చేసి, అడ్డొచ్చిన యువతీ తల్లిదండ్రులు, బంధువులను కూడా కర్రలతో కొట్టారు. అనంతరం డెంటల్ డాక్టర్ వైశాలిని నవీన్ రెడ్డి కిడ్నాప్ చేశాడు. సినిమా రేంజ్ ను తలపించిన ఈ కిడ్నాప్ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనను ఛాలెంజింగ్ గా తీసుకున్న పోలీసులు 6 గంటల్లోనే యువతి ఆచూకీని కనిపెట్టారు. 

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

రంగారెడ్డి జిల్లా (Rangareddy) ఆదిభట్లలో జరిగిన వైశాలి (Vaishali) కిడ్నాప్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. నిన్న పట్టపగలు మిస్టర్ టీ ఓనర్ నవీన్ రెడ్డి (Naveen reddy) ఏకంగా 100 మందితో యువతి ఇంటికొచ్చి నానా హంగామా చేశాడు. యువతి ఇంటి వద్ద ఉన్న కార్లను ధ్వంసం చేసి, అడ్డొచ్చిన యువతీ తల్లిదండ్రులు, బంధువులను కూడా కర్రలతో కొట్టారు. అనంతరం డెంటల్ డాక్టర్ వైశాలిని నవీన్ రెడ్డి కిడ్నాప్ చేశాడు. సినిమా రేంజ్ ను తలపించిన ఈ కిడ్నాప్ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనను ఛాలెంజింగ్ గా తీసుకున్న పోలీసులు 6 గంటల్లోనే యువతి ఆచూకీని కనిపెట్టారు.

Adibatla Kidnap Case: 100 మందితో యువతి కిడ్నాప్.. పోలీసుల పట్టించుకోలేదని బంధువుల ఆగ్రహం

షాకింగ్ స్టేట్ మెంట్..నిజమా? కాదా?

ఈ ఘటనకు సంబంధించి ప్రముఖ నిందితుడు నవీన్ రెడ్డిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా నిన్న దాడికి పాల్పడిన వారిలో ఎక్కువ మంది అతని టీ షాప్ లో పని చేసే వారు కాగా మరికొందరు అతని స్నేహితులుగా తెలుస్తుంది. ఇప్పటివరకు 31 మందిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. వారిపై పలు సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు. కేసులో భాగంగా నవీన్ (Naveen reddy) స్టేట్ మెంట్ ను రికార్డ్ చేసిన పోలీసులకు షాకింగ్ విషయాలు వెల్లడించినట్టు వార్తలు వస్తున్నాయి. 2021 ఆగష్టు 4న బాపట్ల జిల్లా వలపర్ల ఆలయంలో వైశాలి (Vaishali) తో తనకు వివాహం జరిగిందని చెప్పుకొచ్చాడు. అయితే BDS పూర్తయ్యే వరకు ఫోటోలు బయటకు రానీయొద్దని నవీన్ స్టేట్ మెంట్ లో తెలిపాడు. అయితే ఆమె కండీషన్ మేరకే నేను పెళ్ళికి సంబంధించిన ఫోటోలను బయటపెట్టలేదని నవీన్ చెప్పుకొచ్చినట్లు తెలుస్తుంది.

Trending: పోలీస్ స్టేషన్‌కు చేరిన వధువు మేకప్ పంచాయతీ.. రూ. 3 వేలకు అలా మేకప్ చేయలేనంటూ..

నాతో డబ్బులు ఖర్చు పెట్టించారు..

వైశాలి BDS కంప్లీట్ అయిన తరువాత పెళ్లి చేస్తామని ఆమె తల్లిదండ్రులు మాట ఇచ్చారని, పెళ్లి పేరుతో నాతో డబ్బులు కూడా ఖర్చు పెట్టించారని నవీన్ పోలీసులకు తెలిపాడని, నా డబ్బుతో వారు గోవా , అరకు , మంగళూరు సహా పలు ప్రాంతాలకు వెళ్లారని, అంతేకాదు ఖరీదైన వోల్వో కారు, ఖరీదైన రెండు కాఫీ షాపులను వైశాలి  (Vaishali) తండ్రి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించినట్టు నవీన్ రెడ్డి (Naveen reddy) స్టేట్ మెంట్ ఇచ్చాడని సమాచారం. మరి ఇది నిజమా కాదా అనేది తెలియాల్సి ఉంది.

అయితే వైశాలికి, నవీన్ కు ఎటువంటి సంబంధం లేదని యువతి కుటుంబసభ్యులు చెబుతున్నారు. మా ఇంటి సమీపంలో టీ షాప్ పేటి వైశాలి బయటకు వచ్చినప్పుడల్లా ఇబ్బంది పెట్టేవాడిని చెప్పుకొచ్చారు. కొద్దిరోజుల నుంచి ఈ వ్యవహారాన్ని పోలీసుల దృష్టికి తాము తీసుకెళ్లామని..అయినా పోలీసులు తమ ఫిర్యాదును పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. అప్పుడే పట్టించుకోని ఉంటే ఇలా జరిగుండేది కాదని వైశాలి కుటుంబసభ్యులు వాపోయారు.

First published:

Tags: Crime, Crime news, Hyderabad, Kidnap, Telangana

ఉత్తమ కథలు